త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold Price | బంగారం కొనడానికి ఇదే సరైన సమయమా? కీలక సపోర్ట్ వద్ద ధర.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Gold Price | బంగారం ధరలు గరిష్ఠ స్థాయిల నుంచి గణనీయంగా తగ్గి కీలక సపోర్ట్ జోన్‌కు చేరువయ్యాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక పెట్టుబడిదారులు విడతలవారీగా కొనుగోళ్లు ప్రారంభించవచ్చని మార్కెట్ విశ్లేషణ సూచిస్తోంది. అయితే అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ఒకేసారి భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడం కంటే ఆచితూచి వ్యవహరించడం మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు.

S

Business | Published On Nov 14, 2026, 12.28 pm IST

Gold Price | బంగారం కొనడానికి ఇదే సరైన సమయమా? కీలక సపోర్ట్ వద్ద ధర.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
Advertisement

Gold Price | బంగారం ధరలు గరిష్ఠ స్థాయిల నుంచి గణనీయంగా తగ్గి కీలక సపోర్ట్ జోన్‌కు చేరువయ్యాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక పెట్టుబడిదారులు విడతలవారీగా కొనుగోళ్లు ప్రారంభించవచ్చని మార్కెట్ విశ్లేషణ సూచిస్తోంది. అయితే అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ఒకేసారి భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడం కంటే ఆచితూచి వ్యవహరించడం మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు.

మార్కెట్ విశ్లేష‌ణ ఎలా ఉంది..?

మార్కెట్ విశ్లేషణ ప్రకారం.. ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ వారపు చార్ట్‌ను పరిశీలిస్తే, బంగారం ధరలు గతంలో నమోదైన గరిష్ఠ స్థాయి రూ.1,80,779 నుంచి గణనీయంగా దిగివచ్చాయి. ప్రస్తుతం రూ.1,36,750 స్థాయి వద్ద ట్రేడవుతున్నట్లు చార్ట్‌లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రూ.1.30 లక్షల నుంచి రూ.1.35 లక్షల మధ్య ప్రాంతాన్ని కీలక సపోర్ట్ జోన్‌గా విశ్లేషకులు గుర్తించారు. ఈ స్థాయిలో కొనుగోలుదారుల మద్దతు లభిస్తే ధరలు తిరిగి కోలుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ సపోర్ట్‌ను కోల్పోతే మరింత కరెక్షన్‌కు అవకాశం ఉందనే అంశాన్ని కూడా విస్మరించకూడదు.

రీసెర్చ్ అన‌లిస్టు ఏం చెప్పారు..?

సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ దామోదర రావు తన పోస్టులో దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు బంగారంపై ఎస్ఐపీ కొనసాగించవచ్చని సూచించారు. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు మాత్రం మొత్తం డబ్బును ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా విడతలవారీగా ఇన్వెస్ట్ చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు అధికంగా నమోదై, డిసెంబర్‌లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే బంగారం ధరలు రూ.1.30 లక్షల స్థాయికి దిగివచ్చే అవకాశం ఉందని, పరిస్థితులు ప్రతికూలంగా మారితే రూ.1.20 లక్షల వరకు కూడా కరెక్షన్ వ‌స్తుంద‌ని హెచ్చరించారు. ఈ ధరల స్థాయిలు ఆయన అంచనాలు మాత్రమే. మరోవైపు నవంబర్ 13న ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1,36,750 వద్ద ముగిశాయి. ఆ వారంలో ధరలు సుమారు 3.8 శాతం తగ్గాయి. అమెరికాలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, వడ్డీ రేట్ల పెంపు అంచనాలు బంగారంపై ఒత్తిడి పెంచుతున్నాయి.

https://twitter.com/damodara_SEBIRA/status/2121474026531094588

ఇప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ప్రస్తుత పరిస్థితుల్లో దీర్ఘకాలిక పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడులను పూర్తిగా నిలిపివేయాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుత ధరల వద్ద భారీ మొత్తాన్ని ఒకేసారి పెట్టుబడి పెట్టడం కంటే ఎస్ఐపీ లేదా విడతలవారీ కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం సమంజసం. రూ.1.30 లక్షల నుంచి రూ.1.35 లక్షల సపోర్ట్ జోన్‌ను గమనించాలి. ధరలు ఈ స్థాయిలో నిలదొక్కుకుని తిరిగి పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తే పెట్టుబడులను క్రమంగా పెంచుకోవచ్చు. ఒకవేళ సపోర్ట్ కోల్పోతే మరింత తగ్గుదలకు సిద్ధంగా ఉండాలి. ఇప్పటికే బంగారంలో పెట్టుబడులు ఉన్నవారు తమ పోర్ట్‌ఫోలియోలో దాని వాటాను పరిశీలించాలి. మొత్తం పెట్టుబడుల్లో 5 నుంచి 10 శాతం వరకు బంగారానికి కేటాయించడం కొందరు నిపుణులు సూచిస్తున్న సాధారణ మార్గదర్శకం. అయితే సొంత విశ్లేష‌ణ లేదా నిపుణుల స‌ల‌హాతో పెట్టుబ‌డులు పెట్టడం మంచిది. స్టాక్ మార్కెట్లు లేదా బులియ‌న్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టేవారు రిస్క్‌ల‌ను కూడా ముందే అంచ‌నా వేయాలి.

బంగారాన్ని దీర్ఘకాలికంగా కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రస్తుత ధరలు విడతలవారీగా ప్రవేశించేందుకు పరిశీలించదగిన స్థాయిలో ఉన్నాయి. కానీ తక్షణ లాభాల కోసం భారీ పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం కాద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. పెట్టుబడికి ముందు వ్య‌క్తిగ‌త ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

గ‌మ‌నిక‌: ఈ క‌థ‌నం కేవ‌లం అవ‌గాహ‌న‌, స‌మాచారం కోసం మాత్ర‌మే. పెట్టుబ‌డి స‌ల‌హా కాదు.

Advertisement
Advertisement