త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Collector Manu Choudary | నాతో ఐదారు మంది సీసీలు ప‌ని చేశారు.. అందులో భాస్క‌ర్ చాలా బెస్ట్‌: క‌లెక్ట‌ర్ ప్ర‌శంస‌

Collector Manu Choudary | త‌న‌తో ఇప్ప‌టివ‌ర‌కు ఐదారు మంది సీసీలు పని చేసారని, అందులో భాస్కర్ చాలా బెస్ట్ అని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి కొనియాడారు. పదవీ విరమణ పొందిన వారిని కలెక్టర్ శాలువా, మెమెంటోల‌తో సత్కరించారు.

S

Telangana | Published On Jun 30, 2026, 7.21 pm IST

Collector Manu Choudary | నాతో ఐదారు మంది సీసీలు ప‌ని చేశారు.. అందులో భాస్క‌ర్ చాలా బెస్ట్‌: క‌లెక్ట‌ర్ ప్ర‌శంస‌
Advertisement

Collector Manu Choudary | త్రినేత్ర‌.న్యూస్‌: త‌న‌తో ఇప్ప‌టివ‌ర‌కు ఐదారు మంది సీసీలు పని చేసారని, అందులో భాస్కర్ చాలా బెస్ట్ అని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి కొనియాడారు. హౌజింగ్ పీడీ రమణ మూర్తి, కలెక్టర్ సీసీ బాల భాస్కర్, హౌజింగ్ ఏఈ సుభాష్ రెడ్డి, కలెక్టరేట్ ఆఫీస్ సబార్డినేట్ జర్మియాజ్ పదవీ విరమణ సందర్భంగా మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డితో కలిసి ఆయ‌న హాజ‌రై మాట్లాడారు. ప్రభుత్వ విధుల్లో భాగంగా ప్రజలకు నేరుగా సేవలందించడం, వారితో మ‌ర్యాద‌గా మ‌సులుకుంటే ఎల్ల‌కాలం వారు మ‌రిచిపోర‌న్నారు. అదే అసలైన సంపద అని అభిప్రాయపడ్డారు.

విధి నిర్వహణలో భాగంగా ప్రజలకు మనం చేయగలిగినంత మంచి చేయాలన్నారు. ఈ మధ్య కాలంలో ఇందిరమ్మ ఇళ్లు, 2 బీహెచ్‌కే ఇళ్లకు సంబంధించి 30, 40 వేల ద‌ర‌ఖాస్తుల‌ వరకు వచ్చాయని చెప్పారు. అందులో పీడీ ఎంతో ఓపికతో అర్హులైన అందరికి ఇళ్లు ఇప్పించేందుకు కృషి చేసారన్నారు. ప్రజల సొంతింటి కల నేరవేర్చడంలో హౌజింగ్ పీడీది కీలక పాత్ర అని గుర్తు చేశారు. కలెక్టర్‌కు, అధికారులకు, కలెక్టరేట్ వచ్చే ప్రజలకు మధ్య బాల భాస్కర్ అనుసంధానంగా ఉండి షెడ్యూల్స్ ఏర్పాటు చేస్తుంటారని వివ‌రించారు.

ఆయన 40 ఏళ్ల సర్వీసు అందించారని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం వారి కుటుంబం కోసం, త‌న అభిరుచులకు త‌గిన‌ట్టు సమయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అనంత‌రం పదవీ విరమణ పొందిన వారిని కలెక్టర్ శాలువా, మెమెంటోల‌తో సత్కరించారు. అదనపు కలెక్టర్, వివిధ శాఖల అధికారులు సైతం వారి సేవలను కొనియాడారు.

Advertisement
Advertisement