Suicide | హైదరాబాద్‌లో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
Suicide | హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీలో విషాదం నెలకొంది. కేరళకు చెందిన ఓ వివాహిత ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
Suicide | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీలో విషాదం నెలకొంది. కేరళకు చెందిన ఓ వివాహిత ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సోమవారం సాయంత్రం 3.47 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది.
కేపీహెచ్‌బీ ఎస్ఐ శశిధర్ తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని కానూర్‌కు చెందిన సోను పురుషోత్తమ్‌కు శీతల్(32)కు ఆరేండ్ల క్రితం పెళ్లైంది. వీరికి నాలుగేళ్ల చిన్నారి ఉంది. సోను పురుషోత్తమ్ హైదరాబాద్‌లోనే ఎస్బీఐలో డీఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. సోను తన భార్య, కుమార్తె, తల్లిదండ్రులతో కలిసి కేపీహెచ్‌బీ ఆరో ఫేజ్‌లోని ఓ అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తులో ఉంటున్నారు.
అయితే శీతల్ గత కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సోమవారం మధ్యాహ్నం ఐదో అంతస్తు నుంచి ఆరో అంతస్తుకు ఆమె మెట్ల మార్గంలో వెళ్లారు. మెట్లపై 10 నిమిషాల పాటు కూర్చున్న అనంతరం టెర్రస్ పైకి ఎక్కి కిందకు దూకేసింది. దీంతో శీతమ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
సంబంధిత వార్తలు

Traffic Restrictions | బీ అలర్ట్.. హైదరాబాద్‌లో 25న ట్రాఫిక్ ఆంక్షలు..
ఆగస్టు 24, 2026

Minister Uttam Kumar Reddy | హైదరాబాద్‌లో అందుబాటులోకి అంతర్జాతీయ న్యాయ నిపుణులు
ఆగస్టు 24, 2026

MP Dharmapuri Aravind | ఈడ ఉన్నయే బందయెటట్టున్నయంటే.. ఆన్నుంచి ఇంకేవో ఇన్స్టిట్యూషన్లు తెస్తడట
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●Teenmar Mallanna | ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా : తీన్మార్ మల్లన్న
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. హైదరాబాద్‌లో 25న ట్రాఫిక్ ఆంక్షలు..
- ●KRMB | కృష్ణా నది నీటి పంపిణీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
- ●Harish Rao | గుండె తరుక్కుపోతున్నది : హరీశ్‌రావు
- ●BRS Party | 22A బాధితులకు బాసటగా బీఆర్ఎస్ పార్టీ
- ●Telangana Assembly | సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు

Teenmar Mallanna | ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా : తీన్మార్ మల్లన్న

Traffic Restrictions | బీ అలర్ట్.. హైదరాబాద్‌లో 25న ట్రాఫిక్ ఆంక్షలు..

KRMB | కృష్ణా నది నీటి పంపిణీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు

Harish Rao | గుండె తరుక్కుపోతున్నది : హరీశ్‌రావు



