Surya Grahan 2026 | ఆగస్టు 12న సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా..?
Surya Grahan 2026 | ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఏర్పడనున్న సూర్య గ్రహణాన్ని చాలా మంది 13వ తేదీన జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే చాలా వరకు ప్రాంతాల్లో బుధవారమే గ్రహణం కనిపిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఆయా దేశాల మధ్య నెలకొన్న కాలమానాల వ్యత్యాసం కారణంగా చాలా మందికి ఈ సందేహం ఉందని, అయితే కాలమానం ప్రకారం సరిగ్గా అర్ధరాత్రి సమయంలో గ్రహణం ఏర్పడనుంది కనుక దీన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అంటున్నారు.
Surya Grahan 2026 | ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఏర్పడనున్న సూర్య గ్రహణాన్ని చాలా మంది 13వ తేదీన జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే చాలా వరకు ప్రాంతాల్లో బుధవారమే గ్రహణం కనిపిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఆయా దేశాల మధ్య నెలకొన్న కాలమానాల వ్యత్యాసం కారణంగా చాలా మందికి ఈ సందేహం ఉందని, అయితే కాలమానం ప్రకారం సరిగ్గా అర్ధరాత్రి సమయంలో గ్రహణం ఏర్పడనుంది కనుక దీన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అంటున్నారు. కాగా ప్రస్తుతం ఏర్పడనున్న సూర్య గ్రహణం సంపూర్ణమైందని, ఆగస్టు 12నే ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇక ఈ సూర్యగ్రహణం ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంపై ప్రారంభమై, సంపూర్ణ గ్రహణం కనిపించే మార్గం గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, స్పెయిన్, పోర్చుగల్‌లోని కొన్ని ప్రాంతాల మీదుగా కొనసాగుతుందని తెలిపారు.
ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది..?
చంద్రుడు భూమి, సూర్యుడి మధ్య నేరుగా వచ్చి సూర్యుడి ప్రకాశవంతమైన ఉపరితలాన్ని పూర్తిగా కప్పివేసినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రహణం ఆగస్టు 12న ప్రారంభమవుతుంది. భారత్‌లో మాత్రం ఈ ఖగోళ సంఘటన చివరి దశ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగి, భారత ప్రామాణిక కాలమానం ప్రకారం ఆగస్టు 13న తెల్లవారుజామున ముగుస్తుంది. గ్రహణం ప్రపంచవ్యాప్తంగా కనిపించే సమయ క్రమం వేర్వేరుగా ఉంటుంది. గ్రహణం ఆగస్టు 12న ప్రారంభం కానుండగా, సంపూర్ణ గ్రహణ దశ కూడా అప్పుడే మొదలవుతుంది. గ్రహణం గరిష్ఠ స్థాయికి ఆగస్టు 13న చేరుతుంది. అయితే భారత్ సహా కొన్ని కాలమాన దేశాల్లో చివరి దశ ఆగస్టు 13న ముగుస్తుంది.
ఎన్ని గంటలు, ఏయే దేశాలు..
ప్రపంచవ్యాప్తంగా పాక్షిక గ్రహణ దశ ప్రారంభం నుంచి చివరి దశ ముగిసే వరకు ఈ మొత్తం గ్రహణం సుమారు 4 గంటల 23 నిమిషాల పాటు కొనసాగుతుంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేసే సమయాన్ని సంపూర్ణ గ్రహణ దశగా పిలుస్తారు. ఈ సంపూర్ణ దశ సుమారు 2 నిమిషాల 18 సెకన్ల పాటు కొనసాగుతుంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేసే సంపూర్ణ గ్రహణ మార్గం గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, ఉత్తర రష్యా, అట్లాంటిక్ మహాసముద్రం, స్పెయిన్, పోర్చుగల్‌లోని కొన్ని ప్రాంతాల మీదుగా కనిపిస్తుంది. యూరప్‌లోని కొన్ని ప్రాంతాలు, కెనడా, ఉత్తర అమెరికా, వాయవ్య ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణం కూడా కనిపిస్తుంది. భారత్‌లోని ప్రజలు ఈ గ్రహణాన్ని వీక్షించలేరు. కానీ నాసా, యురోపియన్ స్పేస్ ఏజెన్సీ గ్రహణ సమయానికి తమ అధికారిక వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారాలను అందించనున్నాయి. వాటిని చూసి గ్రహణాన్ని వీక్షించవచ్చు.
భారత్‌లో కనిపిస్తుందా..
భారత్‌లోని ప్రజలు ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించలేరు. గ్రహణం సంభవించే సమయంలో భారత్‌లో రాత్రి సమయం ఉంటుంది. భారత ప్రామాణిక కాలమానం ప్రకారం ఆగస్టు 12 రాత్రి సుమారు 9:04 గంటలకు గ్రహణం భారత్‌కు సంబంధించిన సమయ క్రమంలో ప్రారంభమై, ఆగస్టు 13 తెల్లవారుజామున 1:28 గంటల వరకు కొనసాగుతుంది. గ్రహణం భారత్ లో రాత్రి సమయంలో జరుగుతున్నప్పటికీ, దేశవ్యాప్తంగా ఆ సమయంలో సూర్యుడు హారిజాన్ కు దిగువన ఉంటాడు. అందువల్ల భారత్ లో ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించడం సాధ్యం కాదు.
తాజావార్తలు
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు
- ●Horoscope | అక్టోబర్ 5 రాశిఫలాలు.. సహోద్యోగులతో ఇబ్బందులు ఎదురవుతాయి!

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్

Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు



