త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

JEE Advanced | మే 17న జేఈఈ అడ్వాన్స్‌డ్.. ఏప్రిల్ 23 నుంచి ద‌ర‌ఖాస్తులు..

JEE Advanced | దేశంలో ప్ర‌తిష్ఠాత్మ‌క విద్యా సంస్థ‌లైన ఐఐటీలు, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced) షెడ్యూల్ విడుద‌లైంది. మే 17న రెండు సెష‌న్ల‌లో ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

G

National | Published On Mar 9, 2026, 9.01 am IST

JEE Advanced | మే 17న జేఈఈ అడ్వాన్స్‌డ్.. ఏప్రిల్ 23 నుంచి ద‌ర‌ఖాస్తులు..
Advertisement

JEE Advanced | త్రినేత్ర‌.న్యూస్‌: దేశంలో ప్ర‌తిష్ఠాత్మ‌క విద్యా సంస్థ‌లైన ఐఐటీలు, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced) షెడ్యూల్ విడుద‌లైంది. మే 17న రెండు సెష‌న్ల‌లో ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు పేప‌ర్ 1, మ‌ధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంట‌ల వ‌ర‌కు పేప‌ర్ 2 ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. అభ్య‌ర్థులు రెండు పేప‌ర్లు త‌ప్ప‌నిస‌రిగా రాయాల్సి ఉంటుంది. ఒక‌టి రాయ‌క‌పోయిన మ‌రో పేప‌ర్‌ను మెరిట్ లిస్ట్ కోసం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు. ఈ మేర‌కు ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌నున్న ఐఐటీ రూర్కీ (IIT Roorkee) వెల్ల‌డించింది.

అడ్వాన్స్‌డ్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానుంది. మే 2న ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ముగియ‌నున్నాయి. విదేశీ విద్యార్థుల‌కు ద‌ర‌ఖాస్తులు కాస్త ముందుగానే అంటే ఏర్పిల్ 6నే ప్రారంభ‌మ‌వుతాయి. ద‌ర‌ఖాస్తుల కోసం అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in.ను సంప్ర‌దించ‌వ‌చ్చు. మే 11న అడ్మిట్ కార్డుల‌ను విడుద‌ల చేస్తారు. మే 17 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయి. కాగా, జేఈఈ మెయిన్ పేప‌ర్ 1లో అర్హ‌త సాధించిన 2.5 ల‌క్షల మంది మాత్ర‌మే అడ్వాన్స్‌డ్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హులు.

మే 21న రెస్పాన్స్ షీట్‌, అదేనెల 25న‌ ప్రాథమిక ఆన్స‌ర్ కీని విడుద‌ల చేస్తారు. జూన్ 1న తుది ఆన్స‌ర్ కీ, ఫ‌లితాల‌ను ప్ర‌క‌టిస్తారు. జూన్ 2న‌ ఉద‌యం 10 గంట‌ల నుంచి జోసా కౌన్సెలింగ్ ప్ర‌క్రియ‌క ప్రారంభ‌మ‌వుతుంది.

Advertisement
Advertisement