Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. ఒక్క రోజులోనే రూ.32వేలు పెరిగిన పసిడి ధర..
Gold And Silver Prices Today | అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగలడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లపై సానుకూల ప్రభావం పడింది. ప్రతినిధుల సభ, సెనేట్‌లో ఇకపై ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అంత సులభంగా ఆమోదం పొందవు. దీంతో పశ్చిమ ఆసియా యుద్ధం ఆగే పరిస్థితి నెలకొంటుందన్న ఆశలు చిగురించాయి.
Gold And Silver Prices Today | అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగలడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లపై సానుకూల ప్రభావం పడింది. ప్రతినిధుల సభ, సెనేట్‌లో ఇకపై ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అంత సులభంగా ఆమోదం పొందవు. దీంతో పశ్చిమ ఆసియా యుద్ధం ఆగే పరిస్థితి నెలకొంటుందన్న ఆశలు చిగురించాయి. ఇది ఈక్విటీ మార్కెట్లతోపాటు బులియన్ మార్కెట్లపైనా సానుకూల ప్రభావం చూపింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు భారీ ర్యాలీలో కొనసాగుతుండగా, బులియన్ మార్కెట్లలోనూ కొనుగోళ్ల జోరు పెరిగింది. పసిడి, వెండి ధరలు ఒక్క రోజులోనే భారీగా పెరిగాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో బంగారం ధర ఔన్స్‌కు ఏకంగా 1.52 శాతం పెరిగి 4,122 డాలర్లకు చేరగా, వెండి ధర 0.77 శాతం పెరిగి 52 డాలర్లకు చేరింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1844 పాయింట్లు పెరిగి 1,45,125కు చేరగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1013 పాయింట్లు పెరిగి 1,88,748కు చేరింది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పసిడి ధర ఒక్క రోజులోనే రూ.32వేలకు పైగా పెరగ్గా, వెండి ధర రూ.10వేలు పెరిగింది.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,602 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,16,816 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,46,020 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,60,200 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.32,200 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,385 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,07,080గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,33,850 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,38,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.29,500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,952 ఉండగా, 8 గ్రాముల ధర రూ.87,616గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,09,520 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,95,200గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.24,200 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,10,000 ఉండగా, తులం ధర రూ.2,100గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.10వేలు పెరిగింది. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,10,000 ఉండగా, తులం ధర రూ.2,100 గా ఉంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Kiren Rijiju | ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలంటే ముందు విదేశీ పర్యటనలు ఆపి.. ఈ 7 సూచనలు పాటించండి.. రాహుల్‌కు కేంద్ర మంత్రి చురకలు
- ●Stock Markets | ట్రంప్‌కు మిడ్‌టర్మ్ ఝలక్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ..
- ●Sharad Pawar | మళ్లీ ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్
- ●PURE Energy | ఫ్యూర్ ఎనర్జీ ఈవీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
- ●Telangana Cabinet | ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ
- ●Ponguleti Sriniavs Reddy | బేతుపల్లి చెరువు.. మత్స్యకారులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితం

Kiren Rijiju | ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలంటే ముందు విదేశీ పర్యటనలు ఆపి.. ఈ 7 సూచనలు పాటించండి.. రాహుల్‌కు కేంద్ర మంత్రి చురకలు

Stock Markets | ట్రంప్‌కు మిడ్‌టర్మ్ ఝలక్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ..

Sharad Pawar | మళ్లీ ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్

PURE Energy | ఫ్యూర్ ఎనర్జీ ఈవీ పరిశ్రమలో అగ్నిప్రమాదం






