JEE Advance | మే 23న జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్.. అర్హతలు ఇవే..!
JEE Advance | దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్–2027 పరీక్ష తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది మే 23న పరీక్ష నిర్వహించనున్నట్లు ఐఐటీ ఢిల్లీ శుక్రవారం ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ jee.adv.ac.inను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
JEE Advance | దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్–2027 పరీక్ష తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది మే 23న పరీక్ష నిర్వహించనున్నట్లు ఐఐటీ ఢిల్లీ శుక్రవారం ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ jee.adv.ac.inను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అర్హత నిబంధనలు, ఇతర వివరాలను వెల్లడించింది. జేఈఈ మెయిన్–2027 బీఈ/బీటెక్ పేపర్‌లో ఉత్తీర్ణులైన టాప్ 2,50,000 మంది అభ్యర్థులు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులు. వీరిలో ఓపెన్ కేటగిరీకి 40.5 శాతం, ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం, ఓబీసీ–ఎన్‌సీఎల్‌కు 27 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం చొప్పున కేటాయిస్తారు. ప్రతి కేటగిరీలో దివ్యాంగులకు 5 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ ఉంటుంది. సమాన ర్యాంకులు వచ్చిన సందర్భాల్లో అర్హుల సంఖ్య 2.5 లక్షలు దాటే అవకాశం ఉంది.
వయోపరిమితి.. రెండుసార్లే అవకాశం
అభ్యర్థులు 2002 అక్టోబర్ 1న, ఆ తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఐదేళ్ల వయో సడలింపు ఉంటుంది. వీరు 1997 అక్టోబరు 1న ఆ తర్వాత జన్మించి ఉండాలి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను వరుసగా రెండేళ్లలో గరిష్టంగా రెండుసార్లు మాత్రమే రాసేందుకు అవకాశం ఉంటుంది. 2026, 2027లో తొలిసారిగా ఇంటర్మీడియట్ లేదంటే తత్సమాన పరీక్షలు రాసినవారు మాత్రమే అర్హులు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ తప్పనిసరి సబ్జెక్టులుగా చదివి ఉండాలి. 2025, అంతకుముందు తొలిసారి ఇంటర్ పరీక్షలు రాసినవారు అర్హులు కాదు. అయితే 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి బోర్డు ఫలితాలను 2025 జూన్ 12, ఆ తర్వాత ప్రకటించిన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం మినహాయింపు ఉంటుంది.
గతంలో ఐఐటీలో చేరినవారికి నిబంధనలు
జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) నిబంధనల ప్రకారం గతంలో ఐఐటీలో ప్రవేశం పొందినవారు సాధారణంగా మళ్లీ జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి అర్హత ఉండదు. అయితే 2026లో తొలిసారిగా ఐఐటీ ప్రిపరేటరీ కోర్సులో చేరినవారికి అవకాశం ఉంటుంది. జోసా–2026 కౌన్సెలింగ్‌లో సీటు పొందినా తుది విడతకు ముందే రిపోర్ట్ చేయని, సీటును వెనక్కి తీసుకున్న లేదా రద్దయిన అభ్యర్థులు ఇతర అర్హతలు కలిగి ఉంటే పరీక్ష రాయొచ్చు. విదేశీ పౌరులు, నిర్దిష్ట అర్హతలు కలిగిన ఓసీఐ, పీఐఓ అభ్యర్థులు జేఈఈ మెయిన్ రాయకుండానే నేరుగా జేఈఈ అడ్వాన్స్‌డ్–2027కు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరిని జేఈఈ మెయిన్ ద్వారా ఎంపికయ్యే 2.5 లక్షల మంది అభ్యర్థుల నుంచి వేరుగా పరిగణిస్తారు. ప్రతి ఐఐటీలో ఒక్కో కోర్సుకు మొత్తం సీట్లలో గరిష్టంగా 10 శాతం వరకు సూపర్‌న్యూమరరీ సీట్లు కేటాయిస్తారు. వీరికి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ–ఎన్‌సీఎల్, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వర్తించవు. వయోపరిమితి, పరీక్షల సంఖ్య, ఇంటర్ అర్హత, గత ఐఐటీ ప్రవేశాలకు సంబంధించిన నిబంధనలు వీరికీ వర్తిస్తాయి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://jeeadv.ac.in/ ను సందర్శించాలని ఐఐటీ ఢిల్లీ సూచించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Rahul Gandhi | గిగ్ వర్కర్లకు పెన్షన్ ఇస్తాం.. ఇక మీ ఫోన్లోనే మీ డేటా ఉంటది
- ●Revanth Reddy | గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల జీవిత బీమా.. గుర్తింపు కార్డులిచ్చి ఆదుకుంటాం: సీఎం రేవంత్
- ●Sheikh Hasina | హసీనా స్వదేశానికి వెళ్లేందుకు భారత్ ఓకే.. బంగ్లా ప్రభుత్వానికి కొన్ని షరతులు
- ●Vakiti Srihari | వైభవంగా కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు.. పట్టు వస్త్రాలు, ఆభరణాలు సమర్పించిన మంత్రి వాటికి శ్రీహరి
- ●Gold Price | బంగారం కొనడానికి ఇదే సరైన సమయమా? కీలక సపోర్ట్ వద్ద ధర.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
- ●Dhanashree Verma | టాలీవుడ్లోకి క్రికెటర్ చాహల్ మాజీ భార్య ఎంట్రీ - విడాకుల తర్వాత హీరోయిన్గా కెమెరా ముందుకు!

Rahul Gandhi | గిగ్ వర్కర్లకు పెన్షన్ ఇస్తాం.. ఇక మీ ఫోన్లోనే మీ డేటా ఉంటది

Revanth Reddy | గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల జీవిత బీమా.. గుర్తింపు కార్డులిచ్చి ఆదుకుంటాం: సీఎం రేవంత్

Sheikh Hasina | హసీనా స్వదేశానికి వెళ్లేందుకు భారత్ ఓకే.. బంగ్లా ప్రభుత్వానికి కొన్ని షరతులు

Vakiti Srihari | వైభవంగా కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు.. పట్టు వస్త్రాలు, ఆభరణాలు సమర్పించిన మంత్రి వాటికి శ్రీహరి






