TG Rains | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు..
TG Rains | తెలంగాణలో రాగల నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను అర్నాబ్ గడిచిన ఆరు గంటల్లో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించినట్లుగా వాతావరణశాఖ పేర్కొంది.
TG Rains | తెలంగాణలో రాగల నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను అర్నాబ్ గడిచిన ఆరు గంటల్లో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించినట్లుగా వాతావరణశాఖ పేర్కొంది. విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 220 కిలోమీటర్లు, కాకినాడకు తూర్పు-ఆగ్నేయంగా 240 కిలోమీటర్లు, ఒడిశా గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 370 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది. మంగళవారం సాయంత్రం వరకు పశ్చిమ-వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత వాయువ్య దిశగా ప్రయాణించిన బుధవారం ఉదయానికి బాపట్ల, విశాఖ మధ్య, యానాం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది. ఆ సమయంలో తీవ్ర తుఫాను కారణంగా గరిష్టంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయిన తెలిపింది. అలాగే, నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరం నుంచి అర్నాబ్ తుపాను కేంద్రం వరకు ద్రోణి విస్తరించి ఉందని.. సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని చెప్పింది. నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉ్న దక్షిణ తమిళనాడు తీరప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని చెప్పింది.
ఈ క్రమంలో తెలంగాణలో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. మంగళవారం రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. బుధవారం ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వివరించింది. శుక్రవారం పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే సూచనలున్నాయని వాతావరణశాఖ వివరించింది.
తాజావార్తలు
- ●El Nino | ఎల్‌నినోపై రేపు అఖిలపక్ష సమావేశం
- ●Torani No Layoffs | 101 ఏళ్లలో ఒక్క లేఆఫ్ లేదు.. ఈ కంపెనీ సీఈవో రూటే సపరేటు!
- ●IND Vs NZ T20 | అభిషేక్ శర్మ విధ్వంసం.. టీమిండియా ఘన విజయం
- ●Stock Markets | మిశ్రమంగా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. లాభాల స్వీకరణతో అస్థిరత..
- ●Keerthy Suresh | డబ్బులు నష్టపోవాలని అనుకోవడం లేదు - ప్రొడ్యూసర్‌గా మారడంపై కీర్తి సురేష్ క్లారిటీ
- ●South Central Railway | అర్నాబ్ ఎఫెక్ట్.. పలు రైళ్లు దారి మళ్లింపు..?

El Nino | ఎల్‌నినోపై రేపు అఖిలపక్ష సమావేశం

Torani No Layoffs | 101 ఏళ్లలో ఒక్క లేఆఫ్ లేదు.. ఈ కంపెనీ సీఈవో రూటే సపరేటు!

IND Vs NZ T20 | అభిషేక్ శర్మ విధ్వంసం.. టీమిండియా ఘన విజయం

Stock Markets | మిశ్రమంగా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. లాభాల స్వీకరణతో అస్థిరత..




