Vakiti Srihari | వైభవంగా కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు.. పట్టు వస్త్రాలు, ఆభరణాలు సమర్పించిన మంత్రి వాకిటి శ్రీహరి
Vakiti Srihari | తెలంగాణ తిరుపతి, మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురం సమీపంలో సప్తగిరులపై వెలసిన కురుమూర్తి స్వామి (Kurumurthy Temple) ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామి వారి అలంకరణ మహోత్సవ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) పాల్గొన్నారు.
Vakiti Srihari | త్రినేత్ర న్యూస్: తెలంగాణ తిరుపతిగా పేరొందిన, మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురం సమీపంలో సప్తగిరులపై వెలసిన కురుమూర్తి స్వామి (Kurumurthy Temple) ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామి వారి అలంకరణ మహోత్సవ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) పాల్గొన్నారు. అమరచింత మండల కేంద్రం నుంచి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను, ఆత్మకూరులోని ఎస్‌బీఐ నుంచి తీసుకువచ్చిన ఆభరణాలకు ప్రత్యేక పూజ నిర్వహించి ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామివారికి సమర్పించారు.
కురుమూర్తి స్వామి వారి బ్రహ్మోత్సవాలు భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తాయని మంత్రి శ్రీహరి అన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
కాగా, ఉమ్మడి పాలమూరులోనే అత్యంత పురాతమైన ఆలయాల్లో కురుమూర్తి క్షేత్రం ఒకటి. దక్షిణ తెలంగాణలోనే విశేష ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయంలో ప్రతి ఏటా నవంబర్‌లో బ్రహ్మోత్సవాలను (Kurumurthy Swamy Brahmotsavams) అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఉద్దాల మహోత్సవంతో పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. పచ్చికుండలో అన్నం, పచ్చి పులుసునే పరమ నైవేద్యంగా సమర్పిస్తే స్వామివారు కోరిన కోర్కెలు తీరుస్తారని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం.
పచ్చిపులుసుతో స్వామికి నైవేద్యం
పేదల తిరుపతిగా కొలువైన కురుమూర్తి ఆలయం వద్ద మరో ప్రత్యేకత దాసంగాలు. మట్టి కుండలో అన్నం వండి, పచ్చిపులుసుతో స్వామికి నైవేద్యంగా పెడతారు. అనంతరం దాన్ని వారు తినడంతో పాటు భక్తులకూ పంచిపెడతారు. కోరిన కోర్కెలు తీర్చే స్వామి అంటూ మొక్కులు చెల్లించుకుంటారు.
తాజావార్తలు
- ●Manasa Varanasi | శర్వానంద్ సినిమా కోసం తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పిన మిస్ ఇండియా
- ●Sacred Buddha Relics | అరుణాచల్‌కు బుద్ధుడి పవిత్ర అవశేషాలు.. వీటి చరిత్ర తెలుసా?
- ●Cherlapally Jail | ఖైదీలకు వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణ.. చర్లపల్లి జైలులో ఐటీఐ
- ●CM Revanth Reddy | రాహుల్ నాయకత్వంలో దేశాన్ని కాపాడుకుందాం
- ●Harish Rao | కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. కేంద్ర ప్రభుత్వ వివక్షతో రాష్ట్రానికి తీరని అన్యాయం: హరీశ్ రావు
- ●Thammidikunta Lake | తమ్మిడికుంట చెరువులో చిల్డ్రన్స్ డే వేడుకలు.. ఆటపాటలతో పిల్లలు ఎంజాయ్

Manasa Varanasi | శర్వానంద్ సినిమా కోసం తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పిన మిస్ ఇండియా

Sacred Buddha Relics | అరుణాచల్‌కు బుద్ధుడి పవిత్ర అవశేషాలు.. వీటి చరిత్ర తెలుసా?

Cherlapally Jail | ఖైదీలకు వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణ.. చర్లపల్లి జైలులో ఐటీఐ

CM Revanth Reddy | రాహుల్ నాయకత్వంలో దేశాన్ని కాపాడుకుందాం






