MP Chamala Kirankumar Reddy | 21 ఏళ్లకే చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి.. ఎంపీ చామల డిమాండ్
MP Chamala Kirankumar Reddy | సింగపూర్, బ్రిటన్ లాంటి దేశాల్లో “జెన్ జీ” కి చట్టసభల్లో ప్రతినిధులు ప్రాధాన్యత ఇస్తున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
MP Chamala Kirankumar Reddy | త్రినేత్ర.న్యూస్ : సింగపూర్, బ్రిటన్ లాంటి దేశాల్లో “జెన్ జీ” కి చట్టసభల్లో ప్రతినిధులు ప్రాధాన్యత ఇస్తున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. భారత్‌లో కూడా 21 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ లోపు ఉన్న యువతకు చట్టసభలో ప్రాతినిధ్యం కల్పిస్తే, వారి సమస్యలపై పూర్తి అవగాహనతో చర్చించి, సమస్యల పరిష్కారం చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ ఆవరణలో ఎంపీ చామల సోమవారం మీడియాతో మాట్లాడారు.
21 ఏళ్లకే చట్టసభల్లోకి యువతకు అవకాశం కల్పించే ఆలోచనను పరిగణనలోకి తీసుకోవాలని, “ఇండియా” కూటమి నేతలకు ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి వివరించనున్నారని తెలిపారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి, తీర్మానం చేసే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని పేర్కొన్నారు.
విద్యార్థులపై జరిగిన అమానుష దాడికి కేంద్ర హోంమంత్రి క్షమాపణలు చెప్పాలని, బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో అంతా అయిపోయిందని కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటే ఉపేక్షించేది లేదన్నారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగాలంటే ప్రభుత్వం భాధ్యతతో వ్యవహరించాలని ఎంపీ చామల సూచించారు.
సంబంధిత వార్తలు

Srinivas Goud | జూరాలకు వరదొస్తోంది.. అయినా నెట్టెంపాడు, భీమాకోయిల్ సాగర్ మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేరు?
జులై 27, 2026

Ramchandar Rao | ఖర్గేను తప్పించి యువ నాయకున్ని ఎన్నుకోండి.. మేం నితిన్ నబిన్‌కు అవకాశం ఇచ్చాం కదా..
జులై 27, 2026

Dharmendra Pradhan | రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంట్‌కు వెళ్లిన ధర్మేంద్ర ప్రధాన్.. ఎంపీలు ఏం చేశారంటే..?
జులై 27, 2026
తాజావార్తలు
- ●Sukanya Samriddhi Yojana | కేవలం వడ్డీ ద్వారానే రూ.50 లక్షలు పొందవచ్చు.. పోస్టాఫీస్‌లో అద్భుతమైన పథకం..
- ●Srinivas Goud | జూరాలకు వరదొస్తోంది.. అయినా నెట్టెంపాడు, భీమాకోయిల్ సాగర్ మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేరు?
- ●Venkatesh | ఫ్యామిలీ మ్యాన్‌గా వెంకటేష్ - ఆదర్శకుటుంబం నుంచి చిట్టిబాబు గ్లింప్స్ రిలీజ్
- ●Ramchandar Rao | ఖర్గేను తప్పించి యువ నాయకున్ని ఎన్నుకోండి.. మేం నితిన్ నబిన్‌కు అవకాశం ఇచ్చాం కదా..
- ●NEET Aspirant Dies | ఆగని నీట్ విద్యార్థుల ఆత్మహత్యలు.. మరో యువతి బలవన్మరణం
- ●Bhumi Pednekar | ఛత్రపతి శివాజీని ఓడించిన రాణి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ - రిషబ్ శెట్టి పాన్ ఇండియన్ మూవీపై అప్డేట్

Sukanya Samriddhi Yojana | కేవలం వడ్డీ ద్వారానే రూ.50 లక్షలు పొందవచ్చు.. పోస్టాఫీస్‌లో అద్భుతమైన పథకం..

Srinivas Goud | జూరాలకు వరదొస్తోంది.. అయినా నెట్టెంపాడు, భీమాకోయిల్ సాగర్ మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేరు?

Venkatesh | ఫ్యామిలీ మ్యాన్‌గా వెంకటేష్ - ఆదర్శకుటుంబం నుంచి చిట్టిబాబు గ్లింప్స్ రిలీజ్

Ramchandar Rao | ఖర్గేను తప్పించి యువ నాయకున్ని ఎన్నుకోండి.. మేం నితిన్ నబిన్‌కు అవకాశం ఇచ్చాం కదా..



