CM Revanth Reddy | ఎన్టీఆర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో పరిపాలన : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | దివంగత సీఎం నందమూరి తారకరామారావు స్ఫూర్తితోనే రాష్ట్రంలో పరిపాలన అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో నెలకొల్పాలనే ఉద్దేశంతోనే నగరం నడిబొడ్డున మైత్రివనం జంక్షన్‌లో ఆయన విగ్రహాం ఆవిష్కరించుకున్నామని సీఎం తెలిపారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : దివంగత సీఎం నందమూరి తారకరామారావు స్ఫూర్తితోనే రాష్ట్రంలో పరిపాలన అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో నెలకొల్పాలనే ఉద్దేశంతోనే నగరం నడిబొడ్డున మైత్రివనం జంక్షన్‌లో ఆయన విగ్రహాం ఆవిష్కరించుకున్నామని సీఎం తెలిపారు. మైత్రివనం జంక్షన్‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం ప్రసంగించారు.
ఈనాడు ఈ కార్యక్రమం తీసుకుంటే చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కలిసి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏ విధంగా ఆవిష్కరిస్తారని ప్రశ్నించారు. ఇది ఆంధ్రప్రదేశ్ కాదు.. హైదరాబాద్ నడిబొడ్డున పెడుతారా అని మాట్లాడుతున్నారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఈ దేశ గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్. ఆ ఎన్టీఆర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో పరిపాలన అందిస్తున్నాం. మైత్రివనం జంక్షన్‌లో వెళ్లే ప్రతి ఒక్కరిలో ఎన్టీఆర్ స్ఫూర్తి రావాలనే నగరం నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఇది గొప్ప అనుభూతి. ఒక సీఎంగా ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించడమంటే జీవితకాలం గుర్తుండిపోయే మధుర సంఘటన అని సీఎం పేర్కొన్నారు.
ఎన్ని విమర్శలు చేసినా భయపడను..
ఎవరు ఏమనుకున్నా, ఎన్ని విమర్శలు చేసినా భయపడను. నేను చెప్పదలచుకున్నా ఒక్కటే.. ఇందిరా గాంధీ ఈ తెలంగాణ నుంచి పీవీ నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, శివశంకర్, వెంకట్ స్వామి లాంటి నేతలను అందిస్తే.. ఈ తెలంగాణ ప్రాంతానికి ఎన్టీఆర్ ఓ మండవ వెంకటేశ్వర రావు, తుమ్మల నాగేశ్వర్ రావు, జానారెడ్డి, దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరి, మోత్కుపల్లి నర్సింహులు, మాధవరెడ్డి లాంటి నేతలను అందించారని సీఎం గుర్తు చేశారు.
కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందేవరు..
ఈనాడు ఉపన్యాసాలు ఇస్తున్న కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందేవరు.. అన్న లేకుండానే మీరు నాయకులు అయ్యారా..? అన్న నీడన బతికిన మీరు అన్న గురించి తక్కువ చేసి మాట్లాడడం మీకు మంచిదా..? వారే కాదు.. వారి పేరు పెట్టుకున్నోళ్లు కూడా నాయకులుగా చలామణి అవుతున్నారు. ఆయన ప్రోత్సాహం ఇచ్చి, భుజం తట్టి.. ఒక తుమ్మల, మండవ, జానా, కడియం మోత్కుపల్లి, మాధవరెడ్డి, దేవేందర్ గౌడ్‌కు అవకాశం కల్పించారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కూడా గుర్తించి రాజకీయంగా ఎన్టీఆర్ అవకాశాలు కల్పించారు. ఇది చరిత్ర.. ఎవరూ మరవొద్దు. ఇకొంత మంది ఆయన పేరు మీద చలామణి అవుతున్నారు.. కొందరు నకిలీలు ఉంటారు. వారి ఆలోచనలు ఎలా ఉంటాయో మనం చూస్తున్నాం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CM Revanth Reddy | ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఉచిత కరెంట్ ఎన్టీఆర్ స్ఫూర్తినే : సీఎం రేవంత్ రెడ్డి
- ●CM Revanth Reddy | కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే ఎన్టీఆర్ : సీఎం రేవంత్ రెడ్డి
- ●Riddhi Kumar | బోల్డ్ ఫొటోలతో రాజాసాబ్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్
- ●Japan Bans Indian Mangoes | జపాన్‌లో 'బంగినపల్లి, అల్ఫోన్సో' మామిడికి నో ఎంట్రీ: 20 ఏళ్ల తర్వాత బ్యాన్ విధించడానికి అసలు కారణమిదే!
- ●CM Revanth Reddy | భారతదేశ జాతిరత్నాలు ఆ ముగ్గురే : సీఎం రేవంత్ రెడ్డి
- ●OTT | తెలుగులో రిలీజైన మలయాళం రొమాంటిక్ లవ్‌స్టోరీ - పేషెంట్‌తో ప్రేమలో పడిన డాక్టర్ కథ

CM Revanth Reddy | ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఉచిత కరెంట్ ఎన్టీఆర్ స్ఫూర్తినే : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే ఎన్టీఆర్ : సీఎం రేవంత్ రెడ్డి

Riddhi Kumar | బోల్డ్ ఫొటోలతో రాజాసాబ్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్

Japan Bans Indian Mangoes | జపాన్‌లో 'బంగినపల్లి, అల్ఫోన్సో' మామిడికి నో ఎంట్రీ: 20 ఏళ్ల తర్వాత బ్యాన్ విధించడానికి అసలు కారణమిదే!




