Supreme Court | సుప్రీంకోర్ట్‌లో జూనియర్ కోర్ట్ అటెండెంట్ పోస్టులు..
Supreme Court | సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా (Supreme Court) గ్రూప్-సీ నాన్-క్లెరికల్ కేడర్‌లో జూనియర్ కోర్ట్ అటెండెంట్ (JCA) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 130 పోస్టులను భర్తీ (JCA Recruitment) చేస్తున్నది.
Supreme Court | త్రినేత్ర న్యూస్: సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా (Supreme Court) గ్రూప్-సీ నాన్-క్లెరికల్ కేడర్‌లో జూనియర్ కోర్ట్ అటెండెంట్ (JCA) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 130 పోస్టులను భర్తీ (JCA Recruitment) చేస్తున్నది. పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఇంటర్ వరకు విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైనవారు నవంబర్ 25వరకు అధికారిక వెబ్‌సైట్‌లో తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. రాపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది. ఎంపికైనవారికి ప్రతినెల రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతం వస్తుంది. రాతపరీక్షను 2026 డిసెంబర్ 26న నిర్వహిస్తారు.
పోస్టు పేరు: జూనియర్ కోర్ట్ అటెండెంట్
మొత్తం ఖాళీలు: 130
విద్యార్హత: పదో తరగతి ఉత్తీర్ణత, ఇంటర్ (10+2) చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు 2026 అక్టోబర్ 1 నాటికి 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, మాజీ సైనికులు, వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ పరీక్షలో మొత్తం 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 25, జనరల్ ఇంగ్లిష్ నుంచి 25, జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు. గంటన్నరలో పరీక్ష పూర్తిచేయాలి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. దీనికి 25 మార్కులు కేటాయించారు.
ఎంపికైన అభ్యర్థులు కార్యాలయ నిర్వహణకు సంబంధించిన వివిధ పనులు చేయాల్సి ఉంటుంది. ఫైళ్లు, రికార్డులను ఒకచోటు నుంచి మరోచోటుకు తరలించడం. టేబుళ్లు, కుర్చీలను శుభ్రం చేయడం. అధికారులు, ఇతర సిబ్బందికి టీ, కాఫీ, స్నాక్స్, నీరు అందించడం. కార్యాలయానికి సంబంధించిన ఇతర సహాయక విధులను నిర్వహించడం వంటివి చేయాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.1500, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మాజీ సైనికులు, దివ్యాంగులు రూ.750
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 25
ఆబ్జెక్టివ్ పరీక్ష తేదీ: డిసెంబర్ 26
వెబ్‌సైట్: www.sci.gov.in
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

POWERGRID | బీటెక్ అభ్యర్థులకు శుభవార్త.. పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు
నవంబర్ 4, 2026

AEES Teaching Recruitment | అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీలో టీచర్ ఉద్యోగాలు.. నవంబర్ 2 నుంచి దరఖాస్తులు
అక్టోబర్ 31, 2026

TGPSC | టీజీపీఎస్సీ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు.. నేటి నుంచి దరఖాస్తులు
అక్టోబర్ 30, 2026
తాజావార్తలు
- ●KTR | 3,300 పైచిలుకు స్టార్టప్‌లకు అండగా టీ హబ్ : కేటీఆర్
- ●Indian Stock Markets | మదుపర్లపై కనక వర్షం.. 6 రోజుల్లో రూ.28 లక్షల కోట్లు లాభం..
- ●KTR | బడా భాయ్ మోదీ.. చోటా భాయ్ రేవంత్‌పై ఎప్పటికీ చర్యలు తీసుకోరు!
- ●Meta | సోషల్ మీడియాలో బాలల లైంగిక వేధింపుల కంటెంట్.. మెటాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు
- ●Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. ఒక్క రోజులోనే రూ.32వేలు పెరిగిన పసిడి ధర..
- ●Kiren Rijiju | ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలంటే ముందు విదేశీ పర్యటనలు ఆపి.. ఈ 7 సూచనలు పాటించండి.. రాహుల్‌కు కేంద్ర మంత్రి చురకలు

KTR | 3,300 పైచిలుకు స్టార్టప్‌లకు అండగా టీ హబ్ : కేటీఆర్

Indian Stock Markets | మదుపర్లపై కనక వర్షం.. 6 రోజుల్లో రూ.28 లక్షల కోట్లు లాభం..

KTR | బడా భాయ్ మోదీ.. చోటా భాయ్ రేవంత్‌పై ఎప్పటికీ చర్యలు తీసుకోరు!

Meta | సోషల్ మీడియాలో బాలల లైంగిక వేధింపుల కంటెంట్.. మెటాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు



