Asia Markets | వరుసగా రెండో రోజూ ఆసియా మార్కెట్ల పతనం.. క్రిప్టోల్లోనూ నష్టమే..
Asia Markets | మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు పెరగడంతో ఆసియా మార్కెట్లు వరుసగా రెండో రోజు పతనమయ్యాయి. చమురు ధరలు పెరుగుతుండడం, ద్రవ్యోల్బణ ఒత్తిడి భయాలు పెట్టుబడిదారులను కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంసీఎస్ఐ ఏషియా పసిఫిక్ ఇండెక్స్ మంగళవారం 2 శాతం వరకు పతనం అయింది.
Asia Markets | మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు పెరగడంతో ఆసియా మార్కెట్లు వరుసగా రెండో రోజు పతనమయ్యాయి. చమురు ధరలు పెరుగుతుండడం, ద్రవ్యోల్బణ ఒత్తిడి భయాలు పెట్టుబడిదారులను కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంసీఎస్ఐ ఏషియా పసిఫిక్ ఇండెక్స్ మంగళవారం 2 శాతం వరకు పతనం అయింది. సోమవారం కూడా 1.7 శాతం నష్టాన్ని నమోదు చేసింది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, అనంతరం ఇరాన్ ప్రతీకార చర్యల ప్రభావం ఆసియా మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. సెలవు తర్వాత ట్రేడింగ్ ప్రారంభించిన దక్షిణ కొరియా మార్కెట్‌లో కోస్పి సూచీ మంగళవారం 4.1 శాతం వరకు పడిపోయి భారీ నష్టాలను నమోదు చేసింది.
భారీగా నష్టపోయిన ఆసియా మార్కెట్లు..
సింగపూర్‌కు చెందిన వాంటేజ్ పాయింట్ అసెట్ మేనేజ్‌మెంట్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ నిక్ ఫెర్రెస్ మాట్లాడుతూ ప్రధాన ప్రశ్న ఇరాన్ గురించి కాదు. ఈ ఘర్షణ ఇతర మార్కెట్లకు వ్యాపించి, పెట్టుబడుల విలువపై విస్తృత ప్రభావం చూపుతుందా అన్నదే కీలకం.. అని పేర్కొన్నారు. మరోవైపు S & P 500 ఫ్యూచర్స్ 0.7 శాతం తగ్గగా, జపాన్ Topix 2.2 శాతం పడిపోయింది. ఆస్ట్రేలియా S&P/ASX 200 సూచీ 1.4 శాతం పతనం అయింది. హాంగ్‌కాంగ్ Hang Seng Index 0.3 శాతం క్షీణించింది. చైనా Shanghai Composite 1 శాతం పడిపోయింది. యూరో స్టాక్స్ ఫ్యూచర్స్ 0.7 శాతం మేర తగ్గాయి.
క్రిప్టోల్లోనూ నష్టాలు..
బ్లూమ్‌బర్గ్ డాలర్ స్పాట్ ఇండెక్స్ స్వల్ప మార్పుతో నిలిచింది. యూరో $1.1689 వద్ద స్థిరంగా ఉంది. జపాన్ యెన్ డాలర్‌కు 157.34 వద్ద పెద్దగా మార్పు లేదు. ఆఫ్‌షోర్ యువాన్ 0.2 శాతం పెరిగి 6.8842 వద్ద ఉంది. క్రిప్టో కరెన్సీల విషయానికి వస్తే బిట్‌కాయిన్ 1.6 శాతం తగ్గి $68,317 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈథర్ 2 శాతం పడిపోయి $2,002 వద్ద ఉంది.
ఈ రెండూ కీలకం..
చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని పెంచే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక ఘర్షణలు గ్లోబల్ మార్కెట్లలో రిస్క్ ను పెంచి ఈక్విటీ మార్కెట్లపై మరింత ఒత్తిడిని తీసుకువచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లు ప్రధానంగా రెండు అంశాలను గమనిస్తున్నట్లు తెలిపారు. హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా పరిస్థితి, ఘర్షణ ఎంతకాలం కొనసాగుతుందన్న అనిశ్చితిని మార్కెట్లు నిశితంగా పరిశీలిస్తున్నాయని, ఈ రెండింటిపైనే మార్కెట్ల దిశ ఆధారపడి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఈ రెండు అంశాలపై స్పష్టత వచ్చినప్పుడే మార్కెట్లు స్థిరపడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●TGSRTC | హైదరాబాదీలకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. రాత్రిపూట నడవనున్న బస్సులు
- ●MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు అనుమతిచ్చి రేవంత్‌కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న
- ●Bengaluru Teenage Suicide Attempt | ఇన్‌స్టా ప్రేమ.. పెళ్లికి నో చెప్పిన పేరెంట్స్: ఐదంతస్తుల భవనమెక్కిన 15 ఏళ్ల బాలుడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- ●Toxic | యశ్ టాక్సిక్ టికెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం - కానీ ఓ కండీషన్
- ●Nitin Gadkari | పనిచేయలేకపోతున్నా.. ఇక కొత్తతరానికి బాధ్యతలు అప్పగించాలి : నితిన్ గడ్కరీ
- ●RS Praveen Kumar | ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ కోసమే రేవంత్ విదేశీ పర్యటన పెట్టుకుండు

TGSRTC | హైదరాబాదీలకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. రాత్రిపూట నడవనున్న బస్సులు

MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు అనుమతిచ్చి రేవంత్‌కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న

Bengaluru Teenage Suicide Attempt | ఇన్‌స్టా ప్రేమ.. పెళ్లికి నో చెప్పిన పేరెంట్స్: ఐదంతస్తుల భవనమెక్కిన 15 ఏళ్ల బాలుడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Toxic | యశ్ టాక్సిక్ టికెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం - కానీ ఓ కండీషన్






