త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Talasani Srinivas Yadav | నోటికొచ్చిన‌ట్లు మాట్లాడ్డం కాదు.. నువ్‌ ఏం చేసిన‌వో చెప్పు

Talasani Srinivas Yadav | ప్ర‌భుత్వం ఏం చేసిందో చెప్ప‌మంటే రేవంత్‌రెడ్డి ముఖ్య‌మంత్రిన‌ని మ‌రిచిపోయి నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిప‌డ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Jul 5, 2026, 4.09 pm IST

Talasani Srinivas Yadav | నోటికొచ్చిన‌ట్లు మాట్లాడ్డం కాదు.. నువ్‌ ఏం చేసిన‌వో చెప్పు
Advertisement
  • కేసీఆర్‌ను త‌ల‌వందే రేవంత్ నిద్ర‌పోడు
  • అధికారంలోకి వ‌చ్చి మిత్తితో స‌హా చెల్లిస్తం
  • బీఎల్‌వోలు ఓట్లు పోకుండా చూడాలి
  • గోపీనాథ్ జూబ్లీహిల్స్‌కు ఎంతో చేశారు
  • జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గ స‌మావేశంలో త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌

Talasani Srinivas Yadav | త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌భుత్వం ఏం చేసిందో చెప్ప‌మంటే రేవంత్‌రెడ్డి ముఖ్య‌మంత్రిన‌ని మ‌రిచిపోయి నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిప‌డ్డారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంద‌న్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం నిర్వహించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమావేశానికి ఆయ‌న‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేసీఆర్ 10 సంవత్సరాల్లో 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశార‌న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

 

బీజేపీ ఓట్లు తొల‌గించే ప్ర‌య‌త్నం చేస్తోంది..

గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఉప ఎన్నికలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. SIRలో పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్‌లు అప్రమత్తంగా ఉండాలి. అర్హులైన వారి ఓట్లు తొలగింపు కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలి. కొన్ని వర్గాల ఓట్లు తొలగింపే లక్ష్యంగా బీజేపీ ప్రయత్నిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు. దొంగ ఓట్లను గుర్తించి తొలగించేలా చూడాలి. ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలి అని త‌ల‌సాని పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ హ‌యాంలో రంజాన్, బతుకమ్మ, క్రిస్మస్ పండుగలను ఎంతో ఘనంగా నిర్వహించారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీల గురించి అడిగితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే విషయాన్ని మరిచి బూతు భాష మాట్లాడుతున్నాడు. రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. తన ప్రాణాలను ప‌ణంగా పెట్టి పోరాడి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్. కేసీఆర్‌ను తలవకుంటే రేవంత్ రెడ్డికి నిద్రపట్టదు అని విమ‌ర్శించారు.

కాంగ్రెస్ హామీల‌పై నిల‌దీయాలి..

పార్టీ నాయకులు ఐక్యంగా ఉండాలి. పార్టీ అభివృద్ధికి బాధ్యతగా భావించి కృషి చేయాలి. ప్రజల అభిమానం, ఆదరణ పొందిన వారికే కార్పొరేషన్ ఎన్నికల్లో అవకాశం లభిస్తుంది. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలుపై నిరంతరం పోరాడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా మోసం చేసిన విధానంపై ప్రజలకు వివరించాలి. ప్రభుత్వం ఏం చేసిందో చెప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్‌ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చర్చలకు సవాల్ చేసి హరీష్ రావును అక్రమంగా అరెస్ట్ చేశారు. రెండున్నరేళ్ల తర్వాత తిరిగి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్తీతో సహా తిరిగి చెల్లిస్తాం అని త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ హెచ్చ‌రించారు.

 

Advertisement
Advertisement