త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Janhvi Kapoor | నో గ్లామ‌ర్ – అల్లు అర్జున్ రాకాలో గిరిజ‌న రాణిగా జాన్వీక‌పూర్ – దీపికా, ర‌ష్మిక‌ల‌కు ధీటుగా!

అల్లు అర్జున్ రాకాలో దీపికా ప‌డుకోణ్, ర‌ష్మిక మంద‌న్న‌, మృణాల్ ఠాకూర్‌తో పాటు శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్ కూడా ఓ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జాన్వీ పాత్ర‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీలో జాన్వీ గిరిజ‌న రాణిగా క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Aug 13, 2026, 4.19 pm IST

Janhvi Kapoor | నో గ్లామ‌ర్ – అల్లు అర్జున్ రాకాలో గిరిజ‌న రాణిగా జాన్వీక‌పూర్ – దీపికా, ర‌ష్మిక‌ల‌కు ధీటుగా!
Advertisement

Janhvi Kapoor |  రామ్‌చ‌ర‌ణ్ పెద్ది త‌ర్వాత జాన్వీ క‌పూర్ నెక్స్ట్ మూవీ ఏద‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. పెద్దిలో త‌న పాత్ర‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో త‌దుప‌రి సినిమా విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక‌పై క‌థ‌లో ప్రాధాన్యం లేని గ్లామ‌ర్ పాత్ర‌లు చేయ‌కూడ‌ద‌ని శ్రీదేవి త‌న‌య ఫిక్సైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వ‌చ్చిన‌వి అన్ని కాకుండా న‌చ్చిన‌వి మాత్ర‌మే చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.

న‌లుగురు హీరోయిన్లు...

అల్లు అర్జున్ రాకా నుంచే కొత్త‌ త‌న నిర్ణ‌యాన్ని అమ‌లు చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో దీపికా ప‌డుకోణ్‌, ర‌ష్మిక మంద‌న్న‌, మృణాల్ ఠాకూర్‌తో పాటు జాన్వీ క‌పూర్ ఓ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ న‌లుగురు హీరోయిన్ల‌లో ఎవ‌రూ ఏ పాత్ర చేయ‌బోతున్నార‌న్న‌ది ఇప్ప‌టివ‌ర‌కు మేక‌ర్స్ రివీల్ చేయ‌లేదు. వారి పాత్ర‌ల విష‌యంలో స‌స్పెన్స్ మెయింటేన్ చేస్తూ సినిమాపై ఉన్న హైప్‌ను పెంచుతున్నారు.

గిరిజ‌న రాణిగా....

కాగా ఈ సినిమాలో జాన్వీ క‌పూర్ క్యారెక్ట‌ర్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ రూమ‌ర్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇందులో గ్లామ‌ర్‌కు దూరంగా ఓ ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో ఆమె క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. గిరిజ‌న రాణిగా ఈ బాలీవుడ్ బ్యూటీ న‌టించ‌నుంద‌ని చెబుతున్నారు. జాన్వీక‌పూర్‌పై రాకాలో కొన్ని యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఉంటాయ‌ని అంటున్నారు. చాలా స‌ర్‌ప్రైజింగ్‌గా, షాకింగ్‌గా శ్రీదేవి త‌న‌య పాత్ర సాగుతుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు బాలీవుడ్‌, టాలీవుడ్ సినిమాల్లో చూసిన జాన్వీ క‌పూర్‌కు పూర్తిగా భిన్నంగా కొత్త‌గా అట్లీ ఆమెను ఈ సినిమాలో ప్ర‌జెంట్ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ప్రెగ్నెంట్ ఉమెన్‌...

ఈ సినిమాలో దీపికా ప‌డుకోణ్ ప్రెగ్నెంట్ ఉమెన్‌గానే క‌నిపించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. పురాణాల‌తో ముడిప‌డి చాలా ఎమోష‌న‌ల్‌గా ఆమె పాత్ర సాగుతుంద‌ని అంటున్నారు. దీపికా ప‌డుకోణ్‌కు ర‌క్ష‌ణ‌గా నిలిచే యోధురాలిగా ర‌ష్మిక మంద‌న్న క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ని స‌మాచారం. మృణాల్ మాత్రం మోడ్ర‌న్ గ‌ర్ల్‌గా క‌నిపిస్తుంద‌ని టాక్ వినిపిస్తోంది. న‌లుగురు హీరోయిన్ల‌ పాత్ర‌లు డిఫ‌రెంట్‌గా ఉంటాయ‌ని చెబుతున్నారు. రాకా మూవీ వ‌చ్చే ఏడాది థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. దాదాపు 1300 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకు స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది.

 

 

Advertisement
Advertisement