Rajagopal Reddy | రాహుల్ మాటలకు ఫిదా అయ్యా.. ఆయన నాయకత్వంలోనే పని చేస్తున్నా
Rajagopal Reddy | కాంగ్రెస్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలనే తప్పుపడుతున్నానే తప్పా పార్టీని కాదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏ నాయకునికి ఇవ్వని టైం రాహుల్‌గాంధీ తనకు ఇచ్చినట్లు చెప్పారు. పార్టీలో అంతటి స్థానముందని తెలిపారు.
- ఆయన్ను ప్రధానిని చేయడానికి కష్టపడతా
- కాంగ్రెస్ నిర్ణయాలనే తప్పంటున్నా.. పార్టీని కాదు
- నేను పార్టీకి దూరంగా ఉంటలే.. కార్యకర్తలను కాపాడుకుంటున్నా
- మొదటి నుంచి పార్టీలో ఉన్నోళ్లకు అన్యాయం జరగొద్దు
- చౌటుప్పల్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు
Rajagopal Reddy | త్రినేత్ర.న్యూస్: కాంగ్రెస్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలనే తప్పుపడుతున్నానే తప్పా పార్టీని కాదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీకి దూరంగా ఉంటున్నానన్న మాటల్లో వాస్తవం లేదన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటున్నానని వెల్లడించారు. తెలంగాణలో ఏ నాయకునికి ఇవ్వని టైం రాహుల్‌గాంధీ తనకు ఇచ్చినట్లు చెప్పారు. పార్టీలో అంతటి స్థానముందని తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో ఆయన ప్రసంగించారు.
రాహుల్ గాంధీతో పార్టీ నిర్ణయాలు, కుటుంబ విషయాలు చాలా చర్చించాం. రాహుల్ నాతో మాట్లాడిన మాటలకు ప్రభావితమయ్యాను. ఆయన మానవత్వం ఉన్న వ్యక్తి. రాహుల్ నాయకత్వంలో పనిచేస్తున్నాం. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ పనిచేస్తా. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేస్తున్నా. రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రజల మనసులో ఏమున్నది, వాళ్లకు ఏం చేయాలనే దానిపై ఆలోచన చేస్తున్నాం. పార్టీని బలోపేతం చేసే విషయంలో రాజీ పడం అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వచ్చింది..
మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి అన్యాయం జరగొద్దనేదే మా ఆలోచన. యాదగిరిగుట్ట విషయం తప్పనిసరి పరిస్థితులలో మాట్లాడాల్సి వచ్చింది. అది పార్టీ మీద వ్యతిరేకమో.. ప్రభుత్వం మీద వ్యతిరేకమో కాదు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. వచ్చే ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నేను పని చేస్తా అని రాజగోపాల్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జులై 18, 2026

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
జులై 18, 2026

Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
జులై 18, 2026
తాజావార్తలు
- ●Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక
- ●Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
- ●Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
- ●Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
- ●TTA Convention USA | అమెరికాలో టీటీఏ మహాసభల సందడి: తెలంగాణ అధికారులకు షార్లెట్‌లో ఆత్మీయ స్వాగతం

Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక

Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి



