త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | నీ అయ్య జాగీరా దిగిపోవ‌డానికి : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | ప‌ద‌వి నుంచి దిగిపో దిగిపో అంటున్నారు.. నీ అయ్య జాగీరా దిగిపోవ‌డానికి..? మీ తాత‌ల గ‌డీ అనుకుంటున్నావా..? గ‌డీల ముందు బానిస‌లు అనుకుంటున్నావా..? దుక్కి దున్నిన చేతులు ఇవి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

S

Telangana | Published On Jun 30, 2026, 7.32 pm IST

CM Revanth Reddy | నీ అయ్య జాగీరా దిగిపోవ‌డానికి : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ప‌ద‌వి నుంచి దిగిపో దిగిపో అంటున్నారు.. నీ అయ్య జాగీరా దిగిపోవ‌డానికి..? మీ తాత‌ల గ‌డీ అనుకుంటున్నావా..? గ‌డీల ముందు బానిస‌లు అనుకుంటున్నావా..? దుక్కి దున్నిన చేతులు ఇవి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ మ‌ళ్లీ వ‌స్తే ఏం చేయ‌డు.. రుణ‌మాఫీ, రైతు భ‌రోసా ఇవ్వ‌డు. నిరుద్యోగ స‌మ‌స్య తీర్చ‌డు. చివ‌ర‌కు వ‌రి కూడా కొన‌డు అని సీఎం అన్నారు. శిల్పా క‌ళా వేదిక‌లో రైతు భ‌రోసా నిధులు విడుద‌ల చేసిన అనంత‌రం సీఎం ప్ర‌సంగించారు.

కేసీఆర్ అధికారంలోకి వ‌స్తే చివ‌ర‌కు ఆలుమ‌గ‌ల ఫోన్లు వింట‌డు.. కాపురాల్లో చిచ్చు పెడుత‌డు త‌ప్ప ఇంకోటి చేయ‌డు. ఆలుమ‌గ‌ల మాట‌లు వినే పైశాచిక ఆనందం ఏంది.. పాపాల భైర‌వుడు రావాల్నాటా.. మ‌నం పోవాల్న‌టా..? ప్ర‌జ‌లు కేసీఆర్ కోసం ఎదురుచూస్తున్నార‌ట‌..? అని రేవంత్ అన్నారు.

దానికోస‌మే ఈ ప్ర‌య‌త్న‌మంతా..

ఉన్న‌ది ఉన్న‌ట్టు చెప్తా.. చెప్పిందే చేస్తా.. చేసిందే చెప్తా.. నాకు గొప్ప కిరీటం పెట్టుకోవాల‌ని లేదు.. వ‌డ్ర‌వైజుర్యాలు సంపాయించుకోవాల‌ని లేదు. ప‌ద‌వి శ్వాశ్వ‌తం కాదు.. ఇందిర‌మ్మ‌, ఎన్టీఆర్, వైఎస్సార్‌కు కూడా ప‌ద‌వీ శాశ్వ‌తం కాలేదు.. మాట మాట్లాడితే ఎంత‌కైనా నిల‌బ‌డుతాడు అనే దానికోస‌మే ఈ ప్ర‌య‌త్న‌మంతా.. అబ‌ద్దాలు చెప్పి మిమ్మ‌ల్ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేయ‌ను.. అబ‌ద్దాల‌తో ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌ను అని రేవంత్ స్ప‌ష్టం చేశారు.

రైతుల‌కు పంగ‌నామాలు పెడుతుండు

కాలం మారింది.. అందుకు త‌గ్గ‌ట్టు మ‌న నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ఎల్‌నినో వ‌ల్ల నీళ్లు అధికంగా ఖ‌ర్చ‌య్యే పంట‌లు వేయ‌కండి అని చెప్పాను. రైతుల‌కు పంగ‌నామాలు పెడుతుండు అని అంటున్న‌రు. నీళ్లు లేక‌పోతే వ‌రి ఎంట్ల పండుత‌ది.. త‌క్కువ నీళ్ల‌తో పండించే పంట‌లు వేయండ‌ని చెబుతున్నా. ఏడు ర‌కాల స‌న్నాలు వేస్తే కొనుగోలుతో పాటు బోన‌స్ వేస్తామ‌ని చెప్పినం. పంట మార్పిడి చేయండి.. అవ‌స‌ర‌మైన విత్త‌నాలు మీ ద‌గ్గ‌రికి తీసుకువ‌స్తున్నామ‌ని సీఎం తెలిపారు.

పిల్ల రాక్ష‌సులు నోరు తెరిస్తే అబ‌ద్దాలు

కానీ పిల్ల రాక్ష‌సులు నోరు తెరిస్తే అబ‌ద్దాలు చెబుతున్నారు. ఒక‌రికి మించి ఒక‌రు అబ‌ద్దాలు ఆడుతున్నారు. వాళ్ల బుద్ధి మార‌నంత వ‌ర‌కు దేవుడు క్ష‌మించ‌డు. నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు. స‌మ‌స్య‌లు ఉంటాయి.. స‌ర్దుకుపోవాలి. దొంగ‌త‌నం, దోపిడీ మాత్ర‌మే వారికి తెలుసు.. ప్ర‌జ‌ల‌కు మంచి చేయ‌లేదు అని రేవంత్ అన్నారు.

ఏదైనా నాకు కొంత స‌మ‌యం ప‌డుతుంది..

ఏదైనా నాకు కొంత స‌మ‌యం ప‌డుతుంది.. కొత్త సంసార‌మైనా.. ఉప్పు, ప‌ప్పుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. సంసారం స‌ర్దుకుని పోవాలి. బ‌జార్లో పెట్టుకుంటే మ‌న గౌర‌వం త‌గ్గుత‌ది. 30 నెల‌లు క‌ష్ట‌ప‌డి ఓ కొలిక్కి తెచ్చాం. మీరు అడ‌గ‌కముందే రైతు భ‌రోసా వేస్తున్నాం.. న‌గ‌దు జ‌మ చేసి పెట్టాను.. మ‌ధిర‌లో స‌భ పెడుదామ‌నుకుంటే వాన ప‌డ్డ‌ది. కానీ న‌గ‌దు వేసేది వాయిదా పెట్టొద్దు అని చెప్పాను. ఈ ప్ర‌భుత్వం మీది.. మ‌న‌ది.. ప్ర‌జ‌ల‌ది.. ఆడ‌బిడ్డ‌ల‌ది. మా రైతుల‌ది. నిరుద్యోగ యువ‌కుల‌ది.. మంచిగా చేసుకుందాం. పోలీసు శాఖ‌లో 5 వేల ఖాళీల‌కు నోటిఫికేష‌న్ ఇస్తే. వ‌ద్దంటున్నారు. గ‌తంలో ఇవ్వ‌క‌పోతే ధ‌ర్నాలు ఉండేవి.. ఇప్పుడు ఇస్తే ధ‌ర్నాలు చేస్తున్న‌రు అని సీఎం పేర్కొన్నారు.

Advertisement
Advertisement