త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Gaurav Gogoi | కుంభ‌క‌ర్ణుడు నిద్ర లేచారు.. అమిత్ షాపై గౌర‌వ్ గొగోయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

MP Gaurav Gogoi | కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పై కాంగ్రెస్ ఎంపీ గౌర‌వ్ గొగోయ్ (Gaurav Gogoi) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కుంభకర్ణుడిలా నిద్రపోయి (Kumbhakaran-like sleep) సెషన్ ముగియడానికి రెండు రోజుల ముందు లేచి చ‌ర్చ‌కు సిద్ధ‌మంటూ వ‌చ్చారని వ్యాఖ్యానించారు.

D

National | Published On Aug 13, 2026, 3.54 pm IST

MP Gaurav Gogoi | కుంభ‌క‌ర్ణుడు నిద్ర లేచారు.. అమిత్ షాపై గౌర‌వ్ గొగోయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

MP Gaurav Gogoi | త్రినేత్ర‌.న్యూస్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పై కాంగ్రెస్ ఎంపీ గౌర‌వ్ గొగోయ్ (Gaurav Gogoi) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హోంమంత్రి రాక‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. స‌మావేశాలు ముగియ‌డానికి రెండు రోజుల ముందు మాత్ర‌మే కుంభ‌క‌ర్ణుడు (షాను ఉద్దేశిస్తూ) నిద్ర నుంచి లేచారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న ఎందుకు స‌భ‌కు రాలేద‌ని ప్ర‌శ్నించారు.

మీడియా స‌మావేశంలో గొగోయ్ మాట్లాడుతూ.. జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద జులై 20న విద్యార్థుల‌పై పోలీసుల చ‌ర్య‌పై హోం మంత్రి ప్ర‌క‌ట‌న చేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు ప‌దేప‌దే డిమాండ్ చేశాయ‌ని గుర్తు చేశారు. "15 రోజుల పాటూ హోంమంత్రి కనిపించలేదు. కుంభకర్ణుడిలా నిద్రపోయి (Kumbhakaran-like sleep) సెషన్ ముగియడానికి రెండు రోజుల ముందు లేచి చ‌ర్చ‌కు సిద్ధ‌మంటూ వ‌చ్చారు. అసలు చర్చ జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు..?" అని గొగోయ్ ప్ర‌శ్నించారు.

ప్రతిపక్షాల డిమాండ్లకు హోం మంత్రి స్పందించేందుకు అవకాశం ఇవ్వకుండా, ప్రభుత్వం పదేపదే తదుపరి చర్చలంటూ కాల‌యాప‌న చేసింద‌ని మండిప‌డ్డారు. కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పించుకుంటోందని ఆరోపించారు. చివ‌రికి లోక్‌స‌భ వాయిదా ప‌డుతున్న స‌మ‌యంలో ప్ర‌ధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ప్ర‌త్య‌క్ష‌మ‌య్యార‌ని విమ‌ర్శించారు. ముగింపు సంద‌ర్భంగా స్పీక‌ర్ ప్ర‌సంగం కూడా లేద‌ని వ్యాఖ్యానించారు.

కేంద్రం వ‌ణికిపోయింది..

ఈ వర్షాకాల సమావేశాలంతటా కేంద్రం భయపడి, బెదిరిపోయింద‌ని గోగోయ్ వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌ షా సభా కార్యకలాపాలకు సైతం పూర్తిగా దూరంగా ఉన్నారని పేర్కొన్నారు. తాము ఎన్నో సమావేశాలను చూశామ‌ని, కానీ ప్రభుత్వం ఇంతగా భయపడటం ఎప్పుడూ చూడలేద‌న్నారు. బ‌హుశా.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సభా కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉన్న మొదటి సమావేశం ఇదే కావొచ్చు అని వ్యాఖ్యానించారు.

Also Read..

అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాద‌ల్‌పై దాడి

వందేమాత‌రం పాడి వెళ్లిపోయారు.. ప్ర‌ధాని, అమిత్ షాపై మ‌ల్లు ర‌వి ఆగ్ర‌హం

12 బిల్లుల‌కు ఆమోదం.. ఒక్క దానిపైనే చ‌ర్చ‌

Advertisement
Advertisement