DK Shivakumar | రాజీనామా చేస్తే.. క్షణం ఆలోచించకుండా ఆమోదిస్తా.. అసమ్మతి ఎమ్మెల్యేలకు డీకే స్ట్రాంగ్ వార్నింగ్
DK Shivakumar | అసమ్మతి ఎమ్మెల్యేలకు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా రాజీనామా (Resignation) చేస్తే.. మారు ఆలోచించకుండా క్షణాల్లోనే దాన్ని ఆమోదిస్తానంటూ హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని సూచించారు.
DK Shivakumar | త్రినేత్ర.న్యూస్ : కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ (Karnataka Congress)లో అసమ్మతి నేతలు పెరిగిపోతున్నారు. మంత్రి పదవులు దక్కలేదని కొందరు, నచ్చిన పోర్ట్‌ఫోలియో (Portfolio) కేటాయించలేదని మరికొందరు ప్రభుత్వంపై అలక ప్రదర్శిస్తున్నారు. రాజీనామాలు చేస్తూ అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో అసమ్మతి నేతలకు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తాజాగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
కర్ణాటక ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ రాజకీయ వేడి రాజుకుంది. మంత్రి పదవులు దక్కకపోవడంతో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా కూడా చేశారు. నేతల తీరుపై సీఎం డీకే శివకుమార్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎవరైనా రాజీనామా చేస్తే.. మారు ఆలోచించకుండా క్షణాల్లోనే దాన్ని ఆమోదిస్తానంటూ హెచ్చరించారు. అయితే, అంతకంటే ముందు ఆ ఎమ్మెల్యేలతో తాను వ్యక్తిగతంగా ఫోన్‌లో మాట్లాడతానని చెప్పారు. అదే సమయంలో మంత్రి పదవి దక్కని వారిని ఉద్దేశించి ఓ ఉదాహరణ కూడా చెప్పారు.
రాజీనామా చేస్తున్న వారంతా రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. రిజైన్ చేసే వారిని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. అయితే, నేతలు కాస్త ఓపిక పట్టాలని సూచించారు. ధరమ్ సింగ్ పాలన సమయంలోనైనా, సిద్ధరామయ్య, పరమేశ్వర పాలన సమయంలోనైనా తాను సంయమనంతో వేచి ఉన్నట్లు ఈ సందర్భంగా డీకే గుర్తు చేశారు. "ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలి. పార్టీ చాలా ముఖ్యం. ఎవరైనా రాజీనామా చేస్త.. కొన్ని నిమిషాల్లోనే నేను దానిని ఆమోదిస్తాను" అని డీకే స్పష్టం చేశారు. మరోవైపు కరవు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని మంత్రులందరినీ ఆదేశించినట్లు సీఎం తెలిపారు.
Also Read..
రైతుల ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం.. ప్రతీ గింజకూ లెక్క చెప్పాల్సిందే : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
30 సెకన్లలో 34 కత్తిపోట్లు.. స్కూల్ టీచర్‌పై వ్యక్తి పైశాచిక దాడి
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Indian National Sweet Jalebi | రసగుల్లా, గులాబ్ జామున్ సరే.. మరి జిలేబీని ఇంగ్లీష్‌లో ఏమంటారు? 99% మందికి ఈ సీక్రెట్ తెలియదు!
- ●Toxic Yash Success Story | కేవలం రూ.300తో బెంగళూరుకు.. టీలు అమ్మే స్థాయి నుంచి రూ.4000 కోట్ల 'రామాయణ' వరకు.. రాకీ భాయ్ ఇన్స్పైరింగ్ స్టోరీ!
- ●IIT Placements Crisis | ఐఐటీ చదివినా నో జాబ్.. టాపర్లకు కూడా ప్లేస్‌మెంట్స్ కరవు.. అసలు కారణాలివే..!
- ●Kalyana Lakshmi & Shaadi Mubarak | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు షాక్.. ఆ చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు స్టే!
- ●Enugula Rakesh Reddy | పెళ్లి పనులు ఒకరు చేస్తే.. మంగళహారతి పట్టిన వాళ్లు ఆ పెళ్లి మేమే చేశాం అన్నట్లుంది
- ●Bhadrachalam-Vizag Road Corridor | భద్రాచలం టు విశాఖపట్నం హైవే: రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ ప్రశ్నకు నితిన్ గడ్కరీ ఆన్సర్ ఇదే

Indian National Sweet Jalebi | రసగుల్లా, గులాబ్ జామున్ సరే.. మరి జిలేబీని ఇంగ్లీష్‌లో ఏమంటారు? 99% మందికి ఈ సీక్రెట్ తెలియదు!

Toxic Yash Success Story | కేవలం రూ.300తో బెంగళూరుకు.. టీలు అమ్మే స్థాయి నుంచి రూ.4000 కోట్ల 'రామాయణ' వరకు.. రాకీ భాయ్ ఇన్స్పైరింగ్ స్టోరీ!

IIT Placements Crisis | ఐఐటీ చదివినా నో జాబ్.. టాపర్లకు కూడా ప్లేస్‌మెంట్స్ కరవు.. అసలు కారణాలివే..!

Kalyana Lakshmi & Shaadi Mubarak | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు షాక్.. ఆ చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు స్టే!





