త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandar Rao | రాహుల్.. తెలంగాణ‌కు రండి, పారిపోకుండా పార్ల‌మెంటుకూ రండి.. మీకున్న నాలెడ్జ్‌తోనే మాట్లాడండి

Ramchandar Rao | రాహుల్ గాంధీ అశోక్ న‌గ‌ర్‌లో ప్ర‌క‌టించిన జాబ్ క్యాలెండర్‌ ఏమైంద‌ని.. రెండు ల‌క్ష‌ల ఉద్యోగాలు ఏమ‌య్యాయ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు ప్ర‌శ్నించారు. ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిర‌స‌న‌ల‌పై కేంద్ర హోంమంత్రి పార్ల‌మెంట్‌కు వ‌చ్చి ప్ర‌క‌ట‌న చేస్తామంటే రాహుల్ ఎందుకు పారిపోతున్నార‌ని ఎద్దేవా చేశారు. ఝార్ఖండ్‌ ఘటనపై ఎందుకు మౌనంగా ఉన్నారని నిల‌దీశారు.

S

Telangana | Published On Aug 11, 2026, 3.43 pm IST

Ramchandar Rao | రాహుల్.. తెలంగాణ‌కు రండి, పారిపోకుండా పార్ల‌మెంటుకూ రండి.. మీకున్న నాలెడ్జ్‌తోనే మాట్లాడండి
Advertisement
  • అంతేగాని పార్ల‌మెంటు నుంచి పారిపోతా అంటే ఎట్లా?
  • అన్ని ప్ర‌శ్న‌ల‌కు హోంమంత్రి జ‌వాబిస్త‌రు.. అయినా మీరు ఎందుకొస్త‌లే?
  • కాక్రోచ్ నిర‌స‌న‌పై మాట్లాడిన‌వ్‌.. జార్ఖండ్ విద్యార్థుల కొట్లాట‌పై ఎందుకు మౌనంగా ఉన్న‌వ్‌?
  • మీడియా స‌మావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు నిల‌దీత‌

Ramchandar Rao | త్రినేత్ర‌.న్యూస్: రాహుల్ గాంధీ అశోక్ న‌గ‌ర్‌లో ప్ర‌క‌టించిన జాబ్ క్యాలెండర్‌ ఏమైంద‌ని.. రెండు ల‌క్ష‌ల ఉద్యోగాలు ఏమ‌య్యాయ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు ప్ర‌శ్నించారు. ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిర‌స‌న‌ల‌పై కేంద్ర హోంమంత్రి పార్ల‌మెంట్‌కు వ‌చ్చి ప్ర‌క‌ట‌న చేస్తామంటే రాహుల్ ఎందుకు పారిపోతున్నార‌ని ఎద్దేవా చేశారు. ఝార్ఖండ్‌ ఘటనపై ఎందుకు మౌనంగా ఉన్నారని నిల‌దీశారు. రాహుల్ లోక్‌స‌భ‌కొస్తే అన్ని ప్ర‌శ్న‌ల‌కు అమిత్ షా జ‌వాబిస్తార‌న్నారు. ఈమేర‌కు మంగ‌ళ‌వారం ఆయ‌న నాంప‌ల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీపై త‌న‌దైన శైలిలో విరుచుకుపడ్డారు.

రాహుల్ గారు.. గాంధీ తెలంగాణ‌కు రండి. అశోక్ న‌గ‌ర్‌లో ప్ర‌క‌టించిన జాబ్ క్యాలెండర్ ప్ర‌క‌టించారు. మీ జాబ్ క్యాలెండ‌ర్ ఎక్క‌డ పోయింది? ఎక్క‌డ పోయిన‌య్ మీ రెండు ల‌క్ష‌ల ఉద్యోగాలు? ఎక్క‌డ పోయిన‌య్ మీ ఫీ రీయింబ‌ర్స్‌మెంట్‌? మా నాయ‌కులు ఇప్ప‌టికీ నాలుగు ల‌క్ష‌ల సంత‌కాలు తీసుకున్న‌రు. వాళ్ల మీద లాఠీచార్జ్ చేశారు. రేవంత్‌రెడ్డి అక్క‌డ లాఠీచార్జ్‌ని వ్య‌తిరేకిస్త‌డు.. ఇక్క‌డ‌నేమో లాఠీచార్జ్ చేయిస్త‌డు. ఇదేం ప‌ద్ధ‌తి?

ఢిల్లీలోని జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద కాక్రోచ్ నిర‌స‌నను చూశాం. ఆ నిర‌స‌న‌లో 90 శాతం మంది బ‌య‌టి వాళ్లే ఉన్నారు. వారు దేశానికి వ్య‌తిరేకంగా స్లోగ‌న్స్ ఇచ్చారు. జార్ఖండ్‌లో నిర‌స‌న తెలుపుతున్న వాళ్ల‌లో అంద‌రూ స్టూడెంట్సే ఉన్నారు. ఇక్క‌రు కూడా బ‌య‌టి వాళ్లు లేరు. ఏ రాజ‌కీయ పార్టీ ప్ర‌మేయం లేదు అక్క‌డ‌. విద్యార్థి నాయకుడి ఆరోగ్య ప‌రిస్థితి బాలేకుంటే రాహుల్ గాంధీ ఎందుకు ఖండించ‌లేదు, స్పందించ‌లేదు. సోన‌మ్‌వాంగ్‌చుక్‌, న‌డ్డా గారు వెళ్లి మాట్లాడారు. జార్ఖండ్ విద్యార్థులు సీరియ‌స్‌గా కొట్లాడుతున్నారు. జార్ఖండ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ను సీబీఐకు అప్ప‌జెప్ప‌మంటే ఎందుకు అప్ప‌జెప్త‌లేరు? రాహుల్ గాంధీ ఎందుకు పోవ‌డం లేదు అక్క‌డికి. జార్ఖండ్ ప్ర‌భుత్వం స్పందిస్త‌లేదు.

నాన్ స్టూడెంట్స్ గురించి మాట్లాడ‌త‌వ్‌.. కానీ రియ‌ల్‌ స్టూడెంట్స్ గురించి మాట్లాడ‌వా?

పోలీసులు కింద వైర్లు వేయ‌డంతో విద్యార్థుల కాళ్ల‌కు ర‌క్తాలు కారుతున్న‌య్‌. లాఠీచార్జ్ చేస్తున్న‌రు. ర‌బ్బ‌ర్ బుల్లెట్‌లు కొడుతున్న‌రు. నాన్ స్టూడెంట్స్ గురించి రాహుల్ గాంధీ మాట్లాడ‌త‌రు.. కానీ జార్ఖండ్ విద్యార్థుల గురించి ఎందుకు మాట్లాడరు? అస‌లైన విద్యార్థుల స‌మ‌స్య‌ల మీద రాహుల్ ఎందుకు సైలెంట్ అయ్యారు.

ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ను రిజైన్ చేయ‌మ‌న్నారు.. చేశారు. ఫైరింగ్ ఎవ‌రు చేశారో చెప్పాల‌ని ఇప్పుడు అంటున్న‌రు. అది కూడా చెప్ప‌డానికి అమిత్ షా సిద్ధంగా ఉన్నారు. మీరు పార్ల‌మెంటుకు ఎందుకు వ‌స్త‌లేరు మ‌రి? రాహుల్ పార్ల‌మెంట్‌కు రాకుండా త‌ప్పించుకుంటున్న‌రు. ఆయ‌న‌కు స‌బ్జెక్టు లేన‌ట్టుంది పాపం. అది లేక ఆయ‌న అటెండ్ అయిత‌లేరు. నీట్ పేప‌ర్ లీకేజీ మీద చ‌ట్టం కూడా తెచ్చాం. కేంద్ర హోంమంత్రి స్టేట్ మెంట్ ఇవ్వ‌డానికి రెడీగా ఉన్నారు. దానికి కూడా స‌హ‌క‌రించ‌డం లేదు.

రాహుల్‌గాంధీ మీరు పార్ల‌మెంటుకు రండి.. పారిపోకండి. హోంమినిస్ట‌ర్ ప్ర‌తి ప్ర‌శ్నకు స‌మాధానం ఇస్తారు. అంతా పార్ల‌మెంట్ హాల్‌లో ఉంటుంది. రోడ్ల మీద డ్రామాలు ఉండ‌వు. జార్ఖండ్ విద్యార్థుల మీద జ‌రుగుతున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నం. విద్యార్థుల‌కు ఎందుకు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం లేదు. దేశాన్ని ఒక దిశ‌లో తీసుకుపోయేలా విద్యార్థులు కొట్లాడుతున్న‌రు. తెలంగాణల కూడా పేప‌ర్లు లీకైన‌య్‌. ఇక్క‌డ కూడా ప్ర‌భుత్వం ప‌ట్టించుకుంట‌లే. కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల భ‌విష్య‌త్‌ను అంధ‌కారంలోకి తోసేసి రాజ‌కీయాలు చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వారికి న్యాయం చేయ‌ట్లేదు.

మీరు ఎందుకొస్త‌లేర‌ని ప్ర‌జ‌లు అడుగుతున్న‌రు

అయ్యా రాహుల్ పార్ల‌మెంటుకు రండి. మీకున్న నాలెడ్జ్‌తో మాట్లాడండి. లేక‌పోతే ఎవ‌రినైనా అడిగి మాట్లాడండి. అంతేగానీ పార్ల‌మెంట్ నుంచి పారిపోతా అంటే ఎట్లా అండి. మీరు స‌మాధానం చెప్పాల‌ని బీజేపీతో పాటు దేశ ప్ర‌జ‌లు అడుగుతున్నారు. రాహుల్ తీరును, రేవంత్‌రెడ్డి తీరును తీవ్రంగా ఖండిస్తున్నం. జార్ఖండ్ విద్యార్థుల‌కు పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నం అని రాంచంద‌ర్‌రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement