త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Japan Bans Indian Mangoes | జపాన్‌లో ‘బంగినపల్లి, అల్ఫోన్సో’ మామిడికి నో ఎంట్రీ: 20 ఏళ్ల తర్వాత బ్యాన్ విధించడానికి అసలు కారణమిదే!

20 ఏళ్ల తర్వాత భారతీయ మామిడి పండ్ల దిగుమతిపై జపాన్ సంచలన నిషేధం విధించింది. పెస్ట్‌ కంట్రోల్‌లో లోపాల వల్లే ఈ నిర్ణయం. రైతులపై దీని ప్రభావం ఎలా ఉందంటే..!

J

National | Published On May 28, 2026, 8.23 pm IST

Japan Bans Indian Mangoes | జపాన్‌లో ‘బంగినపల్లి, అల్ఫోన్సో’ మామిడికి నో ఎంట్రీ: 20 ఏళ్ల తర్వాత బ్యాన్ విధించడానికి అసలు కారణమిదే!
Advertisement

Japan Bans Indian Mangoes | త్రినేత్ర.న్యూస్ : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ప్రపంచవ్యాప్తంగా మన భారతీయ మామిడి పండ్లకు (Indian Mangoes) ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా మన అల్ఫోన్సో, బంగినపల్లి రుచికి విదేశీయులు సైతం ఫిదా అవుతుంటారు. అయితే, ఏకంగా 20 ఏళ్ల తర్వాత భారతీయ మామిడి ఎగుమతులపై జపాన్ (Japan) సంచలన నిషేధం విధించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన తనిఖీల్లో పెస్ట్-కంట్రోల్ (Pest-control) విధానాల్లో లోపాలు గుర్తించడంతో జపాన్ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

ఏం జరిగింది? ఎందుకు బ్యాన్ చేశారు?

మామిడి పండ్లలో ఫ్రూట్ ఫ్లైస్ (Fruit flies) లాంటి పురుగులు లేకుండా చూడటం కోసం జపాన్ ఎప్పుడూ "జీరో-టాలరెన్స్" పాలసీని ఫాలో అవుతుంది. విదేశాలకు ఎగుమతి చేయడానికి ముందు మామిడి పండ్లను రసాయనాలు లేకుండా వేపర్ హీట్ ట్రీట్‌మెంట్ (Vapour Heat Treatment - VHT) చేయడం తప్పనిసరి.

మార్చి నెలలో ఉత్తరప్రదేశ్‌లోని రెహ్మాన్‌పూర్ VHT ఫెసిలిటీలో జపాన్ క్వారంటైన్ అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ ఫ్యూమిగేషన్ (Fumigation), డిస్‌ఇన్‌ఫెక్షన్ ప్రక్రియల్లో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నట్లు గుర్తించారు. దీని ఫలితంగా.. మార్చి 25, 2026 తర్వాత జారీ చేసిన ఇన్‌స్పెక్షన్ సర్టిఫికెట్లు ఉన్న మామిడి షిప్‌మెంట్లను ఇకపై అనుమతించబోమని జపాన్ యోకోహామా ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ తేల్చిచెప్పింది.

Japan Bans Indian Mangoes After 20 Years

20 ఏళ్లలో ఇదే తొలిసారి

గతంలోనూ ఫ్రూట్ ఫ్లైస్ భయంతో జపాన్ ఇలాగే బ్యాన్ విధించింది. అయితే భారత్ తన ట్రీట్‌మెంట్ ప్రొటోకాల్స్‌ను మరింత మెరుగుపరుచుకున్న తర్వాత, 2006లో ఆ బ్యాన్‌ను ఎత్తివేసింది. మళ్లీ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు నిషేధం విధించడం గమనార్హం.

రైతులకు.. ఎగుమతిదారులకు కోలుకోలేని దెబ్బ

జపాన్ మార్కెట్ మనకు అతిపెద్దది కాకపోయినా.. అల్ఫోన్సో (Alphonso), బంగినపల్లి (Banganapalli), కేసర్, లంగ్రా వంటి ప్రీమియం రకాలకు అక్కడ భారీ ధర పలుకుతుంది. ఈ బ్యాన్ వల్ల ఎగుమతిదారుల లాభాలకు భారీ గండి పడనుంది.

ఇప్పటికే ఎల్-నినో (El Nino) ప్రభావం, వాతావరణ మార్పుల వల్ల మహారాష్ట్రలోని కొంకణ్ బెల్ట్‌లో అల్ఫోన్సో దిగుబడి 60-70% పడిపోయింది. ప్రభుత్వ సర్వేల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో 85-90% వరకు పంట నష్టం జరిగింది. ఈ క్లిష్ట సమయంలో దిగుబడులు తగ్గి అల్లాడుతున్న రైతుల పాలిట జపాన్ బ్యాన్ శాపంగా మారింది. మన క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్‌పై ఇతర దేశాలు కూడా అనుమానాలు వ్యక్తం చేసే ప్రమాదం ఉందని ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు.

మామిడి ఉత్పత్తిలో మనమే గ్లోబల్ కింగ్

ఒకవైపు జపాన్ బ్యాన్ ఆందోళన కలిగిస్తున్నా.. మామిడి ఉత్పత్తిలో మన దేశం 'గ్లోబల్ క్యాపిటల్'గా కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది (2026) భారత్‌లో 23 మిలియన్ మెట్రిక్ టన్నులకు పైగా మామిడి ఉత్పత్తి అవుతుందని అంచనా.

Japan Bans Indian Mangoes After 20 Years

యూపీ, ఏపీలదే హవా: మొత్తం జాతీయ ఉత్పత్తిలో సగానికి పైగా వాటా ఉత్తరప్రదేశ్ (26.5% - 27%), ఆంధ్రప్రదేశ్ (21.5% - 22%) రాష్ట్రాలదే.

రకాల వారీగా: దశేరి, లంగ్రా రకాలకు యూపీ ఫేమస్ కాగా.. బంగినపల్లి, సఫేదాలకు ఏపీ కేరాఫ్ అడ్రస్. తెలంగాణ (4.5% - 5.0%) రాష్ట్రంలోనూ బంగినపల్లి, ఇమామ్ పసంద్ రకాలకు మంచి డిమాండ్ ఉంది.

గుజరాత్‌లో బంపర్ దిగుబడి : ఇక గుజరాత్‌లో ఈ ఏడాది శీతాకాలం ఉష్ణోగ్రతలు అద్భుతంగా అనుకూలించడంతో ప్రీమియం 'గిర్ కేసర్' (Gir Kesar) రకానికి బంపర్ దిగుబడి వచ్చింది. దీన్ని బెస్ట్ వింటేజ్ ఇయర్‌గా వ్యవసాయ నిపుణులు అభివర్ణిస్తున్నారు.

Advertisement
Advertisement