త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Karnataka Beggar | బెగ్గ‌ర్ మృతి.. 30 సంచుల్లో బ‌య‌ట‌ప‌డ్డ రూ. 8,40,000

Karnataka Beggar | అద్దె ఇంట్లో నివాస‌ముంటూ భిక్షాట‌న చేసే ఓ వృద్ధురాలు ఆదివారం మృతి చెందింది. దీంతో స్థానికులు ఆమె ఇంటిని ప‌రిశీలించ‌గా.. 30 సంచుల్లో ల‌క్ష‌ల కొద్ది చిల్ల‌ర నాణేలు, నోట్ల క‌ట్ట‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి.

S

National | Published On Aug 24, 2026, 10.13 pm IST

Karnataka Beggar | బెగ్గ‌ర్ మృతి.. 30 సంచుల్లో బ‌య‌ట‌ప‌డ్డ రూ. 8,40,000
Advertisement

Karnataka Beggar | త్రినేత్ర‌.న్యూస్ : అద్దె ఇంట్లో నివాస‌ముంటూ భిక్షాట‌న చేసే ఓ వృద్ధురాలు ఆదివారం మృతి చెందింది. దీంతో స్థానికులు ఆమె ఇంటిని ప‌రిశీలించ‌గా.. 30 సంచుల్లో ల‌క్ష‌ల కొద్ది చిల్ల‌ర నాణేలు, నోట్ల క‌ట్ట‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ భారీ న‌గ‌దును చూసి స్థానికులు షాక‌య్యారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. క‌ర్ణాట‌క‌లోని మాండ్య‌కు చెందిన హుర్(68) అనే వృద్ధురాలు త‌న సోద‌రితో క‌లిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. వీరిద్ద‌రికి వివాహం కాలేదు. అక్కాచెల్లెళ్లు ఇద్ద‌రు కూడా భిక్షాట‌న చేస్తూ జీవ‌నం సాగిస్తున్నారు. రెండేళ్ల క్రితం సోద‌రి మ‌ర‌ణించింది. హుర్ కూడా అనారోగ్య స‌మస్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఆదివారం క‌న్నుమూసింది.

గ‌మ‌నించిన స్థానికులు హుర్ చ‌నిపోయిన విష‌యాన్ని ఆమె సోద‌రుల‌కు చేర‌వేశారు. ఇక ఆ ఇంట్లో ఉన్న 30 సంచుల‌ను స్థానికులు ప‌రిశీలించ‌గా, వాటి నిండా చిల్ల‌ర నాణేలు, రూ. 10, రూ. 20, రూ. 50 విలువ చేసే నోట్ల క‌ట్ట‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. వాటిని లెక్కించ‌గా మొత్తం రూ. 8,40,000గా తేలింది. ఆ న‌గ‌దును ఆమె సోద‌రుల‌కు అప్ప‌గించారు.

ఒక సోద‌రుడు రూ. 6 ల‌క్ష‌లు తీసుకోగా, మిగిలిన రూ. 2,40,000 మ‌రో సోద‌రుడికి అప్ప‌గించారు. ఈ రూ. 2 ల‌క్ష‌ల 40 వేల‌ను మసీదుకు విరాళంగా ప్ర‌క‌టించారు. అనంత‌రం వృద్ధురాలికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.

Advertisement
Advertisement