Dhanashree Verma | టాలీవుడ్‌లోకి క్రికెటర్ చాహల్ మాజీ భార్య ఎంట్రీ – విడాకుల తర్వాత హీరోయిన్‌గా కెమెరా ముందుకు!
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ గత ఏడాది విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత హీరోయిన్‌గా ధనశ్రీ వర్మ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. హే కన్నమ్మ పేరుతో ట్రయాంగిల్ లవ్‌స్టోరీ చేసింది. దిల్‌రాజు కూతురు నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ శనివారం రిలీజైంది.
Entertainment | Published On Nov 14, 2026, 12.27 pm IST
Dhanashree Verma |టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఓ తెలుగు సినిమా హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది. కొరియోగ్రాఫర్ యశ్ మాస్టర్ హీరోగా హే కన్నమ్మ పేరుతో ట్రయాంగిల్ లవ్ ఎంటర్‌టైనర్ మూవీ తెరకెక్కుతోంది. దిల్‌రాజు కూతురు హన్షిత నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో ధనశ్రీ వర్మ ఓ హీరోయిన్‌గా కనిపించబోతుంది.
హే కన్నమ్మ మూవీ ఫస్ట్ లుక్‌ను శనివారం మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో క్యాప్ ధరించి మోడ్రన్ లుక్‌లో ధనశ్రీ వర్మ కనిపిస్తోంది. హే కన్నమ్మలో ధనశ్రీ వర్మతో పాటు మలయాళ సుందరి కార్తీక మురళీధరన్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. మ్యూజిక్, డ్యాన్స్ ప్రధానంగా సాగే ఈ లవ్‌స్టోరీకి శశికుమార్ ముతలూరి దర్శకత్వం వహిస్తున్నారు.
ఆకాశం దాటి వస్తావా....
హే కన్నమ్మ షూటింగ్ పూర్తయ్యింది. త్వరలో ఈ లవ్‌స్టోరీ రిలీజ్ కాబోతుంది. దిల్‌రాజు ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు సింగర్ కార్తీక్ మ్యూజిక్ అందించారు.
తొలుత ఈ సినిమాకు ఆకాశం దాటి వస్తావా అనే పేరును అనుకున్నారు. తాజాగా టైటిల్ మార్చి కొత్త పేరుతో ఈ సినిమాను రిలీజ్ చేయబోతుండటం ఆసక్తికరంగా మారింది.
కొరియోగ్రాఫర్...
హే కన్నమ్మతోనే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది ధనశ్రీ వర్మ. కొరియోగ్రాఫర్‌గా ఈ బ్యూటీ కెరీర్ ప్రారంభమైంది. బాలీవుడ్ సినిమాలతో పాటు కొన్ని ఇండిపెండెంట్ సాంగ్స్‌కు డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసింది. క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌కు డ్యాన్స్ నేర్పించింది. ఆ టైమ్‌లోనే ఇద్దరి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లిచేసుకున్నారు. మనస్పర్థల కారణంగా గత ఏడాది చాహల్, ధనశ్రీ వర్మ విడిపోయారు. విడాకుల తర్వాత హే కన్నమ్మతో హీరోయిన్‌గా కెమెరా ముందుకు రాబోతుంది.
తొలి సినిమా....
ఢీ షో ద్వారా ఫేమస్ అయిన యశ్ మాస్టర్‌కు హీరోగా ఇదే తొలి సినిమా కావడం గమనార్హం. కొరియోగ్రాఫర్‌గా ప్రతి రోజు పండగే, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? , శ్యామ్ సింగరాయ్‌తో పాటు మరికొన్ని సినిమాలకు పనిచేశాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Dil Raju | టాక్సిక్ సినిమాతో లాభాలు వచ్చాయి – పాన్ ఇండియన్ భ్రమలు వీడాలి – దిల్‌రాజు కామెంట్స్ వైరల్
నవంబర్ 13, 2026

DNK Review | దొంగ నా కొడుకు మూవీ రివ్యూ – కామెడీ తక్కువ …కన్ఫ్యూజన్ ఎక్కువ
నవంబర్ 13, 2026

Rashmika Mandanna | రష్మిక మందన్న మైసా పోస్ట్‌పోన్? – కొత్త రిలీజ్ డేట్ ఇదేనా!
నవంబర్ 12, 2026
తాజావార్తలు
- ●Sheikh Hasina | హసీనా స్వదేశానికి వెళ్లేందుకు భారత్ ఓకే.. బంగ్లా ప్రభుత్వానికి కొన్ని షరతులు
- ●Vakiti Srihari | వైభవంగా కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు.. పట్టు వస్త్రాలు, ఆభరణాలు సమర్పించిన మంత్రి వాటికి శ్రీహరి
- ●Gold Price | బంగారం కొనడానికి ఇదే సరైన సమయమా? కీలక సపోర్ట్ వద్ద ధర.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
- ●MJPTBCWREIS | బీఎస్సీ అగ్రికల్చర్లో 60 స్పాన్సర్డ్ సీట్లు.. ఈ నెల 16న కౌన్సెలింగ్
- ●Supriya Sule | అజిత్ దాదా మరణించిన రోజే విలీన చర్చలకు ఫుల్స్టాప్ పడింది : సుప్రియా సూలే
- ●Nvidia Shares | ఎన్విడియా షేర్లు భారీగా పతనం.. వారంలోనే రూ.47 లక్షల కోట్లు ఆవిరి..

Sheikh Hasina | హసీనా స్వదేశానికి వెళ్లేందుకు భారత్ ఓకే.. బంగ్లా ప్రభుత్వానికి కొన్ని షరతులు

Vakiti Srihari | వైభవంగా కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు.. పట్టు వస్త్రాలు, ఆభరణాలు సమర్పించిన మంత్రి వాటికి శ్రీహరి

Gold Price | బంగారం కొనడానికి ఇదే సరైన సమయమా? కీలక సపోర్ట్ వద్ద ధర.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

MJPTBCWREIS | బీఎస్సీ అగ్రికల్చర్లో 60 స్పాన్సర్డ్ సీట్లు.. ఈ నెల 16న కౌన్సెలింగ్



