Tollywood | సీనియర్ సినీ నటుడు కృష్ణేశ్వరరావు కన్నుమూత – సూపర్ హిట్ సినిమాలకు రచయితగా!
టాలీవుడ్ సీనియర్ నటుడు, రచయిత కృష్ణేశ్వరరావు అనారోగ్య సమస్యలతో మంగళవారం కన్నుమూశారు. నటుడిగా భీమిలీ కబడ్డీ జట్టు, వకీల్ సాబ్, విరూపాక్ష, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారుతో పాటు పలు సూపర్ హిట్ సినిమాల్లో కనిపించాడు. రైటర్‌గా శ్రీరాములయ్య జయం మనదేరా, పరశురామ్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేశారు.
Entertainment | Published On Aug 11, 2026, 3.31 pm IST
Tollywood | టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ సినీ నటుడు, రచయిత కృష్ణేశ్వరరావు అనారోగ్య సమస్యలతో మంగళవారం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా శ్వాసకోస, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గుంటూరు ఏటీ అగ్రహారంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. రంగస్థల కళాకారుడిగా కృష్ణేశ్వరరావు నట ప్రయాణం మొదలైంది. సంపద, రోజు చస్తున్న మనిషి, గుర్తు తెలియని శవంతో పాటు పలు నాటకాలు కృష్ణేశ్వరరావుకు మంచి పేరు తీసుకొచ్చాయి. నాటకాల ద్వారా వచ్చిన గుర్తింపుతోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
ప్రచండ భారతం...
కృష్ణంరాజు, గౌతమి హీరోహీరోయిన్లుగా సీనియర్ నటుడు ప్రభాకర్ రెడ్డి తెరకెక్కించిన ప్రచండభారతం సినిమాతో కృష్ణేశ్వరరావు తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. ప్రచండ భారతంలో ఓ కీలక పాత్రలో కనిపిస్తూనేప్రభాకర్‌రెడ్డితో కలిసి ఈ సినిమాకు కథను అందించారు. మోహన్‌బాబు శ్రీరాములయ్య సినిమాకు ఓ రైటర్‌గా పనిచేశారు. జయం మనదేరా, పరశురామ్ సినిమాలకు డైలాగ్స్ సమకూర్చారు. భీమిలి కబడ్డీ జట్టు, భద్రాచలం, వకీల్ సాబ్, విరూపాక్ష, నాంది, వీర తెలంగాణ సినిమాల్లో నటుడిగా డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించాడు.
వంశీతో పరిచయం....
సీనియర్ డైరెక్టర్ వంశీతో ఏర్పడిన పరిచయం కృష్ణేశ్వరరావు సినీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. అప్పటివరకు ఎక్కువగా సీరియస్ రోల్స్ చేసిన కృష్ణేశ్వరరావుకు కమెడియన్‌గా వంశీ కొత్త జీవితాన్ని ప్రసాదించారు. గోపి గోపిక గోదావరి, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, కొంచెం టచ్‌లో ఉంటే చెబుతాను సినిమాల్లో కృష్ణేశ్వరరావు తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. చందమామ కథలు సినిమాలో పిచ్చివాడి పాత్రకు నంది అవార్డు అందుకున్నారు. బుధవారం కృష్ణేశ్వరరావు అంత్యక్రియలను జరుగనున్నాయని కుటుంబసభ్యులు వెల్లడించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rahul Sipligunj | సింగర్ రాహుల్ సింప్లిగంజ్‌పై కేసు నమోదు – బెదిరింపులకు పాల్పడ్డాడంటూ యువతి ఫిర్యాదు
ఆగస్టు 11, 2026

Kiran Abbavaram | ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం – పౌరాణిక సినిమాతో పాన్ ఇండియన్ లీగ్‌లోకి ఎంట్రీ!
ఆగస్టు 10, 2026

Faria Abdullah | బోనాల వేడుకలో కంటతడి పెట్టిన జాతిరత్నాలు హీరోయిన్ – తెలంగాణ కల్చర్‌కు ఫిదా
ఆగస్టు 10, 2026
తాజావార్తలు
- ●Missing Cases | మిస్సింగ్ కేసుల్లో వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.. సుప్రీంకోర్టు స్పష్టీకరణ
- ●KTR | రూ. 200 కోట్ల ప్రభుత్వ భూమి.. రూ. 7 కోట్లకే రేవంత్ రాసిచ్చాడు : కేటీఆర్
- ●Acer | ఏసర్ నుంచి అత్యంత చవక ధరకే ఏఐ ల్యాప్‌టాప్‌లు.. ధర రూ.40వేలే..
- ●Hollywood OTT | ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ది ఒడిస్సీ - ట్విస్ట్ ఏంటంటే?
- ●KTR | అర్హుల ఓట్లు తొలగించారు! : కేటీఆర్
- ●Ramchander Rao | కార్ఖానా ఖరీదైన అర్బన్ ప్రాంతం.. పరిహారం పెంచాల్సిందే : ఎన్ రాంచందర్ రావు

Missing Cases | మిస్సింగ్ కేసుల్లో వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.. సుప్రీంకోర్టు స్పష్టీకరణ

KTR | రూ. 200 కోట్ల ప్రభుత్వ భూమి.. రూ. 7 కోట్లకే రేవంత్ రాసిచ్చాడు : కేటీఆర్

Acer | ఏసర్ నుంచి అత్యంత చవక ధరకే ఏఐ ల్యాప్‌టాప్‌లు.. ధర రూ.40వేలే..

Hollywood OTT | ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ది ఒడిస్సీ - ట్విస్ట్ ఏంటంటే?



