Teejan Bai | పద్మశ్రీ తీజన్ బాయి ఇకలేరు.. మూగబోయిన జానపద లోకం
Teejan Bai | ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రముఖ జానపద గాయని తీజన్ బాయి(70) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె రాయ్‌పూర్‌లో ఆదివారం తుదిశ్వాస విడిచారు.
Teejan Bai | త్రినేత్ర.న్యూస్ : ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రముఖ జానపద గాయని తీజన్ బాయి(70) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె రాయ్‌పూర్‌లో ఆదివారం తుదిశ్వాస విడిచారు. తీజన్ బాయి మృతితో జానపద సంగీత ప్రపంచానికి తీరని లోటు అని జానపద గాయకులు పేర్కొన్నారు. ఆమె మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. భారతీయ జానపద కళలకు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా.. పద్మశ్రీ(1988), పద్మభూషణ్(2003), పద్మవిభూషణ్(2019) అందుకున్నారు.
1956 ఆగస్టు 8న ఛత్తీస్‌గఢ్ దుర్గ్ జిల్లాలో తీజన్ బాయి జన్మించారు. షెడ్యూల్డ్ తెగకు చెందిన ఆమె.. తన చిన్నతనం నుంచే జానపద కళలపై ఆసక్తి పెంచుకున్నారు. అయితే ఆమె తాత బ్రిజ్ లాల్ పార్థి.. ఛత్తీస్గడ్, హిందీ భాషల్లో సబల్ సింగ్ రచించిన మహాభారత కథలను ఆమెకు వినిపించేవారు. ఆసక్తిగా విని.. తనదైన శైలిలో ఇతరులకు తీజన్ బాయి చెప్పేవారు. ఆమెలో ఉన్న ప్రతిభను కుటుంబ సభ్యులు గుర్తించి పాండవాని కళలో ఆమె శిక్షణ ఇప్పించారు. పురుషులే ప్రధానంగా ఈ కళను ప్రదర్శించే రోజుల్లో సామాజిక అడ్డంకులను అధిగమించి, తన ప్రత్యేకమైన ప్రదర్శన శైలితో పాండవానికి కొత్త రూపాన్ని తీసుకొచ్చారు. మహిళలు కూడా ఈ కళలో రాణించగలరు అని నిరూపించి చరిత్ర సృష్టించారు. ఇక ఈమె జానపద సంగీత కళా రంగంలో చేసిన విశిష్ట సేవలకు అనేక జాతీయ , అంతర్జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు.
సంబంధిత వార్తలు

PM Modi | 21వ శతాబ్దపు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్ విజయవంతంగా అధిగమించింది : ప్రధాని మోదీ
జులై 4, 2026

Arvind Kejriwal | ప్రధానికి తెలియకుండా ఇది అసాధ్యం.. రామాలయ విరాళాల దుర్వినియోగంపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
జులై 3, 2026

Modi New Zealand Visit | వచ్చే వారం న్యూజిలాండ్‌కు మోదీ.. ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది..!
జులై 3, 2026
తాజావార్తలు
- ●Aakriti Sutar Case | విషాదం: పెళ్లైన రెండు నెలలకే భవనం పైనుంచి పడి యువతి మృతి.. హత్యే అంటున్న కుటుంబ సభ్యులు
- ●Rajagopal Reddy | రాహుల్ మాటలకు ఫిదా అయ్యా.. ఆయన నాయకత్వంలోనే పని చేస్తున్నా
- ●Sleeping Pills | 20 నిద్ర మాత్రలిచ్చి భర్తను చంపి.. బాత్రూమ్లో పూడ్చిపెట్టిన భార్య
- ●Mumbai Monsoon 2026 | ముంబైని వణికిస్తున్న వర్షాలు.. కొత్త షాప్ తెరుస్తుండగా చెట్టు విరిగిపడి వృద్ధుడి దుర్మరణం!
- ●Sreeleela | సైఫ్ అలీఖాన్ కొడుకు సరసన శ్రీలీల
- ●Uttam Kumar Reddy | బీఆర్ఎస్ వల్లే కాళేశ్వరం నీళ్లు ఉపయోగిస్తలేం: ఉత్తమ్

Aakriti Sutar Case | విషాదం: పెళ్లైన రెండు నెలలకే భవనం పైనుంచి పడి యువతి మృతి.. హత్యే అంటున్న కుటుంబ సభ్యులు

Rajagopal Reddy | రాహుల్ మాటలకు ఫిదా అయ్యా.. ఆయన నాయకత్వంలోనే పని చేస్తున్నా

Sleeping Pills | 20 నిద్ర మాత్రలిచ్చి భర్తను చంపి.. బాత్రూమ్లో పూడ్చిపెట్టిన భార్య

Mumbai Monsoon 2026 | ముంబైని వణికిస్తున్న వర్షాలు.. కొత్త షాప్ తెరుస్తుండగా చెట్టు విరిగిపడి వృద్ధుడి దుర్మరణం!



