RBI | రూ.100, రూ.500 నోట్లపై క్లారిటీ ఇచ్చిన ఆర్‌బీఐ.. ఇకపై మరింత మన్నికగా ముద్రణ..
RBI | రూ.100, రూ.200, రూ.500 నోట్లపై ప్రజల్లో ప్రస్తుతం నెలకొంటున్న అనేక సందేహాలకు ఆర్‌బీఐ ఎట్టకేలకు సమాధానం ఇచ్చింది. ఆయా నోట్లను రద్దు చేసే అవకాశం లేదని స్పష్టం చేసింది. కానీ దేశంలో నోట్ల రద్దు, రూ.2000 నోట్ల ఉప సంహరణ తరువాత ఆయా నోట్లు భారీ ఎత్తున చెలామణీలో ఉన్నందున వాటిని ఎక్కువ కాలం పాటు మన్నేలా సరికొత్త సెక్యూరిటీ ఫీచర్లను అందించనున్నామని తెలిపింది.
RBI | రూ.100, రూ.200, రూ.500 నోట్లపై ప్రజల్లో ప్రస్తుతం నెలకొంటున్న అనేక సందేహాలకు ఆర్‌బీఐ ఎట్టకేలకు సమాధానం ఇచ్చింది. ఆయా నోట్లను రద్దు చేసే అవకాశం లేదని స్పష్టం చేసింది. కానీ దేశంలో నోట్ల రద్దు, రూ.2000 నోట్ల ఉప సంహరణ తరువాత ఆయా నోట్లు భారీ ఎత్తున చెలామణీలో ఉన్నందున వాటిని ఎక్కువ కాలం పాటు మన్నేలా సరికొత్త సెక్యూరిటీ ఫీచర్లను అందించనున్నామని తెలిపింది. అలాగే ఆయా నోట్ల ముద్రణ విషయంలోనూ మార్పులను చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ నోట్ల డిజైన్‌లో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది. కేవలం సెక్యూరిటీ ఫీచర్లు, ముద్రణ (ఇంకు, వాటర్ మార్కు) అంశాల్లోనే మార్పులు ఉంటాయని తెలిపింది.
చెలామణీ అధికం..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు భారీ సంఖ్యలో జరుగుతున్నప్పటికీ అన్ని చోట్లా ఈ సౌకర్యం అందుబాటులో ఉండని కారణంగా చాలా వరకు ప్రాంతాల్లో ప్రజలు ఇంకా పెద్ద ఎత్తునే నగదు చెల్లింపులు చేస్తున్నారు. రిటైల్ మార్కెట్లు, గ్రామీణ వ్యాపారం, రవాణా వ్యవస్థ, చిన్న వ్యాపారాల్లో నగదు చెలామణీ అధికంగానే ఉంది. ముఖ్యంగా రూ.100 నోట్లను ఆయా ప్రాంతాల్లో అధికంగా ఉపయోగిస్తున్నారు. అయితే ఆ నోట్లు కాలక్రమేణా పలు కారణాల వల్ల చిరిగిపోవడం, వాటిపై ఉన్న అక్షరాలు సరిగ్గా కనిపించకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఆర్‌బీఐ గుర్తించింది. ఈ క్రమంలోనే కరెన్సీ నోట్ల నాణ్యతను పెంచేందుకు గాను ఆయా నోట్లకు పలు మార్పులు చేయాలని చూస్తోంది. ముఖ్యంగా రూ.100, రూ.500 నోట్లు అత్యధికంగా వినియోగంలో ఉన్న కారణంగా ఈ నోట్లకు ముందుగా మార్పులు చేయనున్నారు.
భద్రత, మన్నిక ప్రమాణాల మెరుగుకు..
కరెన్సీ నోట్లకు గాను భద్రత, మన్నిక ప్రమాణాలను మరింత మెరుగు పరిచేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్‌బీఐ వెల్లడించింది. ఈ క్రమంలోనే నోట్ల ముద్రణ నాణ్యతను ఆర్‌బీఐ పెంచనుంది. ఇంక్ దీర్ఘకాలం పాటు నోటుపై నిలిచి ఉండేలా ప్రత్యేక ఏర్పాటు చేయనున్నారు. సెక్యూరిటీ విషయంలో కీలకమైన మార్పులు చేయనున్నారు. దీని వల్ల ఇకపై రూ.100, రూ.500 నోట్లకు నకిలీ నోట్లను సృష్టించడం ఇంకా కష్టమవుతుందని ఆర్‌బీఐ తెలిపింది. కరెన్సీ నోట్లను అధికంగా వినియోగిండం వల్ల కాలక్రమేణా ఆ నోట్లు ఎక్కువ సార్లు ముడుచుకుని సెక్యూరిటీ థ్రెడ్స్ మసకబారుతాయి. ముద్రణ అక్షరాలు, చిహ్నాలు, ఇతర వివరాలు స్పష్టతను కోల్పోతాయి. ఈ క్రమంలోనే ఎక్కువ కాలం పాటు నోట్లు మన్నికగా ఉండేలా ఆర్‌బీఐ ఆయా కరెన్సీ నోట్లకు గాను పలు మార్పులు చేసి కొత్త నోట్లను ముద్రిస్తున్నట్లు తెలిపింది.
ఆందోళన చెందాల్సిన పనిలేదు: ఆర్‌బీఐ
కొత్త నోట్లలో మైక్రో లెటరింగ్, వాటర్‌మార్క్ స్పష్టత, ఇంక్ నాణ్యతను మరింత బలోపేతం చేయడం ద్వారా నకిలీ నోట్ల ప్రింటింగ్‌ని అడ్డుకోవాలని ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే పాత, కొత్త నోట్లకు అక్షరాల స్పష్టత, ఇంకు బ్రైట్ నెస్ విషయంలో పలు తేడాలు ఉంటాయని, కనుక కొత్త నోట్లను చూసి ప్రజలు ఆందోళన చెందవద్దని ఆర్‌బీఐ కోరింది. పాత, కొత్త నోట్లు అన్నింటినీ ఏటీఎంలు తీసుకుంటాయని, బ్యాంకుల్లోనూ ఇస్తారని తెలిపింది. నోట్లకు సంబంధించి డిజైన్ ఫ్రేమ్ వర్క్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపిన ఆర్బీఐ కేవలం క్వాలిటీ, సెక్యూరిటీ ఫీచర్లను మాత్రమే మెరుగు పరిచినట్లు వెల్లడించింది. అయితే ఈ విషయాలపై రానున్న రోజుల్లో ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తామని పేర్కొంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●One Nation - One Election | 2029లోనే వన్ నేషన్- వన్ ఎలక్షన్?
- ●Polytechnic | పాలిటెక్నిక్ విద్యార్థులు నష్టపోకుండా ఉన్నత స్థాయి కమిటీ
- ●Karnataka Beggar | బెగ్గర్ మృతి.. 30 సంచుల్లో బయటపడ్డ రూ. 8,40,000
- ●Suicide | హైదరాబాద్‌లో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
- ●Teenmar Mallanna | ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా : తీన్మార్ మల్లన్న
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. హైదరాబాద్‌లో 25న ట్రాఫిక్ ఆంక్షలు..

One Nation - One Election | 2029లోనే వన్ నేషన్- వన్ ఎలక్షన్?

Polytechnic | పాలిటెక్నిక్ విద్యార్థులు నష్టపోకుండా ఉన్నత స్థాయి కమిటీ

Karnataka Beggar | బెగ్గర్ మృతి.. 30 సంచుల్లో బయటపడ్డ రూ. 8,40,000

Suicide | హైదరాబాద్‌లో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య





