Road Accident | వ్యాన్‌ను ఢీకొట్టిన బొగ్గులారీ.. బ్యాండ్ బృందంలోని ఏడుగురు మృతి
Road Accident | వారంతా ఓ బ్యాండు మేళంలో సభ్యులు. ఓ వేడుకలో పాల్గొని ఆహుతులను ఉత్తేజపరిచారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరుగు పయణమయ్యారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన బోగ్గు లారి వారికి మృత్యుశకటమైంది.
Road Accident | త్రినేత్ర.న్యూస్: వారంతా ఓ బ్యాండు మేళంలో సభ్యులు. ఓ వేడుకలో పాల్గొని ఆహుతులను ఉత్తేజపరిచారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరుగు పయణమయ్యారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన బోగ్గు లారి వారికి మృత్యుశకటమైంది. అప్పటివరకు తమ కళతో ఆహుతులను ఉత్తేజపరిచిన వారిని లారీ బలితీసుకుంది. ఈ విషాద ఘటన (Road Accident) జార్ఖండ్‌లోని (Jharkhand) రామ్‌గఢ్ జిల్లాలో గురువారం అర్ధరాత్రి జరగింది.

రామ్‌గఢ్ జిల్లాలోని బల్సగరా ప్రాంతానికి చెందిన ఇద్దరు, మారంగ్‌మర్చా గ్రామానికి చెందిన బ్యాండ్, తాషా బృందానికి చెందిన ఐగుగురు సభ్యులు ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వ్యానులో వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మొత్తం అంతా ఒకే వాహనంలో తిరిగి బల్సగరా వైపు బయలుదేరారు. ఈ క్రమంలో రామ్‌గఢ్ఇ-బొకారో జాతీయ రహదారిపై (NH 23) బర్లౌంగ్ సమీపంలో రామ్‌గఢ్ వైపు నుంచి వేగంగా వస్తున్న బొగ్గు లారీ మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ఎదురుగా వచ్చిన వ్యానును ఢీకొట్టింది. దీంతో వ్యాను పూర్తిగా ధ్వంసమైంది. వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరొకరిని పోలీసులు రాంచీలోని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
VIDEO | Jharkhand: Seven people were killed and one person was seriously injured in a collision between a coal-laden truck and a vehicle on the Ramgarh–Bokaro main road (NH-23) near Budh Bazaar in Lari-Barlong under Rajrappa police station area of Ramgarh district, on Thursday… pic.twitter.com/95QJz3WS1P
— Press Trust of India (@PTI_News) June 26, 2026
తాజావార్తలు
- ●Moringa Cultivation | టీచర్ జాబ్‌ను వదిలేసి.. మునగ సాగు వైపు అడుగులు.. రెండేండ్లలోనే రూ. 2 కోట్ల టర్నోవర్..
- ●Ecuador vs Germany | ఈక్వెడార్ సంచలనం.. ఫేవరెట్ జర్మనీకి షాక్
- ●Ponnam Prabhakar | బీసీ గురుకుల విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఐఐటీ, ఎన్ఐటీలకు ఎంపికైతే ల్యాప్‌టాప్‌లు: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Netherlands vs Tunisia | నాకౌట్లోకి నెదర్లాండ్స్.. ట్యునీషియాపై 3-1 తేడాతో విక్టరీ
- ●Muharram | మొహర్రం ఊరేగింపులో పేలుడు.. పలువురికి గాయాలు.. వీడియో
- ●Bank Holidays | బ్యాంకులకు నేటి నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు..

Moringa Cultivation | టీచర్ జాబ్‌ను వదిలేసి.. మునగ సాగు వైపు అడుగులు.. రెండేండ్లలోనే రూ. 2 కోట్ల టర్నోవర్..

Ecuador vs Germany | ఈక్వెడార్ సంచలనం.. ఫేవరెట్ జర్మనీకి షాక్

Ponnam Prabhakar | బీసీ గురుకుల విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఐఐటీ, ఎన్ఐటీలకు ఎంపికైతే ల్యాప్‌టాప్‌లు: మంత్రి పొన్నం ప్రభాకర్

Netherlands vs Tunisia | నాకౌట్లోకి నెదర్లాండ్స్.. ట్యునీషియాపై 3-1 తేడాతో విక్టరీ






