త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Living Woman Funeral Jharkhand | బతికుండగానే కూతురికి దహన సంస్కారాలు.. కులాంతర వివాహం చేసుకుందని కన్నవాళ్ల దారుణం

జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. కూతురు ప్రేమ వివాహం చేసుకుందని బతికుండగానే ఆమెకు తల్లిదండ్రులు దహన సంస్కారాలు నిర్వహించారు. అసలేం జరిగిందంటే?

J

National | Published On Jul 6, 2026, 4.20 pm IST

Living Woman Funeral Jharkhand | బతికుండగానే కూతురికి దహన సంస్కారాలు.. కులాంతర వివాహం చేసుకుందని కన్నవాళ్ల దారుణం

సంక్షిప్త సారాంశం

జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలో ఓ యువతి కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా కులాంతర వివాహం (ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్) చేసుకుంది. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన ఆ యువతి.. ఓబీసీకి చెందిన అగ్నివీర్ సైనికుడిని పెళ్లాడింది. పరువు పోయిందని భావించిన యువతి కుటుంబసభ్యులు ఆమె ఫొటోతో పాడె కట్టి.. దహన సంస్కారాలు, పిండ ప్రదానం చేశారు. తాము ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని ఆ యువతి పోలీసులకు స్పష్టం చేసింది. అయితే తమకు బెదిరింపులు వస్తున్నాయని వరుడి కుటుంబం ఆరోపిస్తోంది.

Advertisement

Living Woman Funeral Jharkhand | త్రినేత్ర.న్యూస్ : ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఓ యువతికి బతికుండగానే దహన సంస్కారాలు చేశారు ఆమె కన్నవాళ్లు. జార్ఖండ్‌ (Jharkhand) లోని ఛత్రా జిల్లాలో రీసెంట్‌గా ఈ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. పరువు పేరుతో కన్న కూతురి ఫొటోతో పాడె కట్టి.. అంత్యక్రియలు, పిండ ప్రదానం లాంటి కర్మలు నిర్వహించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

అసలేం జరిగిందంటే..

ఛత్రా జిల్లాలోని గిధౌర్ (Gidhaur) ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువతి బ్రాహ్మణ కుటుంబానికి చెందింది. ఆమె డాంగీ (ఓబీసీ) కమ్యూనిటీకి చెందిన ఓ అగ్నివీర్ (Agniveer) సోల్జర్‌ను ప్రేమించింది. అయితే, పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో.. ఎగ్జామ్స్ రాయడానికని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకుంది. మొదట యువతి కుటుంబ సభ్యులు తమ కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు.

పోలీసులు ఎంక్వైరీ చేయగా.. యువతి, ఆ యువకుడు స్టేషన్‌కు వచ్చారు. తాను మేజర్‌నని.. తన ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నానని యువతి పోలీసులకు క్లారిటీ ఇచ్చింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఎలాంటి ఫోర్స్ చేయలేదని తేల్చి చెప్పింది. తనను బలవంతం చేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని కూడా ఆమె కుటుంబ సభ్యులకు వార్నింగ్ ఇచ్చింది. దీంతో పోలీసులు ఆ కొత్త జంటను పంపించేశారు.

సమాజానికి ముఖం ఎలా చూపించాలి?

తమ కూతురు వేరే కులం వాడిని పెళ్లి చేసుకోవడంతో యువతి తల్లిదండ్రులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. సమాజంలో పరువు పోయిందంటూ.. ఏకంగా ఆమె ఫొటోతో ఒక డమ్మీ శవాన్ని తయారు చేసి అంతిమ యాత్ర (Funeral procession) నిర్వహించారు. శ్మశానవాటికలో 'రామ్ నామ్ సత్య హై' అంటూ నినాదాలు చేస్తూ దహన సంస్కారాలు కంప్లీట్ చేశారు. ఆ తర్వాత శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానం కూడా చేశారు.

"మేము బ్రాహ్మణులం.. సమాజంలో తలెత్తుకుని తిరగాలి కదా.. అందుకే ఇలా చేశాం" అని యువతి తల్లి మీడియాతో అన్నారు. తమ సామాజిక వర్గంలోనే వేరే సంబంధం చూసి, పెళ్లి కోసం ఇప్పటికే రూ.5 లక్షలు ఖర్చు చేశామని ఆమె వాపోయారు.

అబ్బాయి కుటుంబానికి బెదిరింపులు..

మరోవైపు, అబ్బాయి కుటుంబం ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేసింది. "తమ పిల్లలు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు.. వారి నిర్ణయాన్ని మేం గౌరవిస్తున్నాం" అని అబ్బాయి తండ్రి తెలిపారు. అయితే, ఈ పెళ్లి తర్వాత తమకు పరోక్షంగా బెదిరింపులు (Threats) వస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కావాలనే సోషల్ మీడియాలో వీడియోలు సర్క్యులేట్ చేస్తూ తన కొడుకు ఉద్యోగానికి ఎసరు పెడుతున్నారని ఆరోపించారు.

తాము ఎవరితోనూ గొడవ పడదలుచుకోలేదని, ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నామని ఆయన అన్నారు. ఈ ఇష్యూపై గిధౌర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ పురుషోత్తం అగ్నిహోత్రి స్పందిస్తూ.. అబ్బాయి కుటుంబం నుంచి బెదిరింపులకు సంబంధించిన వీడియోలు, ఆధారాలతో కంప్లైంట్ వస్తే కచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement