Donald Trump sign | కరెన్సీ నోట్లపై ట్రంప్ సంతకం.. తొలి అధ్యక్షుడిగా ఘనత!
Donald Trump sign | త్వరలో నిర్వహించనున్న అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకల వేళ్ల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన పేరిట సరికొత్త చరిత్ర లిఖించుకోనున్నారు. ఆ దేశ కరెన్సీ నోట్ల(Currency notes)పై తొలి అధ్యక్షుడిగా సంతకం (Sign) చేయనున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ (US treasury department) వెల్లడించింది.
త్రినేత్ర.న్యూస్: త్వరలో నిర్వహించనున్న అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకల వేళ్ల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన పేరిట సరికొత్త చరిత్ర లిఖించుకోనున్నారు. ఆ దేశ కరెన్సీ నోట్ల(Currency notes)పై తొలి అధ్యక్షుడిగా సంతకం (Sign) చేయనున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ (US treasury department) వెల్లడించింది. 1861 నుంచి అమెరికా కరెన్సీ నోట్లపై ట్రెజరర్, ట్రెజరీ కార్యదర్శి సంతకం ఉండడం సంప్రదాయంగా వస్తోంది. తాజాగా ఆ దేశ చరిత్రలో అధ్యక్షుడు సంతకం చేయనుండడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
100 డాలర్ల నోట్లపై..
ఈ 165 ఏళ్ల సంప్రదాయాన్ని ట్రంప్ ఇప్పుడు బ్రేక్ చేయబోతున్నారు. 100 డాలర్ల నోట్లను జూన్‌లో ముద్రించనుండగా వాటిపై ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్‌తో పాటు ట్రంప్ సంతకం చేయనున్నారు. ఈ సందర్భంగా బెసెంట్ మాట్లాడుతూ.. తమ దేశం సాధించిన చరిత్రాత్మక విజయాలను గుర్తుచేసుకోవడానికి ఇంతకంటే గొప్ప మార్గం మరొకటి ఉండదన్నారు. ఇది సరైన నిర్ణయమేనని.. అందుకు ట్రంప్ అర్హుడేనని ట్రెజరర్ బ్రాండన్ బీజ్ సమర్థించారు. ఇదిలా ఉండగా ట్రంప్ ముఖచిత్రంతో స్మారక నాణెం రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం విదితమే.
తాజావార్తలు
- ●One Nation - One Election | 2029లోనే వన్ నేషన్- వన్ ఎలక్షన్?
- ●Polytechnic | పాలిటెక్నిక్ విద్యార్థులు నష్టపోకుండా ఉన్నత స్థాయి కమిటీ
- ●Karnataka Beggar | బెగ్గర్ మృతి.. 30 సంచుల్లో బయటపడ్డ రూ. 8,40,000
- ●Suicide | హైదరాబాద్లో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
- ●Teenmar Mallanna | ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా : తీన్మార్ మల్లన్న
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. హైదరాబాద్లో 25న ట్రాఫిక్ ఆంక్షలు..

One Nation - One Election | 2029లోనే వన్ నేషన్- వన్ ఎలక్షన్?

Polytechnic | పాలిటెక్నిక్ విద్యార్థులు నష్టపోకుండా ఉన్నత స్థాయి కమిటీ

Karnataka Beggar | బెగ్గర్ మృతి.. 30 సంచుల్లో బయటపడ్డ రూ. 8,40,000

Suicide | హైదరాబాద్లో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య





