Bandi Bhageerath | అందరిలాగే నా కూతురికీ రక్షణ, గౌరవం పొందే అర్హత ఉంది.. బండి భగీరథ్ బాధితురాలి తల్లి
Bandi Bhageerath | అందరిలాగే తన కుమార్తెకు కూడా రక్షణ, గౌరవం, భవిష్యత్తును పొందే అర్హత ఉందని పోక్సో కేసు (POCSO) నిందితుడు బండి భగీరథ్ (Bandi Bhageerath) బాధితురాలైన మైనర్ బాలిక తల్లి స్పష్టం చేశారు. తాము ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్లమని, ఎలాంటి రాజకీయ అండదండలు లేవన్నారు.
Bandi Bhageerath | త్రినేత్ర.న్యూస్: అందరిలాగే తన కుమార్తెకు కూడా రక్షణ, గౌరవం, భవిష్యత్తును పొందే అర్హత ఉందని పోక్సో కేసు (POCSO) నిందితుడు బండి భగీరథ్ (Bandi Bhageerath) బాధితురాలైన మైనర్ బాలిక తల్లి స్పష్టం చేశారు. తాము ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్లమని, ఎలాంటి రాజకీయ అండదండలు లేవన్నారు. తమ బిడ్డను కాపాడుకోవాలని, తాము చేస్తున్న న్యాయ పోరాటాన్ని వినాలని సమాజంలోని వ్యవస్థలను వేడుకోవాల్సిన దారుణమైన పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని వాపోయారు. భరించలేని తీవ్ర ఆవేదన అనుభవిస్తున్నప్పటికీ, మైనర్ కుమార్తె, నిస్సహాయ తల్లిగా ఈమేరకు ప్రకటన విడుదల చేస్తున్నానని వెల్లడించారు. తాను ఇది పగతోనో, ప్రచారం కోసమో చేయడం లేదన్నారు. నిజాలతో తమ బాధను అందరికీ తెలియపరచాలనే ఉద్దేశం తప్ప మరొకటి లేదని స్పష్టం చేశారు.
`నిందితుడు బండి భగీరథ్ బయట ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. మా కుటుంబానికి తీవ్రమైన ప్రమాదం ఉంది. గతంలో బండి సంజయ్ ఇంటికి, అయన అనుచరుడు సంగప్ప కోరడంతో వెళ్లాం. కానీ బండి సంజయ్ బెదింపులకు దిగారు. దీంతోపాటు తమ కుటుంబంపై సామాజిక మాధ్యమాలు, వ్యక్తుల ద్వారా జరుగుతున్న బెదిరింపులు, దాడులు మాకు తీవ్రమైన భయాన్ని కలిగిస్తున్నాయి. మా బిడ్డ పుట్టిన తేదీకి సంబంధించి కావాలనే వివాదం రేపి న్యాయపరమైన విచారణ ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
2025లో నా కూతురికి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌తో పరిచయం ఏర్పడిందని నా కుమార్తె చెప్పింది. మొదట్లో సాధారణ పరిచయంగా ప్రారంభమై ఆ తర్వాత భగీరథ్ పదేపదే మాట్లాడటం, బలవంతంగా ఒప్పించడంతోపాటు అనేక రకాల ప్రలోభాలకు గురిచేయడంతో నా కుమార్తె ఆయనపై మానసిక ఆధారపడింది. మాయమాటలు చెప్పి మా కుమార్తెను మానసికంగా లొంగదీసుకున్నారు. పూర్తిగా బండి భగీరథ్ నియంత్రణలోకి వెళ్లిపోయింది. తన ఇష్టం లేకపోయినా… అనేక సార్లు తీవ్రంగా ప్రతిఘటించిన సందర్భాల్లోనూ శారీరక సంబంధం కోసం భగీరథ్ పదేపదే ఒత్తిడి తీసుకువచ్చారు.
ముఖ్యంగా 2025 డిసెంబర్ 31వ తేదీ రాత్రి, 2026 జనవరి 1 తెల్లవారుజామున మోయినాబాద్‌లో తనపై దాడి జరిగిందని తెలిపింది. ఆ రోజు తనకు ఇష్టం లేకున్నా మద్యం సేవించాలని ఒత్తిడి తీసుకొచ్చిన భగీరథ్ అచేతన స్థితిలో ఉన్నప్పుడు అనుచితమైన ప్రవర్తనకు దిగాడని, బలవంతంగా శారీరకంగా దాడి చేశారని వెల్లడించింది. తన కుమార్తెతో అనేక సార్లు శారీరక సంబంధం కోసం ఒత్తిడి తెచ్చారు. చివరికి ధైర్యం కూడతీసుకొని 2026 మార్చి ఏప్రిల్ నెలలో చట్టపరంగా ముందుకు పోదామని ప్రయత్నించాం. బండి భగీరథ్ ప్రతినిధిగా చెప్పుకుంటూ 2026 ఏప్రిల్ 22న సంగప్ప అనే వ్యక్తి మా నివాసానికి వచ్చి మాట్లాడారు. సంగప్ప కోరిక మేరకు ఏప్రిల్ 23న మేము కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటికి వెళ్లి ఆయన్ని కలిశాం.
బాధితురాలైన కూతురు తల్లిదండ్రులుగా ఆ భేటీకి వెళ్ళినప్పుడు మాకు భరోసా, రక్షణ కలుగుతుందని అనుకున్నాం. కానీ బండి సంజయ్ ఇంటి నుంచి తీవ్రమైన భయంతో బయటకు వచ్చాం. తన రాజకీయ ప్రాబల్యం, తన మద్దతుదారులు, అనుచరుల ద్వారా మా కుటుంబానికి కష్టాలు తప్పవని, జరగబోయే పరిణామాల గురించి బండి సంజయ్ చేసిన చెప్పిన మాటలు, హెచ్చరికలు, బెదిరింపులు మమ్మల్ని తీవ్రంగా భయపెట్టాయి.
ఆ రోజు నుంచి మా కుటుంబం నిరంతరంగా భయంలో బతుకుతున్నాం. చివరికి ఈ నెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి పోక్సో చట్టం కింద ఫిర్యాదు నమోదు చేయాలని కోరాం. మైనర్ బాలిక అయిన మా కూతురు తనకు కలిగిన కష్టనష్టాలను వెల్లడించినప్పటికీ 5 గంటలకు పైగా మమ్మల్ని పోలీస్ స్టేషన్‌లో పోలీసులు వేచి ఉండేలా చూశారు. కానీ మాకు జూరిస్‌డిక్షన్ సమస్యలు ఉన్నాయి, ఫిర్యాదును బదిలీ చేస్తామని రకరకాల కారణాలు చెప్పారు. జీరో ఎఫ్ఐఆర్ గురించి పదే పదే పట్టుబట్టిన తర్వాతే రశీదు జారీ చేశారు.
మా మైనర్ కుమార్తెకు జరిగిన ఇంతటి ఆవేదన ఇంకొక ఏ బిడ్డకు కలగకూడదు. కావాలనే కొందరు దీనిని వ్యక్తిగత సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మొదట పోలీసులు బాధితురాలి ఆరోపణలు స్పష్టంగా చెప్పినప్పటికీ, బెయిల్ వచ్చే నిబంధనలను మాత్రమే చేర్చారు. ప్రజల ఆందోళన, ఆ తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి మా కూతురు నుంచి మరోసారి వివరమైన వాంగ్మూలం నమోదు చేసి తీవ్రమైన సెక్షన్లను నమోదు చేశారు. మా బిడ్డపై జరిగిన దాడిని నిష్పాక్షికంగా, స్వతంత్రంగా, న్యాయబద్ధంగా విచారణ జరగాలని కోరుతున్నాం. మైనర్ అయిన మా బిడ్డ ఫొటోలను, ఆమె గుర్తింపును బయటకు వచ్చేలా సామాజిక మాధ్యమాల్లో కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. మైనర్ల గుర్తింపును, గౌరవాన్ని కాపాడటం పోక్సో చట్టం బాధ్యత మాత్రమే కాదు.సమాజం నైతిక బాధ్యత అని వేడుకుంటున్నాం.` అని బాధితురాలి తల్లి చెప్పారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



