త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Party | 22A బాధితులకు బాసటగా బీఆర్ఎస్ పార్టీ

BRS Party | కుత్బుల్లాపూర్ ప‌రిధిలోని 22ఏ బాధితుల‌కు బాస‌ట‌గా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ స‌మావేశం నిర్వ‌హించ‌నుంది. ఈ నెల 25న ఉద‌యం 10.30 గంట‌ల‌కు షాపూర్‌న‌గ‌ర్‌లోని ఎంజే గార్డెన్స్‌లో ఈ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు.

S

Hyderabad | Published On Aug 24, 2026, 8.32 pm IST

BRS Party | 22A బాధితులకు బాసటగా బీఆర్ఎస్ పార్టీ
Advertisement

BRS Party | త్రినేత్ర‌.న్యూస్ : కుత్బుల్లాపూర్ ప‌రిధిలోని 22ఏ బాధితుల‌కు బాస‌ట‌గా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ స‌మావేశం నిర్వ‌హించ‌నుంది. ఈ నెల 25న ఉద‌యం 10.30 గంట‌ల‌కు షాపూర్‌న‌గ‌ర్‌లోని ఎంజే గార్డెన్స్‌లో ఈ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆధ్వ‌ర్యంలో జ‌రిగే ఈ స‌మావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ మ‌రీశ్‌రావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మల్కాజ్‌గిరి ఎంపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జి రాగిడి ల‌క్ష్మారెడ్డి హాజ‌రు కానున్నారు.

ప్రభుత్వ యంత్రాంగం చేసిన తప్పిదాల కారణంగా కుత్బుల్లాపూర్ లోని పలు కాలనీలు, నివాస ప్రాంతాలు అకారణంగా 22A నిషేధిత జాబితాలో చేర్చబడటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్నారు. ఈ సమస్యతో అరిగోస పడుతున్న బాధితులకు అండగా నిలిచి, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడ‌నున్నారు.

Advertisement
Advertisement