Ramchandar Rao | కాంగ్రెస్.. పీవీని ఎప్పుడూ గౌరవించలే: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
Ramchandar Rao | భారతరత్న పీవీ నరసింహారావును కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. పీవీ 105వ జయంతి సందర్భంగా పీవీ ఘాట్‌లో ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. మోదీ వచ్చిన తర్వాత పీవీకి ఢిల్లీలో స్మృతివనం ఏర్పాటు చేశారని తెలిపారు.
త్రినేత్ర.న్యూస్: భారతరత్న పీవీ నరసింహారావును కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. పీవీ 105వ జయంతి సందర్భంగా ఆదివారం పీవీ ఘాట్‌లో ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా పీవీ వాజ్‌పేయితో కలిసి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. నెహ్రూ కుటుంబ సభ్యులు ఇప్పటికీ కూడా పీవీని జీర్ణించుకుంటలేరని ఆరోపించారు. మోదీ వచ్చిన తర్వాత పీవీకి ఢిల్లీలో స్మృతివనం ఏర్పాటు చేశారని తెలిపారు.
కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్‌లో పీవీ భౌతికకాయాన్ని పెట్టనివ్వలే..
105వ జయంతి సందర్భంగా పీవీ ఘాట్‌లో శ్రద్ధాంజలి ఘటించాం. పీవీ నరసింహారావు దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. కానీ పీవీ కంటే మన్మోహన్ సింగే ఎక్కువ అని వాళ్ల కుటుంబం చెబుతూ ఉంటది. ప్రధానమంత్రిగా పూర్తి కాలం కొనసాగిన వ్యక్తి పీవీ. అప్పుడు ఆయన తప్పా ఇతరులు ఎవ్వరూ కూడా ఐదు సంవత్సరాలు పూర్తి చేయలేదు. వారికి దక్కాల్సిన గౌరవం దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ ఆయన్ను గౌరవించలే. కానీ సంజయ్‌గాంధీకి మాత్రం ఢిల్లీలో అంతిమ సంస్కారాలకు అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్‌లో కూడా పీవీ భౌతిక కాయాన్ని పెట్టనివ్వలేదు. ఇది తెలుగు వారికి, తెలంగాణ వాళ్లకు పెద్ద అవమానం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పీవీని ఎప్పుడూ అగౌరవంగానే చూసింది. అయినప్పటికీ ప్రతిపక్ష నేతగా పీవీ వాజ్‌పేయితో కలిసి అనేక సంస్కరణలు తెచ్చారు. కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నారు. నెహ్రూ కుటుంబ సభ్యలు ఇప్పటికీ పీవీని జీర్ణించుకుంటలేరు. ప్రధానమంత్రి వాళ్ల కుటుంబ సభ్యులే కావాలి. వేరేవాళ్లు కావొద్దనే ఆలోచనలో ఉన్నారు.
స్వర్ణ భారతానికి సంకల్పం తీసుకుందాం..
మోదీ వచ్చిన తర్వాత పీవీకి ఢిల్లీలో స్మృతివనం ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి సంగ్రాలయంలో కూడా పీవీ కార్యక్రమాలు నిర్వహించారు. పీవీని స్మరించి, తెలంగాణ కోసం ఆయన చేసిన ప్రయత్నాలను, సేవలను గుర్తించాలి. వారి జయంతి సందర్భంగా ప్రజల తరఫున శ్రద్ధాంజలి అర్పిస్తున్నాం. వారి ఆశయాలను కొనసాగిస్తూ దేశాన్ని స్వర్ణ భారతదేశంగా తీర్చిదిద్దేలా ముందుకు వెళ్లాలి. అందరూ ఆ సంకల్పం తీసుకోవాలి అని రాంచందర్‌రావు పిలుపునిచ్చారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●MEA Statemen | పాక్ ఆరోపణలను ఖండించిన భారత్.. ఆ వ్యాఖ్యాలు నిరాధారమన్న రణధీర్ జైస్వాల్..
- ●Revanth Reddy | నల్గొండలో మహత్తర ఘట్టం.. హ్యామ్ రోడ్ల పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం
- ●Sheikh Hasina | ఉరిశిక్ష వేసినా భయపడను.. ఈ ఏడాదే బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తా: షేక్ హసీనా సంచలన ఇంటర్వ్యూ
- ●CPI Narayana | పీవీ, మన్మోహన్ కృష్ణార్జునుల వలె పాలించారు
- ●Jangaon | నష్కల్‌లో మద్యం విక్రయం.. విద్యుత్ కనెక్షన్లు తొలగించిన సర్పంచ్
- ●Telugu OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ - రెమ్యూనరేషన్ లేకుండా సినిమా చేసిన హీరో

MEA Statemen | పాక్ ఆరోపణలను ఖండించిన భారత్.. ఆ వ్యాఖ్యాలు నిరాధారమన్న రణధీర్ జైస్వాల్..

Revanth Reddy | నల్గొండలో మహత్తర ఘట్టం.. హ్యామ్ రోడ్ల పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం

Sheikh Hasina | ఉరిశిక్ష వేసినా భయపడను.. ఈ ఏడాదే బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తా: షేక్ హసీనా సంచలన ఇంటర్వ్యూ

CPI Narayana | పీవీ, మన్మోహన్ కృష్ణార్జునుల వలె పాలించారు




