త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aakriti Sutar Case | విషాదం: పెళ్లైన రెండు నెలలకే భవనం పైనుంచి పడి యువతి మృతి.. హత్యే అంటున్న కుటుంబ సభ్యులు

ఢిల్లీలో పెళ్లైన రెండు నెలలకే ఓ యువతి అనుమానాస్పద స్థితిలో భవనం పైనుంచి పడి మృతి చెందింది. అత్తింటివారే వరకట్నం కోసం హత్య చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ.

J

Crime | Published On Jul 5, 2026, 5.46 pm IST

Aakriti Sutar Case | విషాదం: పెళ్లైన రెండు నెలలకే భవనం పైనుంచి పడి యువతి మృతి.. హత్యే అంటున్న కుటుంబ సభ్యులు
Advertisement
  • లోధి కాలనీలోని NDMC ఫ్లాట్స్ భవనం పైనుంచి పడి ఆకృతి సుతార్ (28) అనే యువతి అనుమానాస్పద మృతి
  • మూడు నెలలు కూడా గడవక ముందే ప్రాణాలు కోల్పోయిన యువతి
  • వరకట్నం కోసం భర్త, అత్తింటి వారే పక్కా ప్లాన్‌తో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కుటుంబ సభ్యుల ఆరోపణ
  • సెక్షన్ 196 (BNSS) కింద కేసు నమోదు చేసి, మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించిన ఢిల్లీ పోలీసులు

Aakriti Sutar Case | త్రినేత్ర.న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) విషాద ఘటన వెలుగుచూసింది. వివాహమైన కేవలం రెండు నెలలకే ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శనివారం సాయంత్రం లోధి కాలనీలోని ఓ భవనం పైనుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయింది. అయితే, వరకట్నం కోసం అత్తింటి వారే పక్కా ప్లాన్‌తో హత్య చేసి, దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలిని పుష్ప్ విహార్‌కు చెందిన ఆకృతి సుతార్‌ (28) గా గుర్తించారు. ఛతర్‌పూర్ ప్రాంతంలోని ఓ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా (Sales Executive) పనిచేస్తున్న ఆకృతికి.. లేబర్ డిపార్ట్‌మెంట్‌లో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వ్యక్తి కొడుకుతో ఈ ఏడాది ఏప్రిల్ 24న వివాహమైంది. జూలై 4వ తేదీ (శనివారం) ఆకృతి రోజూలాగే ఆఫీస్‌కు వెళ్లింది. సాయంత్రం ఆఫీస్ నుంచి బయలుదేరినట్లు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో చెప్పింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె ఫోన్ నాట్-రీచబుల్ రావడం ప్రారంభమైంది.

Delhi Newlywed Dies in Suspicious Fall Family Alleges Murder

అనుమానాస్పద మృతి

ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఇంతలోనే, పాలికా కుంజ్‌లోని NDMC ఫ్లాట్స్ భవనం పైనుంచి పడి ఆకృతి తీవ్రంగా గాయపడినట్లు లోధి కాలనీ పోలీసుల నుంచి వారికి సమాచారం అందింది. వెంటనే ఆమెను ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆమె ఆ భవనం పైనుంచి ఎందుకు పడింది? ఎలా పడిందన్నది ఇంకా మిస్టరీగానే ఉంది.

వరకట్న వేధింపులే కారణమా?

ఆకృతిది ఆత్మహత్య కాదని.. ముమ్మాటికీ హత్యేనని ఆమె సోదరుడు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లైన కొద్ది రోజుల నుంచే భర్త, అత్తింటి వారు అదనపు కట్నం కోసం ఆమెను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని (Physical abuse) మండిపడ్డారు. మానసికంగా ఎంతో ధైర్యంగా ఉండే తమ అమ్మాయి ఎప్పటికీ ఆత్మహత్య చేసుకోదని వారు స్పష్టం చేస్తున్నారు.

ముమ్మరంగా పోలీసుల దర్యాప్తు

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కొత్త క్రిమినల్ చట్టం.. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) లోని సెక్షన్ 196 కింద విచారణ ప్రారంభించారు. ఈ విషయాన్ని సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) దృష్టికి తీసుకెళ్లారు. ఆకృతి ఆత్మహత్య చేసుకుందా? లేదా ఎవరైనా పైనుంచి కిందకు తోసేశారా? అనే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, విచారణ కొనసాగుతోందని పోలీస్ అధికారులు వెల్లడించారు.

Advertisement
Advertisement