Jharkhand | ఏం కష్టమొచ్చిందో.. ఇద్దరు పిల్లలను బావిలో పడేసి.. తానూ దూకిన తల్లి
Jharkhand | కుటుంబ తగాదాలతో (Domestic Dispute) తన ఇద్దరు పిల్లలను బావిలో (Well) పడేసిన తల్లి.. తానూ ఆత్మహత్యకు (Suicied) యత్నించింది. అయితే ఆ ఇద్దరు పిల్లల నీటిలో మునిగి చనిపోగా, తల్లిని గ్రామస్తులు కాపాడిన ఘటన జార్ఖండ్‌లోని (Jharkhand) పలాము (Palamu) జిల్లాలో జరిగింది.
Jharkhand | త్రినేత్ర.న్యూస్: కుటుంబ తగాదాలతో (Domestic Dispute) తన ఇద్దరు పిల్లలను బావిలో (Well) పడేసిన తల్లి.. తానూ ఆత్మహత్యకు (Suicied) యత్నించింది. అయితే ఆ ఇద్దరు పిల్లల నీటిలో మునిగి చనిపోగా, తల్లిని గ్రామస్తులు కాపాడిన ఘటన జార్ఖండ్‌లోని (Jharkhand) పలాము (Palamu) జిల్లాలో జరిగింది.
పలాము జిల్లాలోని కాండాకు చెందిన సరితా దేవి, ఛోటే లాల్ ప్రజాపతి భార్యాభర్తలు. వారికి ముగ్గురు ఆడపిల్లలు. ఛోటే లాల్ స్థానికంగా కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే బుధవారం రాత్రి భార్యభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అదికాస్తా పెద్దది కావడంతో నానమ్మ ఒడిలో నిద్రిస్తున్న రెండున్నరేండ్ల వయస్సున్న చిన్న కూతురితో సహా తన ముగ్గురు పిల్లలను తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సరితా దేవి.. గ్రామంలోని ఓ బావి వద్దకు చేరుకుంది. మొదట చిన్న కూతురు డాలీని బావిలో విసిరేసింది. తర్వాత నాలుగేండ్ల ప్రియను పడేసింది. అనంతరం ఆరేండ్ల పెద్ద కూతురు సుష్మను కూడా బావిలోకి పడేసేందుకు ప్రయత్నించగా.. ఆ బాలిక ప్రతిఘటించింది. రక్షించాలంటూ గట్టిగా అరిచింది. దీంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న సరిత.. సుష్మను అక్కడే వదిలేసి, తాను బావిలో దూకింది.
అయితే సుష్మ అరుపులు విన్న గ్రామస్తులు.. బావి వద్దకు వచ్చి సుష్మను ప్రాణాలతో కాపాడారు. అయితే అప్పటికే నీటమునిగి ఇద్దరు చిన్న కూతుర్లు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సరితా దేవిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం కోర్టులో హాజరుపరచడంతో న్యాయమూర్తి ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. అయితే ఈ ఘటనకు దారితీసిన అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Residential School | రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో పాము.. నిద్రిస్తున్న నలుగురు బాలికలకు కాటు..
జులై 9, 2026

Living Woman Funeral Jharkhand | బతికుండగానే కూతురికి దహన సంస్కారాలు.. కులాంతర వివాహం చేసుకుందని కన్నవాళ్ల దారుణం
జులై 6, 2026

Road Accident | వ్యాన్‌ను ఢీకొట్టిన బొగ్గులారీ.. బ్యాండ్ బృందంలోని ఏడుగురు మృతి
జూన్ 26, 2026
తాజావార్తలు
- ●Encounter | పోలీసులు, గ్యాంగ్స్టర్ల మధ్య భీకర కాల్పులు.. నలుగురు నేరస్థులు హతం
- ●RTC Bus | పూటుగా తాగి ఆర్టీసీ బస్సుతో ఉడాయించాడు.. 21 కిలోమీటర్ల తర్వాత..
- ●Jio | జియో నుంచి కొత్త ప్యాక్.. రూ.55కే 1000 టీవీ చానల్స్..
- ●PM Modi | చెన్నైలో బిగ్ బాష్ లీగ్ తొలి మ్యాచ్.. ప్రధాని మోదీ కీలక ప్రకటన
- ●Donald Trump | ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర..? పెంటగాన్‌కు సమాచారం ఇచ్చిన ఇజ్రాయెల్
- ●Dell Pro Precision | డెల్ నుంచి కొత్త ప్రొ ప్రెసిషన్ వర్క్‌స్టేషన్ ల్యాప్‌టాప్‌లు.. ఫీచర్లు అదిరిపోయాయి.. ధర ఎంతంటే..

Encounter | పోలీసులు, గ్యాంగ్స్టర్ల మధ్య భీకర కాల్పులు.. నలుగురు నేరస్థులు హతం

RTC Bus | పూటుగా తాగి ఆర్టీసీ బస్సుతో ఉడాయించాడు.. 21 కిలోమీటర్ల తర్వాత..

Jio | జియో నుంచి కొత్త ప్యాక్.. రూ.55కే 1000 టీవీ చానల్స్..

PM Modi | చెన్నైలో బిగ్ బాష్ లీగ్ తొలి మ్యాచ్.. ప్రధాని మోదీ కీలక ప్రకటన



