Rahul Gandhi | గిగ్ వర్కర్లకు పెన్షన్ ఇస్తాం.. ఇక మీ ఫోన్‌లోనే మీ డేటా ఉంటది
Rahul Gandhi | తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల (Gig workers)కు రూ.5 లక్షల ప్రమాద బీమా, రూ.10 లక్షల ప్రమాద బీమా అందిస్తోందని.. ఇకపై పెన్షన్ (Pension) కూడా ఇస్తామని లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రకటించారు.
- మీకు సామాజిక భద్రత అవసరం
- మీ డేటా ఇప్పటివరకు దేశంలో ఎక్కడా లేదు
- కష్టం మీదే.. కానీ మీ సమాచారం మీ దగ్గర లేదు
- ప్రతి డెలివరీలో వాటా రావాలి, రెస్ట్ ఉండాలి
- ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రెస్ట్ హౌస్‌లూ నిర్మించింది
- గిగ్ వర్కర్ల సభలో రాహుల్ గాంధీ వెల్లడి
Rahul Gandhi | త్రినేత్ర న్యూస్: తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల (Gig workers)కు రూ.5 లక్షల ప్రమాద బీమా, రూ.10 లక్షల ప్రమాద బీమా అందిస్తోందని.. ఇకపై పెన్షన్ (Pension) కూడా ఇస్తామని లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రకటించారు. గిగ్ వర్కర్ల సమాచారం దేశంలో ఎక్కడా లేదని.. ఇకనుంచి మీ ఫోన్‌లోనే మీ డేటా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి డెలివరీలో వాటాతో పాటు వర్కర్లకు రెస్ట్ ఉండాలన్నారు. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం రెస్ట్ హౌస్‌లు నిర్మించిందని తెలిపారు. హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన గిగ్ వర్కర్ల సభలో రాహుల్ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నేడు నెరవేరుస్తున్నామని చెప్పారు.
మీరు ఎలా ఉన్నారంటూ పలకరింపు
మీరు ఎలా ఉన్నారంటూ గిగ్ వర్కర్లను పలుకరించిన రాహుల్ గాంధీ.. గిగ్ వర్కర్ల బాధ, నొప్పి నాకు తెలుసు. గిగ్ వర్కర్ల కష్టం గుర్తించే నేను, మా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తామని నాడు హామీ ఇచ్చాం, వాగ్దానం చేశాం. మేం ఆ వాగ్దానాన్ని నెరవేర్చాం. డెలివరీకి సంబంధించి ఎంత సమయం పడుతుంది.. ఎంత ఇస్తారనే సమాచారం కూడ లేదు. కష్టం మీది.. కానీ మీ సమాచారం మీ దగ్గర లేదు.
ఆ డబ్బు మీ ఖాతాకే
తెలంగాణ ప్రభుత్వం మీ కోసం పని చేస్తోంది. ప్రతి డెలివరీపై మీకు వచ్చే దానిని మీకు తెలియజేస్తోంది. తెలంగాణలో నగరాల్లో ఎండల్లో మీరు మోటార్ సైకిళ్లపై వెళుతుంటారు. మీకు విశ్రాంతి కోసం ఎటువంటి రెస్ట్ హౌజ్‌లు లేవు. ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకునేందుకు హైదరాబాద్‌లో, తెలంగాణలోని ఇతర నగరాల్లో తెలంగాణ ప్రభుత్వం రెస్ట్ హౌజ్‌లు నిర్మించింది. ప్రతి డెలివరీ, ప్రతి రవాణాకు సంబంధించిన 1 శాతం మీ గిగ్ వర్కర్ల ఖాతాలో చేరుతుంది. ఆ డబ్బు గిగ్ వర్కర్ల బోర్డుకు చేరుతుంది. అక్కడి నుంచి మీ ఖాతాకు చేరుతుంది.
దేశంలో రెండు ఆలోచన విధానాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్, బీజేపీ విధానం.. అది కట్టు బానిసత్వాన్ని కోరుతుంది. 24 గంటలు పని చేయాలి. శ్రమను దోచుకునేవి.. మీ శ్రమను అదానీకి, అంబానీకి దోచిపెట్టేవి. రెండోది గిగ్ వర్కర్ దేశానికి పునాది, దేశ భాగస్వామి అని కాంగ్రెస్ ఆలోచన విధానం. గిగ్ వర్కర్‌కు రక్షణ కల్పించాలనేది కాంగ్రెస్ ఆలోచన. మీకు ప్రతి డెలివరిలో వాటా రావాలని, మీకు రెస్ట్ దొరకాలని కాంగ్రెస్ భావిస్తోంది. నరేంద్ర మోదీ ఆలోచన విధానం మీకు ఏం దక్కవద్దంటోంది.
రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ పిల్లలకు చదువు, మీ ఆరోగ్యానికి అండగా ఉంటుంది. మీరు భయపడవద్దు. మీకు మేం అండగా ఉంటాం. 21వ శతాబ్దం డేటా యుగం, గూగుల్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఉబెర్ వంటి సంస్థలన్నీ డేటా ఆధారంగానే నడుస్తున్నాయి. ఇప్పటివరకు దేశంలో గిగ్ వర్కర్లకు తమ సొంత పని డేటాను చూసుకునే అవకాశం కూడా ఉండేది కాదు. వర్కర్లు చేసిన డెలివరీలు, పట్టిన సమయం, వచ్చిన డబ్బుకు సంబంధించిన పూర్తి సమాచారం వారికి అందేది కాదు.
ఆ డేటాపై మీదే హక్కు..
కష్టం మీది, డేటా మీది అయినప్పుడు ఆ డేటాపై మీకే పూర్తి హక్కు ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త చట్టం ద్వారా గిగ్ వర్కర్లకు తమ డేటాపై పూర్తి అధికారం లభిస్తుంది. ప్రతి రైడ్, ప్రతి డెలివరీ, ప్రతి లావాదేవీకి సంబంధించిన పూర్తి సమాచారం ఇకపై వర్కర్లకు అందుబాటులో ఉంటుంది.
రెస్ట్ జోన్లలో వై-ఫై సౌకర్యం
హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని ప్రతి నగరంలో గిగ్ వర్కర్ల కోసం వై-ఫై (Wi-Fi) సౌకర్యంతో కూడిన ప్రత్యేక 'రెస్ట్ జోన్లు' ఏర్పాటు చేయబోతున్నాం. రెస్ట్ జోన్లలో వాహనాలు పార్క్ చేసి విశ్రాంతి తీసుకోవడానికి, నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. ప్రమాదాలు జరిగినా, అనారోగ్యం పాలైనా పని చేయలేక మీ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. గిగ్ వర్కర్లకు కూడా పెన్షన్, సామాజిక భద్రత ఉండాలి. మీ భవిష్యత్తు కోసం డబ్బు ఆదా కావాలి.
జైహింద్, జై తెలంగాణ అంటూ
ఉబెర్ రైడ్ అయినా, బ్లింకిట్ డెలివరీ అయినా.. ప్రతి ట్రాన్సాక్షన్ నుంచి 1% డబ్బు నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఆయా కంపెనీలు ప్రతి లావాదేవీపై ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది అని రాహుల్ పేర్కొన్నారు. చివరికి రాహుల్ జైహింద్, జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
సంబంధిత వార్తలు

Bharat Summit Hyderabad Visa Row | అప్పుడు రేవంత్ టూర్.. ఇప్పుడు హైదరాబాద్ ‘భారత్ సమ్మిట్’! మళ్లీ తెరపైకి వీసా వివాదం
నవంబర్ 14, 2026

Road Accident | డివైడర్‌ను ఢీకొట్టి అంటుకున్న కారు.. డ్రైవర్ బయటికొచ్చేలోపే ఏం జరిగిందంటే!
నవంబర్ 14, 2026

BM Sandeep | తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జిగా బీఎం సందీప్
నవంబర్ 14, 2026
తాజావార్తలు
- ●Karthika Brahmotsavam | అరుణాచల క్షేత్రానికి కార్తీక శోభ.. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
- ●Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!
- ●Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..
- ●Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!
- ●Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!
- ●Gold Price | వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర.. తులంపై రూ.2,500 డౌన్..!

Karthika Brahmotsavam | అరుణాచల క్షేత్రానికి కార్తీక శోభ.. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!

Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..

Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!







