త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | గుండె త‌రుక్కుపోతున్న‌ది : హ‌రీశ్‌రావు

Harish Rao | పాలిటెక్నిక్ విద్యార్థుల ఆవేదన వింటే గుండె తరుక్కుపోతున్నది అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

S

Telangana | Published On Aug 24, 2026, 8.40 pm IST

Harish Rao | గుండె త‌రుక్కుపోతున్న‌ది : హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : పాలిటెక్నిక్ విద్యార్థుల ఆవేదన వింటే గుండె తరుక్కుపోతున్నది అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. పూర్వ విద్యార్థిగా, పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను అని ఆయ‌న తెలిపారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్‌ 97ను వెంటనే రద్దు చేయాలి. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలి అని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల తరఫున వారి సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తాం. వారి న్యాయమైన పోరాటానికి అండగా నిలబడతాం అని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement