OTT | తెలుగులో రిలీజైన మలయాళం రొమాంటిక్ లవ్‌స్టోరీ – పేషెంట్‌తో ప్రేమలో పడిన డాక్టర్ కథ
మలయాళం మూవీ మేరీ ఆవాజ్ సునో తెలుగులోకి వచ్చింది. గురువారం ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో జయసూర్య, మంజు వారియర్ హీరోహీరోయిన్లుగా నటించారు.
Entertainment | Published On May 28, 2026, 8.04 pm IST
Malayalam OTT | జయసూర్య, మంజు వారియర్ హీరోహీరోయిన్లుగా నటించిన మలయాళం రొమాంటిక్ లవ్ డ్రామా మూవీ మేరీ ఆవాజ్ సునో తెలుగులోకి వచ్చింది. గురువారం నేరుగా ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైంది. మలయాళ టైటిల్‌తోనే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ఈటీవీ విన్ ఓటీటీ.
నాలుగేళ్ల తర్వాత...
ప్రజేష్ సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శిశ్విద, జానీ ఆంటోనీ, గౌతమి కీలక పాత్రల్లో కనిపించారు. 2022లో మలయాళంలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ నాలుగేళ్ల తర్వాత తెలుగులో రిలీజ్ కావడం గమనార్హం. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ ఎమ్ జయచంద్రన్ దర్శకత్వం వహించాడు. బెంగాళీ మూవీ కంఠోకు రీమేక్‌గా మేరీ ఆవాజ్ సునో రూపొందింది. ఈ మలయాళం సినిమాలో సీనియర్ హీరో మాధవన్ అతిథిగా కనిపించారు. జయసూర్య, మంజు వారియర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మొదటి సినిమా ఇది.
రేడియో జాకీ కథ...
శంకర్ టాప్ రేడియో జాకీ. తన మాటలతో చాలా మందిలో స్ఫూర్తిని నింపుతుంటాడు. అతిగా సిగరెట్లు తాగే అలవాటు కారణంగా క్యాన్సర్ బారిన పడ్డ శంకర్ తన మాటను కోల్పోతాడు. డిప్రెషన్‌కు లోనవుతాడు. స్పీచ్ థెరఫిస్ట్ రేష్మీ అతడి లైఫ్‌లోకి వస్తుంది. ట్రీట్‌మెంట్ కోసం ఆమె దగ్గర చేరిన శంకర్ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది? రేష్మీ ట్రీట్‌మెంట్ వల్ల తిరిగి మాట్లాడే శక్తి శంకర్‌కు వచ్చిందా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CM Revanth Reddy | మంత్రి తుమ్మలను పక్కకు నెట్టి.. పీసీసీ చీఫ్‌ను దగ్గరగా తీసుకున్న సీఎం రేవంత్..
- ●Ram Charan Peddi | మోదీ నోట పెద్ది మాట - రామ్‌చరణ్ కామెంట్స్ వైరల్
- ●High BP Silent Killer India | సైలెంట్ కిల్లర్‌గా 'హైబీపీ'.. ఏటా 16 లక్షల మంది బలి
- ●Karnataka Techie Death | భార్యాపిల్లల ముందే ఊహించని ఘోరం: జాబ్ వదిలి వ్యవసాయం వైపు అడుగులు.. పిడుగు రూపంలో టెకీని బలితీసుకున్న విధి
- ●CM Revanth Reddy | ప్రతి పౌరుడికి 'సమగ్ర సంక్షేమ కార్డు' : సీఎం రేవంత్ రెడ్డి
- ●TGIIC | రాయదుర్గంలో ఎకరం భూమి రూ. 237 కోట్లు

CM Revanth Reddy | మంత్రి తుమ్మలను పక్కకు నెట్టి.. పీసీసీ చీఫ్‌ను దగ్గరగా తీసుకున్న సీఎం రేవంత్..

Ram Charan Peddi | మోదీ నోట పెద్ది మాట - రామ్‌చరణ్ కామెంట్స్ వైరల్

High BP Silent Killer India | సైలెంట్ కిల్లర్‌గా 'హైబీపీ'.. ఏటా 16 లక్షల మంది బలి

Karnataka Techie Death | భార్యాపిల్లల ముందే ఊహించని ఘోరం: జాబ్ వదిలి వ్యవసాయం వైపు అడుగులు.. పిడుగు రూపంలో టెకీని బలితీసుకున్న విధి






