త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | కేసీఆర్‌కు రాజ‌కీయ భిక్ష పెట్టిందే ఎన్టీఆర్ : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాజ‌కీయ భిక్ష పెట్టిందే ఎన్టీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇది చ‌రిత్ర‌.. ఎవ‌రూ మ‌ర‌వొద్దు అని సీఎం అన్నారు.

S

Telangana | Published On May 28, 2026, 8.57 pm IST

CM Revanth Reddy | కేసీఆర్‌కు రాజ‌కీయ భిక్ష పెట్టిందే ఎన్టీఆర్ : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాజ‌కీయ భిక్ష పెట్టిందే ఎన్టీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇది చ‌రిత్ర‌.. ఎవ‌రూ మ‌ర‌వొద్దు అని సీఎం అన్నారు. హైద‌రాబాద్ మైత్రీవ‌నంలో ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు.

ఎవ‌రు ఏమ‌నుకున్నా, ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా భ‌య‌ప‌డ‌ను. నేను చెప్ప‌ద‌ల‌చుకున్నా ఒక్క‌టే.. ఇందిరా గాంధీ ఈ తెలంగాణ నుంచి పీవీ న‌ర‌సింహారావు, మ‌ర్రి చెన్నారెడ్డి, శివ‌శంక‌ర్, వెంక‌ట్ స్వామి లాంటి నేత‌ల‌ను అందిస్తే.. ఈ తెలంగాణ ప్రాంతానికి ఎన్టీఆర్ ఓ మండ‌వ వెంక‌టేశ్వ‌ర రావు, తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు, జానారెడ్డి, దేవేంద‌ర్ గౌడ్‌, కడియం శ్రీహ‌రి, మోత్కుప‌ల్లి న‌ర్సింహులు, మాధ‌వ‌రెడ్డి లాంటి నేత‌ల‌ను అందించారని సీఎం గుర్తు చేశారు.

ఎన్టీఆర్ లేకుండానే మీరు నాయ‌కులు అయ్యారా..?

ఈనాడు ఉప‌న్యాసాలు ఇస్తున్న కేసీఆర్‌కు రాజ‌కీయ భిక్ష పెట్టిందేవ‌రు.. అన్న లేకుండానే మీరు నాయ‌కులు అయ్యారా..? అన్న నీడ‌న బ‌తికిన మీరు అన్న గురించి త‌క్కువ చేసి మాట్లాడ‌డం మీకు మంచిదా..? వారే కాదు.. వారి పేరు పెట్టుకున్నోళ్లు కూడా నాయ‌కులుగా చ‌లామ‌ణి అవుతున్నారు. ఆయ‌న ప్రోత్సాహం ఇచ్చి, భుజం త‌ట్టి.. ఒక తుమ్మ‌ల‌, మండ‌వ, జానా, క‌డియం మోత్కుప‌ల్లి, మాధ‌వ‌రెడ్డి, దేవేంద‌ర్ గౌడ్‌కు అవ‌కాశం క‌ల్పించారు. క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావును కూడా గుర్తించి రాజ‌కీయంగా ఎన్టీఆర్ అవ‌కాశాలు క‌ల్పించారు. ఇది చ‌రిత్ర.. ఎవ‌రూ మ‌ర‌వొద్దు. ఇకొంత మంది ఆయ‌న పేరు మీద చ‌లామ‌ణి అవుతున్నారు.. కొంద‌రు న‌కిలీలు ఉంటారు. వారి ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయో మ‌నం చూస్తున్నాం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement