Jio | జియో నుంచి కొత్త ప్యాక్.. రూ.55కే 1000 టీవీ చానల్స్..
Jio | దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో వినోద ప్రియుల కోసం కొత్త బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.55తో అందుబాటులోకి వచ్చిన ఈ జియోటీవీ ప్రో ప్యాక్ ద్వారా వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లోని జియోటీవీ యాప్ ద్వారా 1వేయికి పైగా లైవ్ టీవీ ఛానెల్స్‌ను వీక్షించవచ్చు.
Technology | Published On Jul 10, 2026, 10.58 am IST
Jio | దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో వినోద ప్రియుల కోసం కొత్త బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.55తో అందుబాటులోకి వచ్చిన ఈ జియోటీవీ ప్రో ప్యాక్ ద్వారా వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లోని జియోటీవీ యాప్ ద్వారా 1వేయికి పైగా లైవ్ టీవీ ఛానెల్స్‌ను వీక్షించవచ్చు. ఈ ప్లాన్ జియో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లిద్దరికీ అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త రూ.55 జియోటీవీ ప్రో ప్యాక్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో 16కు పైగా భాషల్లో ప్రసారమయ్యే 1వేయికి పైగా లైవ్ టీవీ ఛానెల్స్ అందుబాటులో ఉంటాయని జియో తెలిపింది. ఈ ప్లాన్‌ను జియో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రీఛార్జ్ ఛానెల్స్ ద్వారా పొందవచ్చు.
150కి పైగా ప్రీమియం చానెల్స్..
ఈ ప్లాన్‌లో 150కి పైగా ప్రీమియం ఛానెల్స్‌కు యాక్సెస్ లభిస్తుంది. స్టార్‌ప్లస్ హెచ్‌డీ, కలర్స్ హెచ్‌డీ, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ హెచ్‌డీ, డిస్కవరీ, యానిమల్ ప్లానెట్ వంటి ప్రముఖ ఛానెల్స్ ఇందులో ఉన్నాయి. అలాగే జియోస్టార్, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్, సన్ టీవీ నెట్‌వర్క్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, ఈటీవీ వంటి బ్రాడ్‌కాస్టర్లకు చెందిన అనేక ఛానెల్స్ కూడా ఈ ప్యాక్‌లో భాగంగా ఉంటాయి. అయితే ఈ ప్లాన్‌లో ఒక ముఖ్యమైన పరిమితి ఉంది. జియోస్టార్, సోనీలకు చెందిన లైవ్ స్పోర్ట్స్ ఛానెల్స్ ఈ ప్యాక్‌లో అందుబాటులో ఉండవు. కాబట్టి క్రికెట్ లేదా ఇతర ప్రత్యక్ష క్రీడా ప్రసారాలను వీక్షించాలనుకునే వారికి ఈ ప్లాన్ సరిపోదు. ఈ ప్లాన్‌కు ప్రత్యేకంగా యాక్టివేషన్ చేయాల్సిన అవసరం లేదు. రూ.55తో రీఛార్జ్ చేసిన తర్వాత జియోటీవీ యాప్‌ను ఓపెన్ చేసి, జియో మొబైల్ నంబర్‌తో సైన్ ఇన్ చేస్తే వెంటనే ప్రీమియం ఛానెల్స్‌ను స్ట్రీమ్ చేయవచ్చు.
ఇతర ప్రయోజనాలు ఉంటాయా..
ఈ ప్లాన్‌లో వాయిస్ కాల్స్, మొబైల్ డేటా లేదా ఎస్‌ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. దీన్ని పూర్తిగా టీవీ వినోద సేవల కోసం మాత్రమే రూపొందించారు. ఒకేసారి ఒక మొబైల్ డివైస్‌లో మాత్రమే జియోటీవీ యాప్ ద్వారా ఈ సబ్‌స్క్రిప్షన్‌ను ఉపయోగించవచ్చు. అలాగే వినియోగదారులు ఈ ప్యాక్‌ను ఒకటి కంటే ఎక్కువసార్లు ముందుగానే రీఛార్జ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఉన్న 30 రోజుల వ్యాలిడిటీ ముగిసిన తర్వాత తదుపరి సబ్‌స్క్రిప్షన్ ఆటోమేటిక్‌గా అమల్లోకి వస్తుందని జియో వెల్లడించింది.
తాజావార్తలు
- ●Smart Television | LED, QLED, OLED టీవీలు.. ఏది బెస్ట్? తేడాలు తెలుసుకుంటే సరైన ఎంపిక సులభం..
- ●Planetary Events | స్కైవాచర్లకు గుడ్‌న్యూస్.. ఈ నెలలో కనువిందు చేయనున్న వింతలు ఇవే..!
- ●Kishan Reddy | ప్రత్యేక వెసులుబాటుతో తాడిచర్ల-2 గనిని సింగరేణికి కేటాయించాం: కిషన్‌రెడ్డి
- ●Dharma Mahesh | నటుడు ధర్మ మహేశ్ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం..
- ●CM Vijay | సీఎం విజయ్‌కి భారీ ఊరట.. కరూర్ బాధిత కుటుంబాలకు ఉద్యోగాలిచ్చేందుకు మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- ●SBI Funds Management IPO | ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓ.. షేర్ ధర రూ.574, రిటైల్ పెట్టుబడిదారులు ఎంత పెట్టాలి?

Smart Television | LED, QLED, OLED టీవీలు.. ఏది బెస్ట్? తేడాలు తెలుసుకుంటే సరైన ఎంపిక సులభం..

Planetary Events | స్కైవాచర్లకు గుడ్‌న్యూస్.. ఈ నెలలో కనువిందు చేయనున్న వింతలు ఇవే..!

Kishan Reddy | ప్రత్యేక వెసులుబాటుతో తాడిచర్ల-2 గనిని సింగరేణికి కేటాయించాం: కిషన్‌రెడ్డి

Dharma Mahesh | నటుడు ధర్మ మహేశ్ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం..






