KA Sengottaiyan | ఒకే నియోజకవర్గం.. పది సార్లు ఎమ్మెల్యేగా విజయం
KA Sengottaiyan | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (Tamil Nadu Assembly Elections) దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ ఘటన విజయం సాధించింది. రెండేండ్ల క్రితం ఆవిర్భవించిన ఆ పార్టీ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి సీఎం స్టాలిన్ సహా మహామహులను మట్టికరిపించింది.
KA Sengottaiyan | త్రినేత్ర.న్యూస్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (Tamil Nadu Assembly Elections) దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ ఘటన విజయం సాధించింది. రెండేండ్ల క్రితం ఆవిర్భవించిన ఆ పార్టీ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి సీఎం స్టాలిన్ సహా మహామహులను మట్టికరిపించింది. ఈ క్రమంలో టీవీకే అభ్యర్థి కేకే సెంగొట్టైయన్ (KA Sengottaiyan) ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. ఒకే నియోజకవర్గంలో నుంచి పదోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గోబిచెట్టిపాళ్యం (Gobichettipalayam) నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. 71 వేలకుపైగా ఓట్లు సాధించి తన సమీప డీఎంకే (DMK) అభ్యర్థిపై 13వేల మెజార్టీతో గెలుపొందారు. దాదాపు 50 ఏండ్లపాటు అన్నాడీఎంకేలో ఉన్న సెంగొట్టైయన్ గతేడాది డిసెంబర్‌లోనే టీవీకేలో చేరారు.
23వ ఏట రాజకీయ ప్రవేశం
1975లో తన 23వ ఏట రాజకీయాల్లోకి ప్రవేశించిన సెంగొట్టైయన్.. ఈరోడ్ జిల్లా అన్నాడీఎంకే (AIADMK) కార్యదర్శిగా నియమితులయ్యారు. తొలిసారిగా 1977లో సత్యమంగళం (Sathyamangalam) నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1980లో జరిగిన ఎన్నికల్లో గోబిచెట్టిపాళ్యం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1980 నుంచి 2026 వరకు అదే నియోజకవర్గం ఎమ్మెల్యేగా పదిసార్లు బరిలో నిలిచారు. అయితే 1996లో జరిగిన ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయారు. తాజా గెలుపుతో ఒకే నియోజకవర్గం నుంచి తొమ్మిదిసార్లు విజయం సాధించిన నేతగా నిలిచారు. మొత్తంగా పదిసార్లు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు.
మంత్రిగానూ..
ఎంజీఆర్, జయ లలిత క్యాబినెట్‌లో మంత్రిగానూ పనిచేశారు. ఎడప్పాడి పళనిస్వామి మంత్రివర్గంలో పాఠశాల విద్య, యూత్ వెల్ఫేర్, స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ శాఖల మంత్రిగా పనిచేశారు. 2025లో పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయనపై అన్నాడీఎంకే వేటు వేసింది. దీంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సెంగొట్టైయన్.. టీవీకేలో చేరారు.
సంబంధిత వార్తలు

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

TVK | రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు.. సీపీఎం హెచ్చరికలతో ప్రచారానికి చెక్‌పెట్టిన టీవీకే
మే 20, 2026

Anitha Radhakrishnan | విజయ్ ప్రభుత్వం నాలుగు నెలలకంటే ఎక్కువ రోజులు అధికారంలో ఉండదు.. డీఎంకే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
మే 18, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



