Dasoju Sravan | ఇంటర్మీడియట్ రద్దు ఎవరి కోసం?
Dasoju Sravan | ఇంటర్మీడియట్ (Intermediate Education) రద్దు ఎవరి కోసం చేస్తున్నారని.. దానివల్ల లబ్ధి కలిగేది నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ సంస్థలకేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) విమర్శించారు.
- 10 లక్షల మంది విద్యార్థులు, 1,750 జూనియర్ కళాశాలల భవిష్యత్తును ఒక్క గదిలో తేల్చేశారు
- ఇంటర్ తీసేస్తే లబ్ధి కలిగేది నారాయణ, శ్రీ చైతన్య వంటి సంస్థలకే
- నవంబర్ 11 ఆదేశాన్ని తక్షణమే నిలిపివేయాలి
- సీఎం రేవంత్‌కు దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Dasoju Sravan | త్రినేత్ర న్యూస్: ఇంటర్మీడియట్ (Intermediate Education) రద్దు ఎవరి కోసం చేస్తున్నారని.. దానివల్ల లబ్ధి కలిగేది నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ సంస్థలకేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) విమర్శించారు. మంత్రివర్గ నిర్ణయం లేకుండా 10 లక్షల మంది విద్యార్థులు, 1750 జూనియర్ కళాశాలల భవిష్యత్తును ఒక్క గదిలో తేల్చేశారని మండిపడ్డారు. ఈ నిర్ణయం తెలంగాణ బిడ్డల కోసం కాదని.. రేవంత్ కుటుంబ వ్యాపారం కోసమేనని ఆరోపించారు. ఈమేరకు శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ (Open Letter) రాశారు.
మంత్రివర్గ నిర్ణయం లేదు, బిల్లు లేదు
మంత్రివర్గ నిర్ణయం లేదు, బిల్లు లేదు, చర్చ లేదు. ఒక్క సమీక్షా సమావేశంతో ఇంటర్ విద్యను రద్దు అప్రజాస్వామికం. ఇది తుగ్లక్ నిర్ణయం, నియంతృత్వ పాలన. ఇంటర్ రద్దుతో అసలు లబ్ధిదారులు నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ సంస్థలే. 1 నుంచి 12వ తరగతి వరకు ప్రతి విద్యార్థి కార్పొరేట్ క్యాంపస్‌లలోనే బంధీ అవుతాడు. ఇంటర్ మాత్రమే నడిపే ప్రైవేట్ కాలేజీలు మూతపడే ప్రమాదం ఉంది. సీఎం కుటుంబ సభ్యులే కొత్తగా పాఠశాలలు స్థాపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఐఐటీ వారసత్వానికే ఎసరు
దేశ జనాభాలో 3 శాతం కూడా లేని తెలంగాణ, జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 అర్హుల్లో 9.6 శాతం వాటాతో దేశంలో మూడో స్థానంలో నిలిచిందని, జేఈఈ మెయిన్ 100 పర్సంటైల్ జాబితాలో వరుసగా మూడేళ్లు అగ్రస్థానంలో ఉందని శ్రవణ్ గుర్తు చేశారు. ఈ విజయాలకు పునాది మన ఇంటర్మీడియట్ వ్యవస్థేనని, దాన్ని కూల్చితే తెలంగాణ బిడ్డలు గెలుచుకుంటున్న ఐఐటీ, ఎన్‌ఐటీ సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఎగరేసుకుపోతారని ఆయన హెచ్చరించారు. "ఐదు దశాబ్దాలుగా నిర్మించుకున్న ప్రతిభావారసత్వాన్ని ఒక్క సమీక్షా సమావేశంలో విసిరిపారేస్తున్నారు" అని దుయ్యబట్టారు.
గత మే 10న ఇచ్చిన మూడు హామీల్లో ఒక్కటీ అమలు కాలేదు. విద్యా కమిషన్ నివేదిక ఇప్పటికీ సభలో పెట్టలేదు. ఖర్చులేని రద్దు సిఫారసు మాత్రమే ఎంచుకున్నారు. జూనియర్ కాలేజీ ప్రవేశాలు 14% పెరిగి 85,453కు చేరుకుంది. ఇంటర్ కుప్పకూలలేదు, విస్తరిస్తోంది.
విద్యకు 15% బడ్జెట్ హామీ ఇచ్చారు. ఇచ్చింది మాత్రం 8.23 శాతమే. 2026-27 ఒక్క ఏడాదిలోనే విద్యా బడ్జెట్ లోటు రూ. 21,961 కోట్లు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 97% ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 19,017 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 2024 తర్వాత డీఎస్సీ వేయలేదు. యూనివర్సిటీలకు రూ. 500 కోట్లు కేటాయించి, ఇచ్చింది రూ.5 కోట్లే. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 8,591 కోట్లు ఉన్నాయి. కాలేజీల లెక్కన రూ. 10,000 కోట్లు ఉన్నయ్. ఒక్క ఏడాదిలో 1,441 ప్రభుత్వ పాఠశాలలకు తాళాలు వేశారు. గురుకుల టెండర్లలో రూ. 4,000 కోట్లకు పైగా అక్రమాల ఆరోపణలు ఉన్నాయి.
ఆరు నెలల్లోనే మాట తప్పిన సీఎం
మే 10న ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్‌ను హఠాత్తుగా ఉపసంహరించుకున్నప్పుడు సీఎం మూడు హామీలు ఇచ్చారని శ్రవణ్ గుర్తు చేశారు. అన్ని పక్షాలతో సంప్రదింపులు, విద్యా విధాన కమిటీ అధ్యయనం, తుది నిర్ణయానికి ముందు శాసనసభలో చర్చ. ఆరు నెలలు గడిచినా వీటిలో ఒక్కటీ జరగలేదని, విద్యా కమిషన్ నివేదికను సభలో పెట్టకుండానే అందులోని ఒక్క రూపాయి ఖర్చు లేని రద్దు సిఫారసును మాత్రమే ఎంచుకున్నారని ఆయన విమర్శించారు. ప్రతి మండలంలో పబ్లిక్ స్కూళ్లు, 11, 12 తరగతులకు మధ్యాహ్న భోజనం, ఫీజుల నియంత్రణ చట్టం వంటి నిధులు అవసరమైన సిఫారసులను పక్కన పడేశారని ఆరోపించారు.
బడ్జెట్లో మోసం, బడులకు తాళాలు
విద్యకు 15 శాతం బడ్జెట్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ 2026-27లో ఇచ్చింది 8.23 శాతం మాత్రమేనని, ఒక్క ఈ ఏడాదిలోనే లోటు రూ. 21,961 కోట్లని శ్రవణ్ లెక్కలతో సహా వివరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 97 శాతం ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, పాఠశాలల్లో 19,017 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 18 కొత్త జూనియర్ కళాశాలలు ఒక్క మంజూరైన పోస్టు కూడా లేకుండానే మొదలయ్యాయని ఆయన వెల్లడించారు. 2025-26లోనే 1,441 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని, విశ్వవిద్యాలయాలకు రూ. 500 కోట్లు కేటాయించి రూ. 5 కోట్లే విడుదల చేశారని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 10,000 కోట్లు దాటాయని, గురుకుల టెండర్లలో రూ. 4,000 కోట్లకు పైగా అక్రమాల ఆరోపణలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. "పిచ్చోడి చేతిలో రాయిలా అనాలోచిత నిర్ణయాలు కొనసాగితే తెలంగాణ విద్యా వ్యవస్థ సర్వనాశనమవుతుంది" అని హెచ్చరించారు.
వారిని సెకండరీ విద్యార్థులుగా మార్చిన ప్రకటన ఇదే
ఢిల్లీలో ఎన్ఈపీని బుల్డోజర్ అంటారు, హైదరాబాద్‌లో అదే బుల్డోజర్ నడుపుతారు. కర్ణాటక, తమిళనాడు ఎన్ఈపీని తిరస్కరిస్తే, తెలంగాణలో ఆదేశంతో రుద్దుతున్నారు. 5వ తరగతి పిల్లలను "సెకండరీ" విద్యార్థులుగా మార్చిన ఏకైక ప్రకటన ఇదే.
1971 ఇంటర్ విద్యా చట్టాన్ని ఆదేశంతో రద్దు చేయడం రాజ్యాంగ వ్యతిరేకం. ఆ అధికారం శాసనసభదే. కేంద్ర నిధుల షరతులకు తలొగ్గి ఐదు దశాబ్దాల విద్యా వారసత్వాన్ని బలి ఇవ్వొద్దు అని దాసోజు లేఖలో పేర్కొన్నారు.
"సంస్కరణ నెపంతో బలవంతంగా రుద్దే అనాలోచిత, స్వార్థపూరిత విధానాలపై ప్రతిఘటన తప్పదు. ఇంటర్మీడియట్ విద్య భవిష్యత్తును నిర్ణయించాల్సింది తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న శాసనసభ.. స్వార్థంతో మీరు, మీ చుట్టూ ఉన్న డూడూ బసవన్నల్లాంటి అధికారులు కాదు" అని డా. దాసోజు శ్రవణ్ సీఎం రేవంత్ రెడ్డికి ఘాటుగా హెచ్చరిక చేశారు.
ఇవీ డిమాండ్స్
- నవంబర్ 11 ఆదేశాన్ని తక్షణమే నిలిపివేయాలి
- సీఎం కుటుంబానికి వాటా ఉన్న విద్యాసంస్థల వివరాలు బహిర్గతం చేయాలి
- ఇంటర్ విద్యపై శ్వేతపత్రం విడుదల చేయాలి
- ఉభయ సభల్లో చర్చ జరపాలి, ఆర్డినెన్స్ వద్దు
- స్వతంత్ర నిపుణుల కమిటీ వేయాలి
- ఇంటర్ భవిష్యత్తును నిర్ణయించాల్సింది శాసనసభ. సీఎం, ఆయన చుట్టూ ఉన్న అధికారులు కాదు
- ఇంటర్ బోధన, బోధనేతర సిబ్బంది సీనియారిటీ, పదోన్నతులకు లిఖితపూర్వక రక్షణ కల్పించాలి, ఖాళీలన్నీ భర్తీ చేసి, కొత్త డీఎస్సీ ప్రకటించాలి
- గురుకుల టెండర్లపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించి, జీవో 17ను రద్దు చేయాలి
- విద్యా కమిషన్ సిఫారసు చేసిన ఫీజుల నియంత్రణ చట్టాన్ని తక్షణమే తీసుకురావాలి, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలన్నీ చెల్లించాలి
సంబంధిత వార్తలు

Harish Rao | కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. కేంద్ర ప్రభుత్వ వివక్షతో రాష్ట్రానికి తీరని అన్యాయం: హరీశ్ రావు
నవంబర్ 14, 2026

Deeksha Divas Meeting | ‘కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో’ నినాదం మరోసారి స్ఫూర్తి కావాలి
నవంబర్ 14, 2026

Harish Rao | పాలిటెక్నిక్ విద్యార్థుల అవిశ్రాంత పోరాటానికి లభించిన విజయం ఇది
నవంబర్ 14, 2026
తాజావార్తలు
- ●Harish Rao | కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. కేంద్ర ప్రభుత్వ వివక్షతో రాష్ట్రానికి తీరని అన్యాయం: హరీశ్ రావు
- ●Thammidikunta Lake | తమ్మిడికుంట చెరువులో చిల్డ్రన్స్ డే వేడుకలు.. ఆటపాటలతో పిల్లలు ఎంజాయ్
- ●Deeksha Divas Meeting | ‘కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో’ నినాదం మరోసారి స్ఫూర్తి కావాలి
- ●Quiz Competition | కౌన్ బనేగా తరహాలో యువతకు క్విజ్ పోటీ.. విజేతకు రూ.కోటి బహుమతి
- ●Harish Rao | పాలిటెక్నిక్ విద్యార్థుల అవిశ్రాంత పోరాటానికి లభించిన విజయం ఇది
- ●Cyclone | మరో తుపాను ముప్పు..! హెచ్చరించిన వాతావరణశాఖ

Harish Rao | కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. కేంద్ర ప్రభుత్వ వివక్షతో రాష్ట్రానికి తీరని అన్యాయం: హరీశ్ రావు

Thammidikunta Lake | తమ్మిడికుంట చెరువులో చిల్డ్రన్స్ డే వేడుకలు.. ఆటపాటలతో పిల్లలు ఎంజాయ్

Deeksha Divas Meeting | ‘కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో’ నినాదం మరోసారి స్ఫూర్తి కావాలి

Quiz Competition | కౌన్ బనేగా తరహాలో యువతకు క్విజ్ పోటీ.. విజేతకు రూ.కోటి బహుమతి



