త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కం, ఉచిత క‌రెంట్ ఎన్టీఆర్ స్ఫూర్తినే : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | మా ప్ర‌జా ప్ర‌భుత్వం ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కం, ఉచిత క‌రెంట్, ఇందిర‌మ్మ చీర‌ల ప‌థ‌కాల‌ను ఎన్టీఆర్ స్ఫూర్తితోనే అమ‌లు చేస్తుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తి మా సంక్షేమ ప‌థ‌కాల్లో క‌నిపిస్తుంద‌ని సీఎం అన్నారు.

S

Telangana | Published On May 28, 2026, 9.11 pm IST

CM Revanth Reddy | ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కం, ఉచిత క‌రెంట్ ఎన్టీఆర్ స్ఫూర్తినే : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : మా ప్ర‌జా ప్ర‌భుత్వం ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కం, ఉచిత క‌రెంట్, ఇందిర‌మ్మ చీర‌ల ప‌థ‌కాల‌ను ఎన్టీఆర్ స్ఫూర్తితోనే అమ‌లు చేస్తుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తి మా సంక్షేమ ప‌థ‌కాల్లో క‌నిపిస్తుంద‌ని సీఎం అన్నారు. మైత్రీవ‌నంలో ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన అనంత‌రం సీఎం రేవంత్ ప్ర‌సంగించారు.

ఆనాడు ఎన్టీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన ప‌క్కా ఇండ్ల ప‌థ‌క‌మే ఈనాడు ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థ‌కం అని గ‌ర్వంగా చెప్ప‌ద‌ల‌చుకున్నా. ఈనాడు 3 కోట్ల 24 ల‌క్ష‌ల మంది స‌న్న‌బియ్యం తింటున్నారంటే ఆ స్ఫూర్తి వెనుకాల 2 కిలోల బియ్యం ప‌థ‌కం ఉన్న‌ది. మ‌హిళ‌ల‌కు ఇందిర‌మ్మ చీర‌లు ఇస్తున్నాం. పండుగ‌పూట పెట్టే చీర‌ను సారెగా భావించి పాల‌పిట్ట‌ల్లాగా చీర‌లు క‌ట్టుకుంటున్నారు ఆడ‌బిడ్డ‌లు. ఆనాడు ఎన్టీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన జ‌న‌తా వ‌స్త్రాలు పేద‌వారికి అందించి కూడు, గుడ్డ‌, నీడ క‌ల్పించారు ఎన్టీఆర్. ఆ స్ఫూర్తినే మా ప్ర‌భుత్వంలో అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల్లో క‌నిపిస్తుంది. మీరు ఆలోచించండి అని సీఎం అన్నారు.

ఉచిత క‌రెంట్‌కు స్ఫూర్తి 50 రూపాయాల‌కే హార్స్ ప‌వ‌ర్

వైఎస్సార్ అందించిన 24 గంట‌ల క‌రెంట్ ఉచిత క‌రెంట్ కావొచ్చు.. మేం అందిస్తున్న‌ ఉచిత క‌రెంట్‌కు స్ఫూర్తి 50 రూపాయాల‌కే హార్స్ ప‌వ‌ర్ అని రైతాంగాన్ని ఆదుకోవ‌డానికి వారు అందించిన విద్యుత్తే ఈనాడుఉచిత విద్యుత్ అని చెప్ప‌ద‌ల‌చుకున్నా. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీల కోసం ఇందిర‌మ్మ పాటుప‌డితే బ‌ల‌హీన వ‌ర్గాల కోసం ఎన్టీఆర్ పాటుప‌డ్డారు. ఇవాళ బ‌ల‌హీన వ‌ర్గాలు పాల‌కులుగా మారారంటే అన్న గారి ఆశీర్వాదం తెలంగాణ‌కు అందింది కాబ‌ట్టే పాలితులుగా ఉన్న వారు పాల‌కులుగా మారారు అని సీఎం తెలిపారు.

సంక్షేమ ప‌థ‌కాల్లో ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ స్ఫూర్తి

తెలంగాణ‌లో ఉన్న ప‌టేల్, ప‌ట్వారీ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేసి విముక్తి క‌ల్పించారు పేద‌ల‌కు ఎన్టీఆర్. సాయుధ రైతాంగ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని పేద‌ల‌కు, ద‌ళితుల‌కు అసైన్‌మెంట్ ప‌ట్టాలు అందించారు ఇందిరా గాంధీ. బ‌ల‌హీన వ‌ర్గాల‌కు ఆత్మగౌర‌వం క‌ల్పించారు. మా ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల్లో ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ స్ఫూర్తి క‌నిపిస్తుంది. మా ప్ర‌జా పాల‌న‌లో, మా నిర్ణ‌యాల్లో క‌నిపిస్తుంద‌ని సీఎం అన్నారు.

ఇందిరా గాంధీ ఎంత ముఖ్య‌మో.. ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం..

ఇందిరా గాంధీ ఎంత ముఖ్య‌మో.. ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిర‌మ్మ ఒక త‌రం అయితే ఎన్టీఆర్ ఒక శ‌కం. వారిద్ద‌రి క‌ల‌యిక‌నే ఈ నాటి ప్ర‌జాపాల‌న‌. ఆడ‌బిడ్డ‌ల‌కు ఆర్టీసీ ఉచిత ప్ర‌యాణం క‌ల్పించాం. అదానీ, అంబానీల‌తో పోటీప‌డి సోలార్ విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తున్నారు మ‌హిళ‌లు. వెయ్యి బ‌స్సుల‌కు మ‌హిళ‌ల‌ను య‌జ‌మానుల‌ను చేశాం. వ్యాపారాల్లో రాణిస్తున్నారు. మ‌హిళ‌ల‌కు ఎన్టీఆర్ ఆస్తిలో హ‌క్కు ఎలా ఇచ్చారో.. కోటి మందిని కోటీశ్వ‌రులుగా తీర్చిదిద్దాల‌ని మా ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంది. అన్న‌గారి, ఇందిర‌మ్మ స్ఫూర్తితో కోటిమంది ఆడ‌బిడ్డ‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేయాల‌ని మా ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేస్తుంది అని సీఎం తెలిపారు.

Advertisement
Advertisement