త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | రైతు భ‌రోసా కింద రూ. 36 వేల కోట్లు అందించాం : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఇప్ప‌టి వ‌ర‌కు రైతు భ‌రోసా కింద రూ. 36 వేల కోట్లు అందించిన చ‌రిత్ర ఈ ప్ర‌భుత్వానిది అని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఇవాళ రూ. 9 వేల కోట్లు వేయ‌డానికి నిర్ణ‌యం తీసుకున్నామ‌ని సీఎం తెలిపారు.

S

Telangana | Published On Jun 30, 2026, 7.49 pm IST

CM Revanth Reddy | రైతు భ‌రోసా కింద రూ. 36 వేల కోట్లు అందించాం : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఇప్ప‌టి వ‌ర‌కు రైతు భ‌రోసా కింద రూ. 36 వేల కోట్లు అందించిన చ‌రిత్ర ఈ ప్ర‌భుత్వానిది అని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఇవాళ రూ. 9 వేల కోట్లు వేయ‌డానికి నిర్ణ‌యం తీసుకున్నామ‌ని సీఎం తెలిపారు. శిల్పాక‌ళా వేదిక‌గా 44.28 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రూ. 2482.02 కోట్ల నిధుల విడుద‌ల సంద‌ర్భంగా సీఎం ప్ర‌సంగించారు.

25 ల‌క్ష‌ల 35 వేల మందికి రూ. 20,677 కోట్లు 2 ల‌క్ష‌ల వ‌ర‌కు రైతు రుణ‌మాఫీ చేసిన మాట వాస్త‌వం కాదా..? రైతు బంధు కింద రూ. 7 వేల కోట్ల పాత బ‌కాయిలు ఉంటే అవి కూడా మేం చెల్లించాం. వ‌డ్లు కొని బ‌కాయిలు పెడితే ఆ పైస‌లు మేం చెల్లించాం. గ‌తంలో రైతు బంధు కింద రూ. 10 వేలు ఇస్తే, మేం రైతు భ‌రోసా కింద రూ. 12 వేల‌కు పెంచి, ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 27 వేల కోట్ల పైచిలుకు మీ ఖాతాల్లో వేశాం. మ‌ళ్లీ ఇవాళ రూ. 9 వేల కోట్లు విడుత‌ల వారిగా వేయ‌డానికి ముందుకు పోతున్నాం. ఈ విడ‌త‌తో క‌లిపితే మొత్తం రూ. 36 వేల కోట్లు అందించిన చ‌రిత్ర ఈ ప్ర‌భుత్వానిది అని సీఎం తెలిపారు.

ఉచిత క‌రెంట్ కాంగ్రెస్ పేటెంట్

కాంగ్రెస్ వ‌స్తే క‌రెంట్ క‌ష్టాలు ఉంటాయ‌న్నారు. ఉచిత క‌రెంట్‌ను క‌నిపెట్టిందే కాంగ్రెస్.. ఆ పేటెంట్ మాదే. వైఎస్సార్ 2004 సీఎం ప్ర‌మాణం చేసి క‌రెంట్ బిల్లులు మాఫీ చేసి సంత‌కం పెట్టారు. వీడెవ‌డో వ‌చ్చి మేం ఇచ్చిన ఉచిత క‌రెంట్‌ను వారి ఖాతాలో రాసుకున్నారు. భ‌ట్టి విక్ర‌మార్క ఉచిత క‌రెంట్ కోసం ప్ర‌తి నెల రూ. 1000 కోట్లు ఖ‌ర్చు పెడుతున్నారు ఉచిత విద్యుత కోసం ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 30 వేల కోట్లు ఖ‌ర్చు పెట్టినం అని సీఎం పేర్కొన్నారు.

వ్య‌వ‌సాయాన్ని పండుగ చేసింది మీరా..? మేమా..?

అంతేకాదు.. వ‌రి బోన‌స్ కింద రూ. 4 వేల కోట్లు, వ్య‌వ‌సాయ ప‌నిముట్ల కోసం రూ. 2 వేల కోట్లు, రైతుబీమాకు రూ. మూడున్న‌ర వేల కోట్లు ఖ‌ర్చు పెట్టాం. ప‌దేండ్ల‌లో వ‌రి ధాన్యం కొనుగోలుకు రూ. ల‌క్షా 68 వేల కోట్లు ఖ‌ర్చు పెడితే, రెండున్న‌రేండ్ల‌లోనే రూ. 80 వేల కోట్ల‌కు పైగా ఖ‌ర్చు పెట్టాం. మేం ప్ర‌తి నెల రూ. 6 వేల కోట్లు ఖ‌ర్చు పెడుతున్నాం వ్య‌వ‌సాయానికి. మీరు క‌నీసం రూ. 2500 కోట్లు కూడా ఖ‌ర్చు పెట్ట‌లేదు. మ‌రి వ్య‌వ‌సాయాన్ని పండుగ చేసింది మీరా..? మేమా..? అని సీఎం నిల‌దీశారు.

Advertisement
Advertisement