Sukanya Samriddhi Yojana | కేవలం వడ్డీ ద్వారానే రూ.50 లక్షలు పొందవచ్చు.. పోస్టాఫీస్‌లో అద్భుతమైన పథకం..
Sukanya Samriddhi Yojana | కుమార్తె భవిష్యత్తును ఆర్థికంగా భద్రపరచాలనుకునే తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై) అత్యంత ప్రయోజనకరమైన చిన్న పొదుపు పథకాలలో ఒకటి. ఈ పథకం ద్వారా దీర్ఘకాలికంగా పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి భారీ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది.
Sukanya Samriddhi Yojana | కుమార్తె భవిష్యత్తును ఆర్థికంగా భద్రపరచాలనుకునే తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై) అత్యంత ప్రయోజనకరమైన చిన్న పొదుపు పథకాలలో ఒకటి. ఈ పథకం ద్వారా దీర్ఘకాలికంగా పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి భారీ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వడ్డీ రూపంలోనే దాదాపు రూ.50 లక్షల వరకు సంపాదించవచ్చు. ఈ పథకంలో కుమార్తె పేరుతో సమీప పోస్టాఫీస్ లేదా అధీకృత బ్యాంకులో ఖాతా తెరవచ్చు. ఖాతా తెరిచిన తర్వాత కుమార్తె 15 ఏళ్ల వయస్సు వచ్చే వరకు మాత్రమే పెట్టుబడులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఖాతా మెచ్యూరిటీ మాత్రం ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి 21 సంవత్సరాల తర్వాత పూర్తవుతుంది. అంటే 15 సంవత్సరాలు మాత్రమే డిపాజిట్ చేసినా, మిగిలిన కాలంలో కూడా ఖాతాపై వడ్డీ కొనసాగుతుంది.
21 ఏళ్ల తరువాత పథకానికి మెచ్యూరిటీ..
కుమార్తె పుట్టిన వెంటనే ఈ పథకంలో పెట్టుబడి ప్రారంభిస్తే ప్రతి నెల లేదా ప్రతి ఏడాది తక్కువ మొత్తాన్ని క్రమంగా పెట్టుబడిగా పెట్టి పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. 15 సంవత్సరాల తర్వాత డిపాజిట్లు నిలిపివేసినా, 21 సంవత్సరాల మెచ్యూరిటీ వరకు వడ్డీ ప్రయోజనం లభిస్తుంది. చిన్న పొదుపు పథకాలలో ప్రస్తుతం అత్యధిక వడ్డీని అందిస్తున్న పథకాలలో సుకన్య సమృద్ధి యోజన ఒకటి. ఈ పథకంపై వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ప్రతి త్రైమాసికం సమీక్షిస్తుంది. ప్రస్తుతం జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి వార్షిక వడ్డీ రేటును 8.20 శాతంగా నిర్ణయించింది. ఈ పథకంలో ఒక ఆర్థిక సంవత్సరానికి కనీసం రూ.250 జమ చేయాలి. గరిష్టంగా రూ.1.50 లక్షలు వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ మొత్తాన్ని ఒకేసారి లేదా విడతల వారీగా, అలాగే నెలవారీగా కూడా చెల్లించే అవకాశం ఉంది. అయితే డిపాజిట్లు 15 సంవత్సరాల వరకు మాత్రమే అనుమతిస్తారు. ఖాతా మాత్రం 21 సంవత్సరాలకు మెచ్యూర్ అవుతుంది.
వడ్డీ రూ.50 లక్షలు..
ప్రతి సంవత్సరం గరిష్ట పరిమితి రూ.1.50 లక్షల చొప్పున 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే మొత్తం పెట్టుబడి రూ.22,50 లక్షలు అవుతుంది. ప్రస్తుత 8.20 శాతం వడ్డీ రేటు ప్రకారం 21 సంవత్సరాల మెచ్యూరిటీ సమయానికి మొత్తం రూ.71,82,119 లభిస్తుంది. ఇందులో వడ్డీ ద్వారానే రూ.49,32,119 ఆదాయం వస్తుంది. అంటే దాదాపు రూ.50 లక్షలు వడ్డీ రూపంలోనే పొందే అవకాశం ఉంటుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Venkatesh | ఫ్యామిలీ మ్యాన్‌గా వెంకటేష్ - ఆదర్శకుటుంబం నుంచి చిట్టిబాబు గ్లింప్స్ రిలీజ్
- ●Ramchandar Rao | ఖర్గేను తప్పించి యువ నాయకున్ని ఎన్నుకోండి.. మేం నితిన్ నబిన్‌కు అవకాశం ఇచ్చాం కదా..
- ●NEET Aspirant Dies | ఆగని నీట్ విద్యార్థుల ఆత్మహత్యలు.. మరో యువతి బలవన్మరణం
- ●Bhumi Pednekar | ఛత్రపతి శివాజీని ఓడించిన రాణి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ - రిషబ్ శెట్టి పాన్ ఇండియన్ మూవీపై అప్డేట్
- ●Dharmendra Pradhan | రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంట్‌కు వెళ్లిన ధర్మేంద్ర ప్రధాన్.. ఎంపీలు ఏం చేశారంటే..?
- ●Anti Paper Leak Bill | లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు.. విపక్ష ఎంపీల ఆందోళన

Venkatesh | ఫ్యామిలీ మ్యాన్‌గా వెంకటేష్ - ఆదర్శకుటుంబం నుంచి చిట్టిబాబు గ్లింప్స్ రిలీజ్

Ramchandar Rao | ఖర్గేను తప్పించి యువ నాయకున్ని ఎన్నుకోండి.. మేం నితిన్ నబిన్‌కు అవకాశం ఇచ్చాం కదా..

NEET Aspirant Dies | ఆగని నీట్ విద్యార్థుల ఆత్మహత్యలు.. మరో యువతి బలవన్మరణం

Bhumi Pednekar | ఛత్రపతి శివాజీని ఓడించిన రాణి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ - రిషబ్ శెట్టి పాన్ ఇండియన్ మూవీపై అప్డేట్






