త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | వ‌రుస‌గా నాలుగో సెష‌న్‌లోనూ మిశ్ర‌మ ధోర‌ణి.. తీవ్ర అస్థిరత‌తో క‌దిలిన సూచీలు..

Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు గురువారం వరుసగా నాలుగో సెషన్‌లోనూ పరిమిత శ్రేణిలోనే కదిలాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలు, హార్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకునే అంశంపై నెలకొన్న అనిశ్చితి ఇన్వెస్టర్లను అప్రమత్తంగా ఉంచింది. అలాగే ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ బలహీనంగా ఉండొచ్చన్న అంచనాలతో ముడిచమురు ధరలు తగ్గడం మార్కెట్‌ల‌పై కొంత ప్రభావం చూపింది.

S

Business | Published On Aug 13, 2026, 4.07 pm IST

Stock Markets | వ‌రుస‌గా నాలుగో సెష‌న్‌లోనూ మిశ్ర‌మ ధోర‌ణి.. తీవ్ర అస్థిరత‌తో క‌దిలిన సూచీలు..
Advertisement

Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు గురువారం వరుసగా నాలుగో సెషన్‌లోనూ పరిమిత శ్రేణిలోనే కదిలాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలు, హార్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకునే అంశంపై నెలకొన్న అనిశ్చితి ఇన్వెస్టర్లను అప్రమత్తంగా ఉంచింది. అలాగే ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ బలహీనంగా ఉండొచ్చన్న అంచనాలతో ముడిచమురు ధరలు తగ్గడం మార్కెట్‌ల‌పై కొంత ప్రభావం చూపింది. సెన్సెక్స్ 114 పాయింట్లు (0.15 శాతం) లాభపడి 78,079.96 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 40 పాయింట్లు (0.16 శాతం) నష్టపోయి 24,395.85 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.15 శాతం పెరగ్గా, స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.27 శాతం స్వల్పంగా లాభపడింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో చ‌మురు ధ‌ర‌లు భారీగా త‌గ్గ‌డం కూడా మార్కెట్లు రిక‌వ‌రీ అయ్యేందుకు కార‌ణం అయింది.

భారీ ప‌త‌న‌మైన చ‌మురు ధ‌ర‌లు..

అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు గురువారం భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 1.49 శాతం మేర ప‌త‌న‌మై బ్యారెల్‌కు 89 డాల‌ర్ల‌కు చేర‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 1.44 శాతం మేర త‌గ్గి బ్యారెల్‌కు 81 డాల‌ర్ల‌కు వ‌చ్చింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించే అవకాశాల నేపథ్యంలో ఈ ఏడాది చమురు డిమాండ్ బలహీనంగా ఉండొచ్చ‌న్న‌ అంచనాలు ఇందుకు కారణమయ్యాయి. కాగా భారత రూపాయి విలువ 11 పైసలు తగ్గింది. గత ముగింపు 95.33తో పోలిస్తే డాలర్‌తో రూపాయి మారకం విలువ 95.44 వద్ద ముగిసింది. మార్కెట్‌ల‌ను ప్రభావితం చేసిన అంశాల్లో ముడి చ‌మురు ధ‌ర‌ల హెచ్చుత‌గ్గులు ఒక‌టి కాగా, మ‌రో అంశం అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందంపై స్పష్టత లేకపోవడం. దీంతో దేశీయ మార్కెట్‌ల‌కు స్పష్టమైన దిశ లభించలేదు.

చ‌మురు ధ‌ర‌ల‌పైనే ఆందోళ‌న‌..

అమెరికా, భారత్‌ల‌లో జూలై నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాల కంటే కాస్త మెరుగ్గా నమోదవడం ఊరటనిచ్చింది. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్, భారత రిజర్వ్ బ్యాంక్ తక్షణమే వడ్డీ రేట్లను పెంచే అవకాశాలపై ఉన్న ఆందోళనలు కొంత తగ్గాయి. అయితే ముడిచమురు ధరల్లో కొనసాగుతున్న అస్థిరత కారణంగా ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం మాత్రం మార్కెట్‌ల‌లో ప్రధాన ఆందోళనగానే కొనసాగుతోంది.

Advertisement
Advertisement