X | ఫ్రీ యూజర్లకు షాకిచ్చిన ఎక్స్.. పోస్టులపై లిమిట్స్ విధింపు..
X | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ తన ఫ్రీ, అన్ వెరిఫైడ్ యూజర్లకు షాకిచ్చింది. ఆయా యూజర్లు ఎక్స్‌లో రోజూ పబ్లిష్ చేసే పోస్టులతోపాటు పలు ఇతర ఫీచర్లపై పరిమితులు విధించింది. ఇకపై వారు రోజూ పరిమిత మొత్తంలో మాత్రమే పోస్టులు పెట్టేందుకు, ఇతర ఫీచర్లను వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ మేరకు ఎక్స్ ఒక ప్రకటన విడుదల చేసింది.
Technology | Published On May 18, 2026, 12.40 pm IST
X | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ తన ఫ్రీ, అన్ వెరిఫైడ్ యూజర్లకు షాకిచ్చింది. ఆయా యూజర్లు ఎక్స్‌లో రోజూ పబ్లిష్ చేసే పోస్టులతోపాటు పలు ఇతర ఫీచర్లపై పరిమితులు విధించింది. ఇకపై వారు రోజూ పరిమిత మొత్తంలో మాత్రమే పోస్టులు పెట్టేందుకు, ఇతర ఫీచర్లను వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ మేరకు ఎక్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్త పరిమితులను అకౌంట్ యాక్షన్ లిమిట్స్ ప్లాన్‌లో భాగంగా విధిస్తున్నట్లు తెలియజేసింది. ప్రీమియం యూజర్లకు నాణ్యమైన సేవలను అందించడం కోసం, ఫ్రీ యూజర్లకు పరిమితులను విధించక తప్పడం లేదని స్పష్టం చేసింది. దీని వల్ల ఉచిత యూజర్ల చర్యలు పూర్తి స్థాయిలో నియంత్రణలో ఉంటాయని, సర్వర్‌పై అధిక భారం పడకుండా ఉంటుందని, సర్వర్ డౌన్ టైమ్‌ను తగ్గించవచ్చని పేర్కొంది. అలాగే ఎర్రర్ పేజీలు రాకుండా చూడడం కోసమే ఈ పరిమితులను విధిస్తున్నట్లు తెలిపింది. ప్లాట్‌ఫామ్ స్థిరత్వం, పనితీరు మెరుగుదల కోసం ఈ పరిమితులను అమలు చేస్తున్నట్లు తెలియజేసింది. దీని వల్ల ఎక్స్ ప్లాట్‌ఫామ్ బ్యాకెండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఒత్తిడి భారీగా తగ్గుతుందని పేర్కొంది.
రోజుకు 50 పోస్టులు మాత్రమే..
ఎక్స్ వివిధ అకౌంట్ ఫంక్షన్లపై వేర్వేరుగా పరిమితులను విధిస్తోంది. అంటే వెబ్ బ్రౌజర్‌లో ఎక్స్‌ను వాడితే ఒక రకంగా పరిమితులు ఉంటాయి. అలాగే మొబైల్ యాప్‌కు ఇంకో రకంగా, థర్డ్ పార్టీ ఏపీఐ క్లయింట్స్ అయితే మరో రకంగా పరిమితులను విధిస్తారు. ఇక అన్ని డివైస్‌లకు కలిపి మొత్తంగా మళ్లీ పూర్తి స్థాయిలో పరిమితులు ఉంటాయి. డైరెక్ట్ మెసేజెస్ రోజుకు ఇకపై ఫ్రీ యూజర్లు కేవలం 500 వరకు మాత్రమే పంపించుకునేందుకు వీలుంటుంది. ఈ యూజర్లు లేదా అన్ వెరిఫైడ్ అకౌంట్స్ ఉన్నవారు రోజుకు 50 పోస్టులను మాత్రమే పబ్లిష్ చేయగలరు. 200 రిప్లైలను మాత్రమే ఇవ్వగలరు. రోజుకు మొత్తం అన్ని డివైస్‌లకు అయితే 2,400 పోస్టులు పెట్టేందుకు పరిమితి ఉంటుంది. అయితే ఈ పరిమితులు గంట గంటకు డైనమిక్‌గా కూడా మారుతాయి. ఉచిత అకౌంట్ ఉన్న యూజర్లు తమ ఈ-మెయిల్‌ను గంటకు 4 సార్లు మాత్రమే మార్చుకోవచ్చు. రోజుకు 400 అకౌంట్ల వరకు మాత్రమే ఫాలో అవచ్చు. మొత్తం మీద 5వేల అకౌంట్లను ఫాలో అయ్యేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఫాలో-టు-ఫాలోవర్ రేషియో ఆధారంగా మరిన్ని పరిమితులను విధిస్తారు.
పరిమితి దాటితే వేచి చూడాల్సిందే..
థర్డ్ పార్టీ అప్లికేషన్ల ద్వారా వచ్చే ఏపీఐ రిక్వెస్టులు గంటల వారీగా ఏపీఐ లిమిట్‌లో లెక్కించబడతాయి. ఒక యూజర్ తన ఎక్స్ అకౌంట్‌ను ఎక్కువ థర్డ్ పార్టీ సర్వీసులతో కనెక్ట్ చేస్తే, వారి ఏపీఐ లిమిట్ మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. సైట్‌పై అసాధారణంగా భారీ ట్రాఫిక్ ఉన్న సమయంలో ఎక్స్ ఈ సాధారణ లిమిట్స్‌ను తాత్కాలికంగా ఇంకా తగ్గించే అవకాశం ఉంటుంది. అందువల్ల సర్వర్ రీసోర్స్ యూసేజ్‌ను బట్టి లేదా పీక్ అవర్స్‌లో ఈ లిమిట్స్ డైనమిక్‌గా మారుతాయి. అందువల్ల వాటిపై ఉచిత యూజర్లు కన్నేసి ఉంచాలి. అయితే ఈ లిమిట్స్‌పై ప్రత్యేక స్టేటస్ అప్ డేట్స్ ఇస్తామని ఎక్స్ తెలిపింది. ఇక ఎక్స్ విధించిన పరిమితులను యూజర్ దాటితే ఏ పరిమితిని దాటారో తెలియజేస్తుంది. అందుకు ప్రత్యేకంగా ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. కానీ అన్ని పరిమితులు దాదాపుగా టైమ్ బేస్డ్ కనుక సమయం ముగియగానే పరిమితులు మళ్లీ రీసెట్ అవుతాయి. దీంతో యూజర్లు మళ్లీ ఎక్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇక ప్రీమియం యూజర్లకు కూడా లిమిట్స్ ను వర్తింపజేస్తారా అన్న విషయంపై మాత్రం ఎక్స్ స్పష్టత ఇవ్వలేదు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vande Bharat Express | భారీ వర్షాలకు నీట మునిగిన పట్టాలు.. దూసుకెళ్లిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. వీడియో
జులై 5, 2026

Virat Kohli | మైదానంలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ కింగే.. ఎక్స్‌లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు
జులై 3, 2026

Pawan Kalyan on social media abuse | సోషల్ మీడియాలో ఇక ఆ ఆటలు సాగవు.. అసభ్య ప్రచారాలపై పవన్ కళ్యాణ్ సీరియస్
జులై 1, 2026
తాజావార్తలు
- ●Kajal Aggarwal | ఆ లిమిట్స్ ఎప్పుడూ దాటలేదు - బికినీ , బోల్డ్ సీన్లపై కాజల్ రియాక్షన్
- ●Bhatti Vikramarka | వ్యవసాయ రంగానికి రూ. 1,67,877 కోట్లు ఖర్చు చేశాం : డిప్యూటీ సీఎం భట్టి
- ●Netflix | నెట్‌ఫ్లిక్స్ భారీ సర్ప్రైజ్.. మళ్లీ ఉచిత ట్రయల్ ప్రారంభం.. 30 రోజులు ఫ్రీ..
- ●E20 fuel | ఈ20 పెట్రోల్‌తో వాహనాల మైలేజ్ 5 శాతం తగ్గొచ్చు.. అంగీకరించిన కేంద్రం
- ●Tummala Nageshwar Rao | రైతు భరోసా పథకం కింద 30 నెలల్లోనే.. రూ. 36 వేల కోట్లు జమ : మంత్రి తుమ్మల
- ●WhatsApp | వాట్సాప్‌లో వస్తున్న కొత్త ఫీచర్.. కాంటాక్ట్‌ల బర్త్ డేలను ముందే చెబుతుంది..

Kajal Aggarwal | ఆ లిమిట్స్ ఎప్పుడూ దాటలేదు - బికినీ , బోల్డ్ సీన్లపై కాజల్ రియాక్షన్

Bhatti Vikramarka | వ్యవసాయ రంగానికి రూ. 1,67,877 కోట్లు ఖర్చు చేశాం : డిప్యూటీ సీఎం భట్టి

Netflix | నెట్‌ఫ్లిక్స్ భారీ సర్ప్రైజ్.. మళ్లీ ఉచిత ట్రయల్ ప్రారంభం.. 30 రోజులు ఫ్రీ..

E20 fuel | ఈ20 పెట్రోల్‌తో వాహనాల మైలేజ్ 5 శాతం తగ్గొచ్చు.. అంగీకరించిన కేంద్రం



