Traffic Restrictions | బీ అలర్ట్.. హైదరాబాద్‌లో 25న ట్రాఫిక్ ఆంక్షలు..
Traffic Restrictions | ఈ నెల 25న మిలాద్-ఉన్-నబీ పండుగను పురస్కరించుకుని దారూస్సలాంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో జల్సా కార్యక్రమం నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రం 6 నుంచి 26 తెల్లవారుజామున 4 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు.
Traffic Restrictions | త్రినేత్ర.న్యూస్ : ఈ నెల 25న మిలాద్-ఉన్-నబీ పండుగను పురస్కరించుకుని దారూస్సలాంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో జల్సా కార్యక్రమం నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రం 6 నుంచి 26 తెల్లవారుజామున 4 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా.. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
- మలక్‌కుంట, బేగం బజార్ ఛత్రీ వైపు నుంచి: దారూస్సలాం రోడ్డు వైపు వచ్చే వాహనాలను అలస్కా టి-జంక్షన్ వద్ద ఎంజే బ్రిడ్జ్, ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారు.
- మల్లేపల్లి ఎక్స్ రోడ్, బోయగూడ కమాన్, మంగళ్‌హాట్ వైపు నుంచి: దారూస్సలాం వైపు వచ్చే వాహనాలను అఘాపురా ఎక్స్ రోడ్ వద్ద టక్కర్‌వాడి మరియు చార్మినార్ వైపు మళ్లిస్తారు.
- బజార్ ఘాట్, తాజ్ ఐలాండ్ వైపు నుంచి: దారూస్సలాం వైపు వచ్చే వాహనాలను ఏక్ మినార్ వద్ద బజార్ ఘాట్ మరియు నాంపల్లి రైల్వే స్టేషన్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
- సీతారాంభాగ్, మంగళ్‌హాట్ వైపు నుంచి: దారూస్సలాం రోడ్డు వైపు వచ్చే వాహనాలను అఘాపురా జంక్షన్ వద్ద చార్‌కండిల్ వైపు మళ్లిస్తారు.
- మెహదీపట్నం, ఆసిఫ్‌నగర్ వైపు నుంచి: దారూస్సలాం వైపు వచ్చే వాహనాలను మల్లేపల్లి ఎక్స్ రోడ్ వద్ద గోకుల్ నగర్ మరియు బజార్ ఘాట్ వైపు మళ్లిస్తారు.
పార్కింగ్ ఏర్పాట్లు:
దారూస్సలాం జల్సా కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు ట్రాఫిక్ రద్దీ కాకుండా వాహనాలను కేవలం కింద పేర్కొన్న నిర్దేశిత ప్రాంతాలలో మాత్రమే పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
- గవర్నమెంట్ డిస్పెన్సరీ హాస్పిటల్ (సీతారాంభాగ్): 4-వీలర్లు
- అఘా దర్గా: 2-వీలర్లు
- సర్దార్ బేగ్ దర్గా: 2-వీలర్లు
- పాన్ మండి రోడ్: 2-వీలర్లు
- ఎస్‌బీఐ రోడ్: 2-వీలర్లు
- రాకెట్ గ్రౌండ్: 4-వీలర్లు
సంబంధిత వార్తలు

Minister Uttam Kumar Reddy | హైదరాబాద్‌లో అందుబాటులోకి అంతర్జాతీయ న్యాయ నిపుణులు
ఆగస్టు 24, 2026

MP Dharmapuri Aravind | ఈడ ఉన్నయే బందయెటట్టున్నయంటే.. ఆన్నుంచి ఇంకేవో ఇన్స్టిట్యూషన్లు తెస్తడట
ఆగస్టు 24, 2026

DK Aruna | 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలి: డీకే అరుణ
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●Harish Rao | గుండె తరుక్కుపోతున్నది : హరీశ్‌రావు
- ●BRS Party | 22A బాధితులకు బాసటగా బీఆర్ఎస్ పార్టీ
- ●Telangana Assembly | సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు
- ●తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌లో వలసవాదుల పెత్తనం..!
- ●Minister Uttam Kumar Reddy | హైదరాబాద్‌లో అందుబాటులోకి అంతర్జాతీయ న్యాయ నిపుణులు
- ●MP Eatala Rajender | హానర్ హోమ్స్ జాగా..వెనక్కి తీసుకోగలరా సీఎం గారూ? : ఎంపీ ఈటల

Harish Rao | గుండె తరుక్కుపోతున్నది : హరీశ్‌రావు

BRS Party | 22A బాధితులకు బాసటగా బీఆర్ఎస్ పార్టీ

Telangana Assembly | సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌లో వలసవాదుల పెత్తనం..!



