CM Revanth Reddy | భారతదేశ జాతిరత్నాలు ఆ ముగ్గురే : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | భారతదేశ జాతి రత్నాలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఇందిరా గాంధీ, నందమూరి తారకరామారావు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మానవ మనుగడ ఉన్నంతకాలం ఈ ముగ్గురిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : భారతదేశ జాతి రత్నాలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఇందిరా గాంధీ, నందమూరి తారకరామారావు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మానవ మనుగడ ఉన్నంతకాలం ఈ ముగ్గురిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ మైత్రీవనంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
మిత్రులారా.. భారతదేశ చరిత్రను ఎవరు చదవాలన్నా.. చరిత్ర నుంచి స్ఫూర్తి పొందాలన్నా ముగ్గురు జాతి రత్నాల గురించి మనం స్మరించుకోవాలి. మొదటివాడు భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి, దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, ఈ దేశ ప్రధానితో సమానంగా ఓటు హక్కును ఇవ్వడమే కాకుండా వారి అభ్యున్నతి కోసం రాజ్యాంగాన్ని రచించి, ఆనాడు ఓటు హక్కు కల్పించాడు. అమెరికా లాంటి ఆదేశాల్లో కొన్ని దశాబ్దాలు కొట్లాడిన తర్వాత మహిళలకు ఓటు హక్కు వచ్చింది. మన దేశంలో అంబేద్కర్ పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు కల్పించారు. తమను ఎవరు పరిపాలించాలి.. శాసించాలి అనేది నిర్ణయించుకునే హక్కు కల్పించారు అంబేద్కర్ అని రేవంత్ అన్నారు.
ఇక రెండో తరానికి వస్తే.. ఇందిరా గాంధీ.. ఒక ఉక్కు మహిళ. ఈమె మహిళా స్ఫూర్తి దేశాన్ని తల ఎత్తుకునే విధంగా చేశారు. అధికారం భూస్వాముల చేతుల్లో ఉన్నప్పుడు.. కోట్లాది ఎకరాల భూములను ఆనాడు ఈ ప్రాంతంలో పంచిపెట్టారు. నిరంకుశ నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం చేసిన పేదల కోసం భూసంస్కరణలు తీసుకొచ్చి భూమి రాజుల వద్ద ఉన్న భూస్వాముల వద్ద ఉన్న గుంజుకుని లక్షలాది ఎకరాలను తాడితపీడిత వర్గాలకు పంచిపెట్టారు. భూమి హక్కును పేదలకు అందించారు. ఈనాడు జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం.. యుద్ధాలు చూస్తున్నాం. యుద్ధాల్లో ప్రధాన మంత్రుల లొంగుబాటు చూస్తున్నాం. కానీ 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు పాక్‌ను ఓడగొట్టి, బంగ్లాదేశ్‌ను విడగొట్టి, మన దేశ రాజకీయాల్లో అమెరికా ప్రెసిడెంట్ కలగజేసుకుంటే దేశం ఊరుకోదని హెచ్చరించింది ఇందిరా గాంధీ. ఈనాటికి ప్రపంచ దేశాల్లో ఈ దేశం యొక్క గొప్పతనం, గౌరవం నాయకత్వ లక్షణాలను చాటి చెప్పిన ఇందిరా గాంధీని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది అని సీఎం అన్నారు.
ఇక మూడో తరం.. ఆ తరం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మూడే మూడు పదాలు ఎన్టీఆర్. నీతి నిజాయితీ నిబద్దత. ఉక్కు సంకల్పం కలిగిన నాయకుడు, తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీఆర్. అంబేద్కర్, ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ ఈ ముగ్గురు భారతదేశ జాతిరత్నాలు. మానవ మనుగడ ఉన్నంతకాలం స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CM Revanth Reddy | ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఉచిత కరెంట్ ఎన్టీఆర్ స్ఫూర్తినే : సీఎం రేవంత్ రెడ్డి
- ●CM Revanth Reddy | కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే ఎన్టీఆర్ : సీఎం రేవంత్ రెడ్డి
- ●CM Revanth Reddy | ఎన్టీఆర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో పరిపాలన : సీఎం రేవంత్ రెడ్డి
- ●Riddhi Kumar | బోల్డ్ ఫొటోలతో రాజాసాబ్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్
- ●Japan Bans Indian Mangoes | జపాన్‌లో 'బంగినపల్లి, అల్ఫోన్సో' మామిడికి నో ఎంట్రీ: 20 ఏళ్ల తర్వాత బ్యాన్ విధించడానికి అసలు కారణమిదే!
- ●OTT | తెలుగులో రిలీజైన మలయాళం రొమాంటిక్ లవ్‌స్టోరీ - పేషెంట్‌తో ప్రేమలో పడిన డాక్టర్ కథ

CM Revanth Reddy | ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఉచిత కరెంట్ ఎన్టీఆర్ స్ఫూర్తినే : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే ఎన్టీఆర్ : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | ఎన్టీఆర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో పరిపాలన : సీఎం రేవంత్ రెడ్డి

Riddhi Kumar | బోల్డ్ ఫొటోలతో రాజాసాబ్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్




