KTR | 3,300 పైచిలుకు స్టార్టప్‌లకు అండగా టీ హబ్ : కేటీఆర్
KTR | తెలంగాణలో కేసీఆర్ హయాంలో హైదరాబాద్‌ను ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో టీ హబ్ ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు.
KTR | త్రినేత్ర న్యూస్ : తెలంగాణలో కేసీఆర్ హయాంలో హైదరాబాద్‌ను ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో టీ హబ్ ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. టీ హబ్ ప్రారంభమై 11 ఏళ్లు అవుతుందని, ఇది 3,300 పైచిలుకు స్టార్టప్‌లకు అండగా నిలిచిందని తెలిపారు. కలలకు రెక్కలు తొడగడం అనే సూక్తి టీ హబ్ లక్ష్యాన్ని తెలియజేస్తుందన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను మార్గదర్శకులు, పెట్టుబడిదారులు, పారిశ్రామిక నాయకులు , ప్రపంచవ్యాప్త అవకాశాలతో అనుసంధానించింది అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ రోజు టి-హబ్ తెలంగాణ ఆశయాలకు, వ్యవస్థాపక స్ఫూర్తికి నిలువెత్తు రూపంగా నిలిచింది. దేశవ్యాప్తంగా ఇటువంటి ఎన్నో మరెన్నో కార్యక్రమాలకు ఇది స్ఫూర్తినిస్తూ, హైదరాబాద్‌ను ప్రపంచ ఆవిష్కరణల పటంలో ప్రముఖంగా నిలబెట్టింది. టీ హబ్ 11 వసంతాలను పూర్తి చేసుకున్న తరుణంలో... సరికొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తూ, ఆవిష్కర్తలను శక్తివంతం చేస్తూ, కలలను సాకారం చేసుకునే దిశగా ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాం. దీని ప్రారంభోత్సవంలో దిగ్గజ పారిశ్రామికవేత్త దివంగత రతన్ టాటా అన్నట్లుగా... టీ హబ్ నిజంగానే ఆధునిక భారతదేశానికి ప్రతిరూపం అని కేటీఆర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Supreme Court | సుప్రీంకోర్ట్‌లో జూనియర్ కోర్ట్ అటెండెంట్ పోస్టులు..
- ●Indian Stock Markets | మదుపర్లపై కనక వర్షం.. 6 రోజుల్లో రూ.28 లక్షల కోట్లు లాభం..
- ●KTR | బడా భాయ్ మోదీ.. చోటా భాయ్ రేవంత్‌పై ఎప్పటికీ చర్యలు తీసుకోరు!
- ●Meta | సోషల్ మీడియాలో బాలల లైంగిక వేధింపుల కంటెంట్.. మెటాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు
- ●Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. ఒక్క రోజులోనే రూ.32వేలు పెరిగిన పసిడి ధర..
- ●Kiren Rijiju | ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలంటే ముందు విదేశీ పర్యటనలు ఆపి.. ఈ 7 సూచనలు పాటించండి.. రాహుల్‌కు కేంద్ర మంత్రి చురకలు

Supreme Court | సుప్రీంకోర్ట్‌లో జూనియర్ కోర్ట్ అటెండెంట్ పోస్టులు..

Indian Stock Markets | మదుపర్లపై కనక వర్షం.. 6 రోజుల్లో రూ.28 లక్షల కోట్లు లాభం..

KTR | బడా భాయ్ మోదీ.. చోటా భాయ్ రేవంత్‌పై ఎప్పటికీ చర్యలు తీసుకోరు!

Meta | సోషల్ మీడియాలో బాలల లైంగిక వేధింపుల కంటెంట్.. మెటాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు





