త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

JEE Main | జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 అడ్మిట్‌ కార్డులు విడుదల.. ఏప్రిల్ 2, 4న ప‌రీక్ష‌

JEE Main | జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 (JEE Main 2026) పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు విడుద‌ల‌య్యాయి. ఈ ప‌రీక్ష‌లు ఏప్రిల్‌ 2, 4 తేదీల్లో జరగనున్న విష‌యం తెలిసిందే.

G

National | Published On Mar 30, 2026, 6.14 am IST

JEE Main | జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 అడ్మిట్‌ కార్డులు విడుదల.. ఏప్రిల్ 2, 4న ప‌రీక్ష‌
Advertisement

JEE Main | త్రినేత్ర‌.న్యూస్‌: జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 (JEE Main 2026) పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు విడుద‌ల‌య్యాయి. ఈ ప‌రీక్ష‌లు ఏప్రిల్‌ 2, 4 తేదీల్లో జరగనున్న విష‌యం తెలిసిందే. వీటికి సంబంధించిన హాల్‌టికెట్ల‌ను jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) అందుబాటులో ఉంచింది. వ‌చ్చే నెల 5, 6, 7, 8 తేదీల్లో నిర్వహించే పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను తర్వాత విడుదల చేయనుంది.

ఇక పేపర్‌ 1 పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. మొదటి షిఫ్టు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప‌రీక్ష ఉంటుంది. పేప‌ర్ 1ను బీఈ, బీటెక్‌లో ప్ర‌వేశాల కోసం, పేప‌ర్ 2ను బీఆర్క్ లేదా బీప్లానింగ్ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హిస్తారు.

హాల్‌టికెట్‌ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..

జేఈఈ మెయిన్ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inను సందర్శించాలి.
సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డు లింక్‌పై క్లిక్ చేయాలి.
క్యాండిడేట్‌ లాగిన్‌ పేజీ ఓపెన్‌ చేయాలి.
మీ అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయాలి.
లాగిన్‌ వివరాలతో సబ్‌మిట్‌ చేస్తే మీ అడ్మిట్‌ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
పీడీఎఫ్‌ రూపంలో డౌన్‌లోడ్‌ అయ్యే ఆ ఫైల్‌ని సేవ్‌ చేసుకోండి.

Advertisement

తాజావార్తలు

Advertisement